కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఓబీసీలకు అన్యాయం : నడ్డా

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఓబీసీలకు అన్యాయం : నడ్డా

  •  మతపరమైన రిజర్వేషన్లు వద్దన్నం
  •  బీజేపీ అధికారంలోకి వస్తే వాటిని తీసేస్తం
  •  కాంగ్రెస్ జూటా వాగ్దానాల పార్టీ

పెద్దపల్లి/హైదరాబాద్: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మతపరమైన రిజర్వేషన్ల కారణంగా ఓబీసీలకు అన్యాయం జరుగుతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఇవాళ పెద్దపల్లిలో జరిగిన బహిరంగ సభలో నడ్డా మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వస్తే మతపరమైన రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పారు. మోదీ రిజర్వేషన్లు రద్దు చేస్తారని రాహుల్ గాంధీ చెబుతున్నారని, అధి సరికాదని అన్నారు.

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు న్యాయం చేసే విధంగా బీజేపీ పనిచేస్తుందని చెప్పారు.  కాంగ్రెస్ పార్టీ సనాతన ధర్మానికి వ్యతిరేకమైన పార్టీ విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక నిజాయితీతో కూడిన పాలన అందిస్తున్నామని చెప్పారు. అభివృద్దిలో దేశాన్ని ఐదో స్థానంలో నిలిపిన ఘనత మోదీకే దక్కిందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 4 కోట్ల ఇండ్లు నిర్మించామని అన్నారు.

రానున్న ఐదేళ్లలో మరో 3 కోట్ల ఇండ్లు నిర్మించడానికి ప్రణాళికలు రెడీ చేశామని చెప్పారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు అంగీకరించలేదని, ఇప్పటి రేవంత్ రెడ్డి సర్కారు కూడా యాక్సెప్ట్ చేయడం లేదని అన్నారు. తెలంగాణకు మూడు వందే భారత్ రైళ్లు ఇచ్చామని అన్నారు. పెద్దపల్లికి లాభం చేకూర్చేలా నిజామాబాద్ నుంచి పెద్దపల్లి మీదుగా ఇండోర్ కు రైలును ప్రారంభించనున్నామని నడ్డా చెప్పారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-06T12:01:31Z dg43tfdfdgfd