కాకినాడలో భలే మామిడి చెట్టు.. ఆకుల కన్నా కాయలు ఎక్కువ!

ఆ ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది మామిడి పంట ఆలస్యం పేరుతో ఎక్కడ మామిడి పండ్లు అనేవి కనిపించడం లేదు. కొన్నిచోట్ల మాత్రం మామిడి పండ్లు గదిలో మగ్గవేసి జాతీయ రహదారుల పక్కన అమ్మకాలు జరుపుతున్నారు. మరికొన్నిచోట్ల మామిడి మొక్కలకు తెగులు వచ్చిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అయితే అందుకు భిన్నంగా ఒకే ఒక్కడు అన్నట్టుగా ఒకే ఒక్కమొక్క మామిడి కాయలు ఆ ఉమ్మడి జిల్లాలో విరగాస్తోంది. చెట్టుకు ఆకులు తక్కువ మామిడికాయలు ఎక్కువనే విధంగా ఆ చెట్టు కనిపిస్తుంది. ఇంతకీ ఆ మామిడి చెట్టు ఎక్కడుంది ఆ విశేషాలు ఏంటి ఒకసారి చూద్దాం..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలు అంటేనే మామిడి పంటలకు ప్రసిద్ధిని చెప్పుకోవచ్చు. రూరల్ ప్రాంతాల్లో ఎక్కువగా రైతులు మామిడి పంటను పండిస్తూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. ఇందులో రైతులు కౌలు రైతులు రెండు రకాలుగా ఉంటారు. దాదాపు కొన్ని ఎకరాలు కౌలుకు తీసుకుని ఏడాది పోడుగునా ఆ మామిడి కాయలు పండిస్తూ వాటిలో వచ్చే రూపాయి పాపాయితో జీవనం కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ చివరకు వస్తున్నప్పటికీ మామిడిపండ్ల జాడలేదు. కొన్ని చెట్లకు కాయలు ఉండడం మరికొన్ని చెట్లకు ఇప్పుడే పూత వస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి.

నిర్లక్ష్యంతో జరిగే అగ్ని ప్రమాదాలే ఎక్కువ.. అవగాహన లేకుంటే భారీగానే నష్టమట.. అవేంటో తెలుసుకోండి మరి!

ఇందుకు భిన్నంగా కాకినాడ జిల్లా రౌతులపూడి కోటనందూరు రహదారిలో ఒకే ఒక్కడన్న విధంగా ఒకే ఒక చెట్టుకు వేలాదిగా మామిడికాయలు దర్శనమిస్తున్నాయి. అయితే అవి పంచదార కంచి మామిడిగా స్థానికులు పేర్కొంటున్నారు. రోడ్డుపై వెళ్తున్న ప్రతి ఒక్కరికి ఈ మామిడి చెట్టు ప్రత్యేక అట్రాక్షన్ గా కనిపిస్తుంది. చెట్టు నిండా అధికంగా కాయలు ఉండడంతో ప్రతి ఒక్కరు ఆ ప్రాంతంలో ఒకసారి ఆగి ఆ చెట్టు కింద ఉన్న చల్లదనంలో సేద తీరుతూ ఆ మామిడి కాయలను కనులారా చూస్తూ ఉత్సాహంగా గడుపుతున్నారు.

ఇంద్రవెల్లి ఘటనకు 43 ఏళ్లు…

చుట్టుపక్కల అనేక చెట్లు ఉన్నప్పటికీ ఈ ఒక్క చెట్టుకే అన్నివేళల్లో కాయలు ఎందుకు కాస్తున్నాయన్నది రైతు కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఏదిఏమైనా ఈ కాయలు పళ్ళు అయ్యే వరకు ఉంటే ఫరవాలేదు. మధ్యలో ఈ వేసవి వేడికి ఉడికిపోయి రాలిపోయాయి. మరి ఏమి చేయలేమంటూ రైతులు పేర్కొంటున్నారు. మామిడికాయ జాతులనే పంచదార కంచె అనేది అరుదుగా ఉంటుంది. కొన్ని కొన్ని కాయలు తీపి మరికొన్ని మాత్రం తీపి పులుపు మిక్స్ అయి ఉంటుంది. దీని రేటు కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం పచ్చిగా రౌండ్ గా ఉన్న ఈ కాయలు ఏ మేరకు రైతుకు ఉపయోగపడతాయో చూడాల్సిందే.

ఈ ఏడాది మామిడిపండు తినాలంటే మే నెల వరకు ఆగాల్సిందే అంటూ రైతులు పేర్కొంటున్నారు. కొన్ని చెట్లకు మామిడికాయలు ఉండగా మరికొన్ని చెట్లకు మామిడిపూత ఉండడం ఇంకొన్ని చెట్లకు తెగుళ్లు రావడం ఇంకొన్ని చెట్లకు అసలు మామిడి కాయలే పూయకపోవడం ఇలా మామిడి చెట్ల పరిస్థితి అగమ్య గోచరంగా ఉమ్మడి జిల్లాలో తయారైన పరిస్థితి నెలకొంది. ఉన్న కాయలు కాస్త చిన్నవిగా ఉండడం మరికొన్ని పూత దశలో ఉండడం అంటే కనీసం మే నెలాఖరువరకు అయితే గాని ఇవి పూర్తిగా మార్కెట్లోకి రాలేని పరిస్థితి నెలకొంది. అయితే ఇందుకు భిన్నంగా ఈ చెట్టు మాత్రం కాయలతో కళకళలాడుతూ ఉంది.

2024-04-24T02:42:13Z dg43tfdfdgfd