కాలిఫోర్నియా వర్సిటీలో..పాలస్తీనా అనుకూల నినాదాలు

కాలిఫోర్నియా వర్సిటీలో..పాలస్తీనా అనుకూల నినాదాలు

కాలిఫోర్నియా : లాస్ ఏంజెలెస్ లోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొంత మంది స్టూడెంట్లు పాలస్తీనా అనుకూల నినాదాలు చేశారు. ఆ దేశానికి అనుకూలంగా నినాదాలు చేస్తూ వారు ఏర్పాటు చేసుకున్న క్యాంపుపై ఇజ్రాయెల్  సపోర్టర్లు దాడి చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. దీంతో వర్సిటీ అధికారులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసు బలగాలు  గురువారం తెల్లవారుజామున వర్సిటీలోకి ప్రవేశించి వర్సిటీని తమ అదుపులోకి తీసుకున్నాయి.

పాలస్తీనా వర్గం స్టూడెంట్లు ఏర్పాటు చేసుకున్న క్యాంపును బలగాలు ధ్వంసం చేశాయి. అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు సూచించినా విద్యార్థులు వినకపోవడంతో వారిని అరెస్టు చేశారు. విద్యార్థులు లోపలికి వెళ్లకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో వర్సిటీ క్యాంపస్ ను గురు, శుక్రవారం బంద్ చేస్తామని అధికారులు తెలిపారు.

కాగా, అంతకుముందు న్యూయార్క్  సిటీలోని కొలంబియా వర్సిటీలో కూడా పలువురు విద్యార్థులు పాలస్తీనాకు అనుకూలంగా నినాదాలు చేశారు. వర్సిటీ క్యాంపస్ లో ఓ బిల్డింగ్ ను ఆక్రమించి వారు నిరసన తెలిపారు. దీంతో పోలీసులు నిరసనకారులను అరెస్టు చేసి ఏర్పాటు చేసుకున్న క్యాంపును తొలగించారు.

  ©️ VIL Media Pvt Ltd.

2024-05-03T04:03:43Z dg43tfdfdgfd