కేసీఆర్ కలుగులో ఎలుకలాంటోడు..ఎన్నికలప్పుడే బయటకొస్తడు : బండి సంజయ్

కేసీఆర్ కలుగులో ఎలుకలాంటోడు..ఎన్నికలప్పుడే బయటకొస్తడు : బండి సంజయ్

 మాజీ సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. కేసీఆర్ కలుగులో ఉన్న ఎలుకలాంటోడని ఎన్నికలప్పుడే బయటకొస్తరని.. ఆ తరువాత ఫాంహౌజ్ కే పరిమితమౌతాడని విమర్శించారు. ఈ ఎన్నికలు ఫైటర్ కు చీటర్స్, లూటర్స్ కు, గరీబోళ్ల బిడ్డకు గడీల వారసులకు మధ్య పోటీ అని తెలిపారు. కరీంనగర్ ఎస్సారార్ కాలేజీ గ్రౌండ్ లో వాకర్స్ ను కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు బండి సంజయ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

ప్రజల ముఖమే చూడని అభ్యర్థులకు, ప్రజల పక్షాన నిత్యం ప్రశ్నించే గళానికి పోటీ అని బండి సంజయ్ తెలిపారు. ఆలోచించి ఓటేయండని కోరారు. ముస్లిం పార్టీ కాంగ్రెస్... హిందుత్వ టీం బీజేపీ అని అన్నారు. 370 సీట్లతో మోదీ హాట్రిక్ సాధించబోతున్నరని ధీమా వ్యక్తం చేశారు బండి సంజయ్.

©️ VIL Media Pvt Ltd.

2024-04-27T03:54:57Z dg43tfdfdgfd