కేసీఆర్ వల్లే ఇరిగేషన్ రంగం నాశనమైంది: ఉత్తమ్ కుమార్

కేసీఆర్ వల్లే ఇరిగేషన్ రంగం నాశనమైంది: ఉత్తమ్ కుమార్

కేసీఆర్ తప్పుడు నిర్ణయంతో ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు తీవ్ర నష్టం జరిగిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మంగళవారం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఉత్తమ్ కుమా రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నాడని.. అబద్దాలతో గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏప్రిల్ 24వ తేదీ బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణా జలాలను ఏపికి అప్పనంగా అప్పజెప్పారని కేసీఆర్ పై ఫైరయ్యారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ పాయింట్స్

  • కేసీఆర్.. కృష్ణా జలాలను సరిగా ఉపయోగించుకోలేదు
  • కృష్ణా జలాల్లో 555 టీఎంసీలు రాష్ట్రానికి రావాలి
  • గత కేసీఆర్ ప్రభుత్వం 299 టీఎంసీలు మాత్రమే అడిగింది.
  • గత పదేళ్లు కృష్ణా జలాలను కేసీఆర్ పట్టించుకోలేదు
  • పదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రానికి చేసిందేమీ లేదు
  • రాష్ట్రంలో కరెంట్ కోతలు లేకుండా చూస్తున్నాం
  • భద్రాద్రి పవర్ ప్లాంట్ కూడా సరిగా నిర్మించలేదు
  • కేసీఆర్ వల్లే రాష్ట్రంలో ఇరిగేషన్ రంగం నాశనమైంది.
  • సరైన ప్రణాళిక లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది.
  • కాంగ్రెస్ చేపట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ బెస్ట్
  • మేడిగడ్డ బ్యారేజీ కుంగింది కేసీఆర్ పాలనలోనే
  • కేసీఆర్ చేతగాని తనంతోనే కాళేశ్వరం, మేడీగడ్డ ధ్వంసం అయ్యాయి.
  • కేసీఆర్ ఫ్యామిలీ దోపిడీ భారం రాష్ట్రంపై పడింది.
  • కేసీఆర్ హయాంలోని నాసిరకం పనులతోనే పంటలు ఎండాయి
  • ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా రావు
  • ధాన్యం కొనుగోళ్లపై బీఆర్ఎస్, బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి.
  •  రైతులు పండించిన ప్రతి గింజా ప్రభుత్వం కొంటుంది
©️ VIL Media Pvt Ltd.

2024-04-24T15:30:04Z dg43tfdfdgfd