కొలుసు పార్థసారథి: బాల్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం

Kolusu Parthasarathy Biography: ఆయన కృష్ణాజిల్లాలో తిరుగులేని నాయకుడు.పార్టీ ఏదైనా విజయం మాత్రం ఆయన సొంతం. అందుకే ఆయనకు టికెట్ ఇచ్చేందుకు పార్టీలు వెనుకాడవు. ఆయనే మాజీ మంత్రి ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి. ఇటీవల వైసీపీ కి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరారు. రానున్న 2024 అసెంబ్లీ ఎన్నికల్లో నూజివీడు నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో మాస్ లీడర్ కొలుసు పార్థసారథి వ్యక్తిగత, రాజకీయ జీవితంపై ప్రత్యేక కథనం.

బాల్యం, కుటుంబ నేపథ్యం 

కొలుసు పార్థసారథి 1965 ఏప్రిల్ 18న ఏపీలోని కృష్ణా జిల్లా కరకంపాడులో రాజకీయ నేపథ్యం గల కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి పేరు కొలుసు పెదారెడ్డి, ఆయన ప్రముఖ రాజకీయ నాయకుడు. 1991, 1996లో మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఆయన తల్లి గృహిణి. ఇక పార్థసారధి తన ప్రాథమిక విద్యను స్వగ్రామంలోనే పూర్తి చేశారు. ఇంటర్ సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజీలో అభ్యసించగా.. బిటెక్ చేయడం కోసం సిబిఐటి లో చేరారు. కానీ, పలు కారణాల వల్ల మధ్యలోనే చదువు ఆపేశారు. 

రాజకీయ జీవితం 

కొలుసు పెదారెడ్డి వారసుడుగా పార్థసారథి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన తొలుత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC) పార్టీ సభ్యునిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఎంత ఆక్టివ్ గా పని చేసేవారు.  వైయస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఆయన పనితనం గుర్తించారు. దీంతో పార్టీలో సముచిత స్థానం కల్పించారు. ఈ క్రమంలోనే 2004 ఎన్నికల్లో ఉయ్యూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఆయనకు టికెట్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఆయనకు విజయం సాధించడంతో మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అలాగే.. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత 2009 ఎన్నికల్లో పార్థసారథి పెనమలూరు నియోజకవర్గం నుంచి రెండోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.  కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారాన్ని చేపట్టింది వైయస్సార్ ముఖ్యమంత్రి అయ్యారు 

కీలక పదవులు

ఈ క్రమంలో  వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన కేబినెట్‌లోకి పార్థసారధిని ఆహ్వానించి,  పశుసంవర్ధక, డెయిరీ డెవలప్‌మెంట్, ఫిషరీస్, వెటర్నరీ యూనివర్శిటీ శాఖల మంత్రిగా నియమించారు. వైయస్సార్ అకాల మరణంతో రోశయ్య ముఖ్యమంత్రి అయ్యారు. సీఎం రోశయ్య బృందంలోనూ అదే శాఖలో కొనసాగారు. ఆ తరువాత ముఖ్యమంత్రి అయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో భాగస్వామ్యం అయ్యారు. మంత్రి మండలి పునర్నిర్మాణంలో పార్థసారధికి సెకండరీ ఎడ్యుకేషన్, ప్రభుత్వ శాఖను కేటాయించారు. పరీక్షలు, AP రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి సెకండరీ ఎడ్యుకేషన్ మంత్రిగా అవకాశాన్ని ఇచ్చారు. 

  

వైసీపీలో చేరిక 

కానీ, ఏపీ విభజనకు కాంగ్రెస్ అనుకూలంగా వ్యవహరించడంతో ఆ పార్టీకి రాజీనామా చేశారు పార్థసారధి. ఈ సమయంలో సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఆ తరువాత 2014లో వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యం( 2024)లో జరిగిన ఎన్నికల్లో  మచిలీపట్నం ఎంపీగా ఆయనకు టికెట్ ఇచ్చారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. అయితే.. ఈ ఎన్నికలలో  టిడిపి నేత కొనకల్ల నారాయణరావు ఎంపీగా ఎన్నికల్లో గెలుపొందారు. అలాగే.. రాష్ట్రంలో పార్టీ ఓటమిపాలైంది.  అయినా పార్టీ కష్టకాలంలో జగన్ వెంట నడిచారు. 

 

ఆ తరువాత 2019లో జరిగిన ఎన్నికల్లో పెనమలూరు నుంచి పోటీ .. టిడిపి నేత బోడె ప్రసాద్ పై 11,317 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పెనమలూరు అసెంబ్లీ స్థానం నుంచి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పార్థసారథి వైసీపీ అభ్యర్థిగా విజయాన్ని సాధించారు.  వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆయనకు( పార్థసారథికి) మంత్రిగా అవకాశం ఇస్తారని అందరు అనుకున్నారు. కానీ,  తొలి మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇవ్వలేదు రెండోసారి మంత్రివర్గ విస్తరులైన ఆయనకు అవకాశం వస్తుందని అనుకున్నారు. ఈ సమయంలో కూడా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. అయినా పార్థసారథి ఏ మాత్రం కుంగిపోలేదు. 

టీడీపీలో చేరిక 

రానున్న 2024 ఎన్నికల్లో పెనమలూరు టికెట్ ను తనకు ఇచ్చేందుకు జగన్ సుముఖంగా లేదని తెలియడంతో పార్థసారథి కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ఆర్సిపి పార్టీకి వీడ్కొలు పలికి.. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నూజివీడు నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున బరిలో నిలిచారు

2024-03-28T21:29:46Z dg43tfdfdgfd