ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఆందోళన

ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఆందోళన

  • చేరికలను అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు
  • ఖమ్మం జిల్లా వైరా క్యాంపు ఆఫీసులో ఆందోళన
  • టెంట్లు కూల్చి, కరెంట్​ఫ్యూజులు పీకి నిరసన
  • సర్ది చెప్పిన ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు 

వైరా, వెలుగు : కాంగ్రెస్ పార్టీ  ఎమ్మెల్యే అభ్యర్థి ఓటమికి పనిచేసిన బీఆర్ఎస్ లీడర్లను ఎలా పార్టీలోకి తీసుకుంటారంటూ ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ సమక్షంలో  కొణిజర్ల మండలం బీఆర్ఎస్  మండల అధ్యక్షుడు చిరంజీవి, సొసైటీ అధ్యక్షుడు చెరుకుపల్లి రవి, ఇతర లీడర్ల చేరికలను వ్యతిరేకిస్తూ మండల కాంగ్రెస్ లీడర్లు ఆదివారం నిరసన తెలిపారు. స్థానిక లీడర్లకు చెప్పకుండా పార్టీలో చేర్చుకోవద్దంటూ క్యాంప్ ఆఫీసు వద్ద ఏర్పాటు చేసిన టెంట్లను కూల్చివేశారు.

ఎమ్మెల్యే రాందాస్ నాయక్​తో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్​ను అడ్డుకున్నారు. క్యాం పు ఆఫీసులోని కరెంట్​మీటర్ల ఫ్యూజ్​లను పీకేశారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, పీసీసీ సభ్యుడు వడ్డె నారాయణరావు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారన, ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఎమ్మెల్యే రాందాస్ నాయక్,  పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ కార్యకర్తలకు సర్ది చెప్పారు. కొణిజర్ల మండల లీడర్ల చేరికను నిలిపివేస్తూ, కార్యకర్తల అభీష్టం మేరకే నడుచుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-06T02:30:04Z dg43tfdfdgfd