గుడిలో దేవత విగ్రహాలు ఉండవు.. కానీ కోరినవన్నీ జరుగుతాయి! ఎక్కడంటే..

500 ఏళ్లచరిత్ర గల సుంకులమ్మ గుడి ఇది. ఇక్కడ పూర్వం నుంచి అనేక రకాల పూజ కార్యక్రమాలు చేస్తు వస్తున్నారు గ్రామ పెద్దలు. ఈ అమ్మవారి విశిష్టత ఏమిటంటే.. కోరిన కోరికలు తీర్చే మహ తల్లిగా భక్తులు కొలుస్తారు. విశ్వాసంతో భక్తులు అడిగిన కోరికలు తీర్చటంతో వరాలు ఇచ్చే దేవతగా పేరు ప్రతిష్టలు పొందారు. అసలు ఈ దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా... ఈ దేవత విశిష్టత గురించి లోకల్ 18 ప్రతినిధి వివరిస్తారు.

నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలంలోని తరిగోపుల గ్రామం అది. ఇక్కడ దాదాపుగా 500 సంవత్సరాల చరిత్ర గల సుంకులమ్మ దేవాలయం ఉంది. ఇక్కడికి వచ్చిన భక్తులు సుంకులమ్మను దర్శించుకున్న అనంతరం మెుక్కులు చెల్లించుకుంటారు. వేలాదిగా భక్తులు నిత్యం తరలివస్తుంటారు. ఎందుకంటే ఈ సుంకలమ్మ కోర్కెలు కోరిన వారికి తీర్చటంతో జనాలు అధిక సంఖ్యలో వస్తుంటారని అక్కడ పూజరి వెంకట రమణ లోకల్ 18తో చెప్పారు. తాను గత కొన్ని ఏళ్లుగా సుంకులమ్మకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని చెప్పారు. ప్రతి మంగళవారము, శుక్రవారం రోజులో సుంకులమ్మ దేవతను దర్శించుకుంటుంటారు భక్తులు. అమ్మవారికి నిత్యం సేవ కార్యక్రమాలు చేయటం చాలా మనఃశాంతిని ఇస్తుందన్నారు.

నేటి నుంచి అకౌంట్లలోకి డబ్బులు!

ఇక్కడ మరి ప్రత్యేకత ఏమిటంటే... మనం ఎక్కడైనా సరే గుళ్లో దేవతల విగ్రహలను చూస్తాం. కానీ ఇక్కడ మాత్రం అలాంటి విగ్రహాలు మాత్రం కనిపించవు. గుడి మాత్రం ఉంటుంది. కానీ విగ్రహాలే కనిపించవు. రెండు పెద్ద బండ రాళ్లలో సుంకలమ్మ కొలువై ఉన్నారని భక్తులు విశ్వసిస్తారని... పూజరిగా తాను కూడా వాటికే పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు. నాటి పెద్దల నుంచి నేటి వరకు అందరు ఆ పెద్ద రాళ్లకే పూజలు నిర్వహిస్తామని తెలిపారు.

రైతులకు అదిరే శుభవార్త.. అకౌంట్లలోకి మళ్లీ రూ.2 వేలు, వచ్చేది ఆరోజే?

ఈ స్థలంలోనే అమ్మవారు కొలువయ్యారని స్థలపురాణం చెబుతోందన్నారు. అందుకే భక్తులు కూడా భక్తి శ్రద్దలతోమొక్కులను ఇక్కడికి వచ్చి తీర్చుకుంటారని పూజారి వెంకటరమణ తెలిపారు. మరి ముఖ్యంగా ఏదైనా చిన్నపిల్లలకుఅమ్మవారు పోసినట్లయితే... వారం రోజులపాటు సుంకులమ్మ దేవతకు చల్లటి నీళ్లు, పెరుగన్నం, వంకాయ కూర, పులగంసుంకులమ్మ దేవతకు నైవేద్యంగా ఉంచినట్లయితే తట్టు మటుమాయం అవుతుందని తెలిపారు.

2024-05-06T02:14:13Z dg43tfdfdgfd