గుడ్ న్యూస్.. ఆ దరఖాస్తు గడువు పెంపు..

ఎంబీఏ, ఎంసీఏ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ఐసెట్ ప్రవేశ పరీక్ష దరఖాస్తుల గడువును పొడిగించారు. ఈ మేరకు ఐసెట్ కన్వీనర్, కాకతీయ యూనివర్సిటీ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రొఫెసర్ ఎస్.నరసింహ చారి ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 30తో గడువు ముగియగా అభ్యర్థుల విన్నపం మేరకు మే 7 వరకు గడుపొడిగించినట్లు ఆయన పేర్కొన్నారు.రూ:250 అపరాధ రుసుంతో మే 17 వరకు రూ:500 అపరాధ రుసుంతో 27వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల దరఖాస్తుల్లో మార్పులు, చేర్పులు సరిదిద్దుకునేందుకు మే 17నుంచి 20వరకు అవకాశం ఉందన్నారు. దరఖాస్తు ఫీజుగా ఎస్సీ,ఎస్టీ, దివ్యంగ అభ్యర్థులు రూ:500,ఇతరులు రూ:750 చెల్లించాలన్నారు. మే 28 నుంచి ఆన్లైన్ లో హాల్ టికెట్స్ అందుబాటులో ఉంటాయని చెప్పారు. జూన్ 5,6వ తేదీల్లో ఐసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.ఈ ప్రవేశ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించనున్నారు.జూన్ 5న రెండు సెషన్లలో,జూన్ 6న ఒకే సెషన్లలో ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.జూన్ 15న ఐసెట్ ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు.అనంతరం జూన్ 28న పరీక్ష ఫలితాలు విడుదల చేయనున్నారు.

గ్రహాలు మీకెంత వ్యతిరేకంగా ఉన్నా ఈ గుడికి వెలితే మీరు కోరుకున్నది జరగాల్సిందే!

కోర్సుల అర్హతలు...

ఎంబీఏ,ఎంసీఏకు కనీసం50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ(బీఎస్సీ,బీకాం,బీబీఏ,బీఏ,బీబీఎం, బీసీఏ,బీటెక్,బీఫార్మసీ)అయితే ఇంటర్ స్ధాయిలో కచ్చితంగా మ్యాథ్స్ ఒక సబ్జెక్ట్ గా చదివి ఉండాలన్నారు.

వయోపరిమితి:

ఐసెట్ నోటిఫికేషన్ సమయానికి(5-3-2024) 19 సంవత్సరాలు నిండి ఉండాలన్నారు.

రూ.7 వేలు పెడితే రూ.47 వేలు.. రైతులకు గుడ్ న్యూస్!

పరీక్ష విధానం..

మొత్తం 200 మార్కులకు ఐసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షల మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి.పరీక్ష మూడు సెక్షన్లు ఏ,బీ,సీ వీటిలో సెక్షన్-ఏ అనలిటికల్ ఎబిలిటీ 75 మార్కులు,సెక్షన్-బీ మ్యాథమెటికల్ ఏబిలిటీ 75 మార్కులు,సెక్షన్-సీ కమ్యూనికేషన్ ఎబిలిటీ 50 మార్కులు ఉంటాయని తెలిపారు.

పరీక్ష కేంద్రాలు..

హైదరాబాద్,వరంగల్, నర్సంపేట్,కరీంనగర్,ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం,కోదాడ, నల్గొండ, సత్తుపల్లి, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్,నిజామాబాద్, కర్నూల్,విజయవాడ,తిరుపతి విశాఖపట్నం.

2024-05-03T09:18:49Z dg43tfdfdgfd