గుర్రాలే కార్గొ బస్సులు.. నెత్తి మీద అడ్డాకులు పెట్టుకొని వినూత్నంగా ఇలా..

తమ గ్రామాలకు రోడ్డు వేస్తేనే తాము ఓట్లు వేయడానికి వస్తారని, లేని పక్షంలో ఓట్లు వేయలేమని గిరిజనులు అంటున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెద్దకోట కొండ శిఖర గ్రామాలు మడ్రేబు, పివిటుజి కొందు ఆదివాసి గిరిజన 45 కుటుంబాలు170 జనాభా కొండ శిఖరంపై జీవిస్తున్నారు. తమ గ్రామంలో 70 మంది ఓట్లు కలిగి ఉన్నారని, తాము ఓట్లు వేయాలంటే పెద్దకోట పంచాయతీ కేంద్రానికి పోలింగ్ బూత్ ఉందని చెప్పారు.

ఈ బూత్ కి వెళ్లి 50 మంది ఓట్లు వేయాలి.‌ వేలమామిడి పోలింగ్ బూత్ కి 15 మంది వెళ్లాలి. పెద్దకోట బూతుకు వెళ్లాలంటే 30 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి. వేలమాడి పోలింగ్ బూత్ కి వెళ్లాలంటే 18 కిలోమీటర్లు వెళ్లాలని వివరించారు.

తమ గ్రామానికి ఆనుకొని ఉన్న జణబాడు పంచాయతీ దాయెర్తి పివిటిజి తెగ గిరిజనులు గ్రామంలో 22 2ఓట్లు ఉన్నాయి. జీనబాడు పంచాయతీ కేంద్రానికి ఓట్లు వేయాలంటే 30 కిలోమీటర్ల ప్రయాణం చేయవలసిందే. ఆయా గ్రామాలకు రోడ్డు సదుపాయాలు లేవు. జ్వరం వచ్చినా ఏం జరిగినా డోలీ మోత తప్పదు. ఇక ఆదివాసి కోదు గర్భిణీ స్త్రీలు ప్రసవం మధ్యలో జన్మిస్తున్నటువంటి తల్లులు చాలామంది ఉదాహరణలు ఉన్నాయి.

18 ఏళ్లు నిండిన ప్రతీ మహిళకు రూ.5 లక్షలు.. దరఖాస్తు చేసుకోండిలా..

ఈ మధ్యకాలంలో చీడివలస గ్రామంలోని కిలో సుజాతతో అడవి మార్గంలోని బిడ్డకు జన్మనిచ్చింది. ఇతర ఆరోగ్య సేవలు పొందాలంటే తమకు గుర్రాలు దిక్కు అని చెప్పారు. ఆ తర్వాత కిలోమీటర్ల దూరంలో అంబులెన్సులు ఉంటాయని ఆవేదన చెందారు.

2017 నుండి 2022 సంవత్సరం మధ్య రోడ్లు వేయకుండా, రోడ్లు వేసినట్లుగా కోట్లు రూపాయలు బిల్లులు మార్చేశారని ఆరోపించారు. ఈ విషయంపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ పిర్యాదు చేసినా ఎటువంటి దర్యాప్తులు చేయలేదని, మా జీవితాలు బాగుపడాలంటే పండించే పంటలు సంతకు తీసుకెళ్లి అమ్ముకోవాలంటే తమ గుర్రాలే కార్గో బస్సులుగా ఉపయోగిస్తామంటున్నారు. ఏ ప్రభుత్వాలు తమని పట్టించుకోవడం లేదని తమకు రోడ్లు వేస్తేనే.. ఓట్లు వేస్తామని నినాదాలు చేసుకుంటూ గ్రామంలో ప్రచారం చేశారు‌.

పలు పంచాయతీ పరిధిలోని దాయెత్తి గ్రామాల్లో గుర్రాలతో ర్యాలీగా వెళ్లి మాకు రోడ్లు వేయండని, మేము ఓట్లు వేస్తామని ప్రచారం నిర్వహించారు. కార్యక్రమానికి పివి టీజీ ఆదివాసీ గిరిజన సంఘం కార్యదర్శి కొండతాంబల నర్సింగరావు, కొండతామృ దాసు, దాయార్థి గ్రామానికి చెందిన సేదరి సుధాకర్ ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం ఐదవ షెడ్యూల్ సాధన కమిటీ అధ్యక్షులు కే గోవిందరావు, పివిటిజి ఆదివాసి గిరిజన మహిళలు తదితరులు పాల్గొన్నారు.

2024-05-08T10:52:36Z dg43tfdfdgfd