గీత కార్మికుల పాలిట వరంలా మారిన ముంజలు.. రోజుకు రూ.2వేలు లాభాన్ని గడిస్తున్నారు !

వేసవి కాలం ప్రారంభం కావడంతో ఎండలు బాగా మండిపోతున్నాయ్. ఈ వేడిగాలుల నుండి ఉపశమనం కోసం ప్రజలు ఎన్నో రకాల శీతల పానీయాలు, కొబ్బరి బొండాలను సేవిస్తూ ఉపశమనం పొందుతున్నారు. ఈ వేసవి కాలంలో మనం తీసుకునే ఆహారం శరీరానికి మేలు చేసే రీతిలో ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అందుకే సీజన్ కి తగినట్లుగా మార్కెట్ లోకి వచ్చిన పండ్లను తినాలని అంటున్నారు. ఈ సీజన్ లో లభించే తాటి ముంజలు, పుచ్చకాయలను తప్పక రుచి చూడాలంటున్నారు వైద్యులు.

వీటిలో నీటి శాతం ఎక్కువ కాబట్టి.. వాటిని మనం ఎంత తింటే అంత ఆరోగ్యమని వైద్యులు సూచిస్తున్నారు. వేసవిలో తాటి ముంజలను విక్రయించేందుకు వ్యాపారులు సైతం ముందుకు వస్తారు . ఒకప్పుడు ఇవి గ్రామీణ ప్రాంతాల్లో, నగరాల్లో పెద్దగా లభించేవి కావు. అయితే ఇటీవల కొంత మంది కల్లుగీత కార్మికులు కల్లు వ్యాపారం లేక అక్కడక్కడ చెట్ల కింద ముంజల వ్యాపారం సాగిస్తున్నారు.

విశాఖలో అయితే డజన్ రూ. 80 ల నుండి రూ. 100 ల వరకు ముంజలు ధర పలుకుతున్నాయి. ఉమ్మడి విశాఖ గ్రామీణ ప్రాంతాలలో అయితే రూ. 40 నుండి రూ. 50ల ధరతి అమ్మకాలు సాగిస్తున్నారు.

నార్మల్ దోశ తిని బోర్ కొట్టిందా.. ఈ హోటల్ లో వెరీ స్పెషల్ దోశ మీకోసం వెయిటింగ్ !

ఈ సీజన్ లో కల్లు వ్యాపారం లో పెద్దగా లాభాలు రాకపోవడంతో తాటి ముంజలు వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఉదయాన్నే కల్లు గీత కార్మికులు కుటుంబంతో సహా తాటిచెట్ల వెంట తిరిగి తాటికాయలు కోయడం ఇప్పుడు రోజువారీ దినచర్యగా ఎంచుకున్నారు. అనంతరం వాటిని విశాఖ కు తీసుకురావడం సాయంత్రం వరకు అమ్మకాలు జోరుగా జరిపి రూ. 2 వేల మేర లాభాలతో ఇంటి బాట పడుతున్నారు వీరు. ఈ సమ్మర్ సీజన్ కాకుండా ప్రతి సీజన్ లో తాటి ముంజల విక్రయాలు జోరుగా సాగిస్తామని, ఇప్పుడు ఈ వ్యాపారమే ఉపాధిగా మారిందని లోకల్18 తో వ్యాపారి శ్రీను తెలిపారు.

టెన్త్ లో 10 కి 10.. ఇంటర్ లోనూ బెస్ట్ మార్క్స్ సాధించిన ట్విన్స్

ఇలా సమ్మర్ సీజన్ లో వచ్చిన తాటిముంజల తో ఎన్నో కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. సమ్మర్ ఐస్ యాపిల్ గా గుర్తింపు పొందిన ఈ ముంజలను తింటే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు తెలుపుతున్నారు. మీరు ఈ ముంజలను తిన్నారా లేదా.. తినకుంటే ఓసారి రుచి చూసేయండి మరి!

2024-04-27T09:40:20Z dg43tfdfdgfd