చంద్రబాబు ఎన్నికల హామీలు నీటి మూటలేనా.. సాధ్యసాధ్యాలపై ఆర్ధిక నిపుణుల అంచనాలు ఇవే

ఐదేళ్లకు ఒకసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు రాజకీయ పార్టీలు వాగ్ధానాలు చేస్తాయి. ప్రజా సమస్యలు తీరుస్తామని హామీలు ఇస్తాయి. సంక్షేమ పాలనతో పాటు పలు ప్రజ ఉపయోగకరమైన పథకాలను ప్రవేశపెట్టి తద్వారా మేలు చేస్తామని మాటిస్తాయి. ఈ తరహా వాగ్ధానాలకు ఎన్నికల హమీలు అంటారు. ఏవైతే ప్రజలకు అందజేస్తామని మాటిస్తాయో వాటిని తమ ఎన్నికల మానిఫెస్టోగా ఎలక్షన్స్ సమయంలో ప్రకటిస్తాయి. అయితే మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే అక్కడి ప్రజలకు రాజకీయ పార్టీలు తమకు తోచిన విధంగా..అమలుకు సాధ్యమయ్యే విధంగా హామీలు ఇస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ(TDP)..ఈ ఎన్నికల్లో జనసేన, బీజేపీ(BJP)తో పొత్తుపెట్టుకొని కూటమిగా పోటీ చేస్తూ ప్రజలకు అలివిగాని హామీలను ప్రకటిస్తోందని వైసీపీ శ్రేణులు, రాజకీయ, ఆర్ధిక నిపుణులు భావిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) తన ప్రతీ ఎన్నికల ప్రచార సభలు, వేదికలపై ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. అయితే చంద్రబాబు నాయుడు హామీల పేరుతో ఈ ఎన్నికల్లో ప్రజల్ని మభ్యపెట్టి లబ్ధి పొందాలనుకుంటున్నారనే వాదనలు అటు రాజకీయ వర్గాల్లో..ఇటు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. మరీ ముఖ్యంగా రాష్ట్ర ఆదాయం, ప్రభుత్వ రాబడి కంటే రెట్టింపు స్థాయిలో ప్రజలకు గ్యారెంటీల రూపంలో డబ్బు ఖర్చు చేస్తామని చెప్పడం చూసి ఆర్ధికవేత్తలు సైతం నోరు వెళ్లబెడుతున్నారు. ఇదెలా సాధ్యమని ఆశ్చర్యపోతున్న పరిస్థితి నెలకొంది. ఉదాహరణకు చెప్పుకుంటే బీసీ మహిళలకు పెన్షన్ 50ఏళ్లకేఇస్తామని చెప్పారంటే రాష్ట్రంలో సుమారు 32-33లక్షల మందికి ఫించన్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఒక్కొక్కరికి నెలకు 4వేల రూపాయల చోప్పున 32లక్షల మందికి లెక్కేస్తే నెలకు 1400 కోట్లు కావాలి. వీటితో పాటు యువతకు నిరుద్యోగభృతి, ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ లు, వాలంటీర్ల జీతాలు లెక్క చూస్తే చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన మాటలు నీటి మూటలే అంటున్నారు వైసీపీ శ్రేణులు, ఆర్ధిక నిపుణులు.

లెక్కలేసుకోకుండానే అలివిగాని హామీలు..

మాకు అధికారం అప్పగిస్తే మీకు మేలు చేస్తామని ప్రతీ రాజకీయ పార్టీ ఎన్నికల సమయంలో చెప్పుకోవడం సర్వ సాధారణం. ప్రజాకర్షక పథకాలు, ఆర్ధిక తోడ్పాటునిచ్చే రుణమాఫీ వంటి స్కీంలు కూడా ప్రకటించడం కామన్ గా జరిగే ప్రక్రియే. కాని ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రతిపక్ష టీడీపీ కూటమి ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల పథకాలకు అయ్యే ఖర్చు చూస్తే ..ఇది సాధ్యమయ్యే విషయమేనా అనే సందేహం ప్రతీ ఒక్కరిలో కలుగుతోంది. మరీ ముఖ్యంగా ఆర్ధిక వేత్తలు, వైసీపీ శ్రేణులు చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలు ఒట్టి నీటి మూటలేనే అభిప్రాయాన్ని బాహాటంగా వ్యక్తపరుస్తున్న పరిస్థితి ఉంది. బీసీ మహిళలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పారంటే రాష్ట్రంలో సుమారు 32-33లక్షల మందికి ఫించన్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఒక్కొక్కరికి నెలకు 4వేల రూపాయల చోప్పున 32లక్షల మందికి లెక్కేస్తే నెలకు 1400 కోట్లు కావాలి. వీటితో పాటు నిరుద్యోగ యువతకు నెలకు రూ. 3వేలు ఇవ్వాలంటే రాష్ట్రంలోని 20 లక్షలమందికీ రూ.600 కోట్లు కావాలి. అలాగే ఉద్యోగస్తుల జీతభత్యాలు, పెన్షన్లతో కలిపి నెలకు రూ.4,800 కోట్లు, వాలంటీర్లు 2 లక్షల 65 వేల మంది ఉన్నారు, ఒక్కొక్కరికీ రూ.10 వేలు అంటే రూ.265 కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుంది.

Tirumala Room Booking: తిరుమల వెళ్తున్నారా.. ఆన్‌లైన్‌లో గదులు దొరక్కపోతే ఇలా చేయండి, మీకు రూమ్ పక్కా..

తడిసిమోపెడు కానున్న ఆర్ధిక భారం..

వీటితో పాటుగా 18 -50 ఏళ్ళ వరకు ఉన్న మహిళలకు రూ.1,500 చొప్పున ఇస్తామని మాటిచ్చారు చంద్రబాబు. ఈ వయసులో ఉన్న వాళ్ల లెక్క చూస్తే రాష్ట్రంలో 80 లక్షల మంది ఉన్నారు. ఇది దాదాపు రూ.1,200 కోట్ల వరకు అవసరం అవుతుంది. అంతే మొత్తం దాదాపు రూ.13,200 కోట్లు ప్రతి నెలా ఒకటో తారీఖునే ఉదయానికల్లా రెడీగా ఉండాలి. గతంలో చంద్రబాబు నాయుడు ఐదేళ్లపాటు సృష్టించిన సంపద చూస్తే ... అయన దిగి వెళ్లిపోయే నాడు ఖజానాలో ఉన్నది రూ.100 కోట్ల రూపాయలు. అంటే ఇప్పుడున్న రాష్ట్ర ఆదాయంతోనే ఈ హామీలన్ని నెరవేర్చాల్సి ఉంటుంది. ఇవి కాకుండా ఆరోగ్యశ్రీ, మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ పిల్లకు పెట్టె ఆహారం.. వసతిదీవెన, విద్యాదీవెన ప్రభుత్వ బడుల్లో నాడు-నేడు పనులు ఇవన్నీ కాకుండానే మామూలుగా పథకాలకు ప్రతి నెలా ఒకటో తారీఖు ప్రొద్దుటికే రూ.13,200 కోట్లు కావాల్సి ఉంటుంది.

బీజేపీకి నమ్మకం లేకనే..

టీడీపీ అధినేత ప్రకటించిన ఈ వాగ్దానాలు అన్నీ పక్కరాష్ట్రాల నుంచి కాపీకొట్టి తెచ్చినవేనని వాటిని అమలు చేయాలంటే బడ్జట్ కూడా పక్కరాష్ట్రంతో సమానంగా ఉండాలి కదా అని ప్రశ్నిస్తున్నారు ఆర్ధిక నిపుణులు. లేదంటే గతంలో చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానాలను అధికారంలోకి రాగానే ఎగ్గొట్టినట్లుగా ఈసారి ఎగనామం పెడితే తప్ప అమలు చేయలేని పరిస్థితి ఉందంటున్నారు. ఇప్పుడున్న రాష్ట్ర ఆదాయం, ఖర్చులు బేరీజు వేసుకోకుండా అధికారం కోసం అలివిగాని హామీలు ఇచ్చి ఎప్పటిలాగానే ప్రజల్ని ఆయన మరోసారి సూపర్ సిక్స్ పేరుతో సూపర్ గా మోసం చేయడానికి రెడీ అవుతున్నారని వైసీపీ శ్రేణులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఎన్డీఏలో టీడీపీ కలిసినప్పటికి ...టీడీపీ మానిఫెస్టోపై నమ్మకం లేకపోవడం వల్లే ఆ మేనిఫెస్టోను సైతం టచ్ చేయకుండా పక్కకు జరిగిందనే విమర్శలు ఉన్నాయి.

మాటలు నీటి మూటలేనా..

సాధ్యాసాధ్యాలు చూసుకోకుండా...ఆర్ధిక ప్రణాళికలు వేసుకోకుండా రాష్ట్ర బడ్జెట్ ను ఏమాత్రం అంచనా వేయకుండా ఈవిధంగా హామీలు ఇవ్వడం చూస్తుంటే చంద్రబాబు గత 30 ఏళ్లలో ఇచ్చిన హామీలు ఎలాగైతే గాలిలో కలిసిపోయాయో..ఈ హామీల పరిస్థితి కూడా అంతే అవుతుందని పెదవి విరుస్తున్నారు. మరి ప్రజలు ఆయన్ని ఏవిధంగా అర్ధ చేసుకుంటారో ..ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.

2024-05-03T14:19:42Z dg43tfdfdgfd