చంద్రబాబుకు కర్నూల్ సెంటిమెంట్ కలిసి వచ్చేనా.. ఏంటా సెంటిమెంట్ తెలుసుకుందాం !

52 నియోజకవర్గాలు ఉన్న రాయలసీమ ప్రాంతంలో కీలకమైన ప్రాంతం ఉమ్మడి కర్నూలు జిల్లా. ఓ వైపు కరువు కాటకం.. మరోవైపు ఫ్యాక్షన్ భూతం. రాయలసీమ ముఖ ద్వారమైన ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రభుత్వాలు ఎన్ని మారినా కరువు విలయతాండవం చేస్తుంటుంది. కానీ ఈ మధ్యకాలంలో కాస్త తాగు, సాగు నీటి కష్టాలు తీరినా అక్కడక్కడా కొన్ని ఇబ్బందులు ప్రజలకు నేటికీ తప్పడం లేదు. ఇలాంటి ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉండగా, ఎంతో మంది మంత్రులు, ముఖ్యంత్రులను చేసిన ప్రాంతం కర్నూలు జిల్లా చరిత్రలో నిలిచిపోయింది.

అలాంటి ప్రాంతంలో 2 పార్లమెంట్ స్థానాలు, 14 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంధర్భంగా అధికార, ప్రతిపక్ష పార్టీలో కొంత ఉత్కంఠ మొదలైంది. గడిచిన 2 దఫాలుగా ఉమ్మడి కర్నూలు జల్లాలో టీడీపీ పట్టును కోల్పోయింది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తరువాత నుంచి ఈ ప్రాంతంలో టీడీపీ జెండా ఎగిరిన దాఖాలాలు లేవు. 14 నియోజకవర్గాలు ఉన్న ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2014 ఎన్నికల్లో టీడీపీ కేవలం 3 స్థానాలకే పరిమితమైంది.

అది కూడా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, పత్తికొండ, నంద్యాల జిల్లాలోని బనగానపల్లె నియోజకవర్గంలో మాత్రమే టీడీపీ గెలుపొందింది. మిగతా 11 నియోజకవర్గల్లో వైస్సార్సీపీ భారీ మెజారిటీతో గెలుపొందింది. మళ్ళీ తిరిగి 2019 ఎన్నికల్లో వైస్సార్సీపీ 14 నియోజకవర్గాల్లో 14 అసెంబ్లీ స్థానాలు 2 పార్లమెంట్ స్థానాల్లో గెలుపొంది, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా ఖాతా తెరిచి కర్నూలు జిల్లాలో గెలుపే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహత్మక అడుగులు వేస్తున్నారు.

Shiridi Tour: షిరిడీ ఎల్లోరా వెళ్లొస్తారా? 2 రోజుల టూర్ రూ.3100 మాత్రమే

ఒక్క 2 నియోజకవర్గాల్లో తప్పితే మిగతా అన్ని చోట్ల బలమైన నాయకులను రంగంలోకి దించి, వారి ప్రచారంలో మరింతగా జోష్ పెంచేలా చంద్రబాబు స్వయంగా జిల్లా పర్యటనలు చేపడుతున్నారు. దీనికి ముఖ్య కారణం ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ అభ్యర్థులు కనీసం నలుగురు గెలిచినా రాష్ట్రంలో ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనేది చంద్రబాబు నమ్మకం. అదే తరహాలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏ పార్టీకి అయితే 4 కంటే ఎక్కువ స్థానాలు వస్తాయో, ఆ పార్టీ ప్రభుత్వం ఖాయమనేది రాజకీయ పార్టీలకు 1990 నుంచి వస్తున్న ఒక సెంటిమెంట్.

Tirumala Annadanam: తిరుమలలో ఒక రోజు అన్నదానానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా?

దీన్ని దృష్టిలో ఉంచుకునే చంద్రబాబు తన స్పీడును పెంచి గడిచిన 20 రోజుల్లో 5 సార్లు జిల్లా పర్యటనకు వచ్చారు. అంతేకాదు యువగళం పేరుతో నారా లోకేష్ సైతం 4 సార్లు పర్యటించారు. అంతే కాదు పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో జోష్ నింపేందుకు సినిమా హీరో, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ సైతం జిల్లాలో 3 రోజుల పాటు పర్యటించారు. దీన్ని బట్టి ఖచ్చితంగా ఈ సారి ఎన్నికల్లో టీడీపీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో తన ఖాతా తెరిచి మళ్ళీ పుంజుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

2024-05-07T05:32:49Z dg43tfdfdgfd