చంద్రబాబును ఏపీ ప్రజలు మరోసారి నమ్ముతారా? ఈ ఎన్నికల్లో గెలిపిస్తారా?

చంద్రబాబును రాజకీయాల్లో అపర చాణుక్యుడు అంటారు. ఆయనకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 14 ఏళ్లు సీఎంగా చేసిన అనుభవం ఉంది. చంద్రబాబు మార్క్ పాలన ఉందా? 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏం చేశారు. 2014లో చంద్రబాబు ఇదే కూటమిగా ఏర్పడి అమలకు సాధ్యం కానీ హామీలను ఇచ్చారు. నరేంద్ర మోడీ, పవన్‌ కల్యాణ్‌ ఫోటోలు కూడా అప్పటి మేనిఫెస్టోలో ప్రకటించారు. రైతులకు రుణమాఫీ.. పొదుపు సంఘాలకు రుణమాఫీ పూర్తిగా చేస్తామని చెప్పారు. కానీ, వాటిని అమలు చేయలేదు.. ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25వేల రూపాయలను బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నారు.. ఒకరికి కూడా చేయలేదు. ఇంటింటికి ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానని చంద్రబాబు చెప్పాడు.. ఇచ్చారా? అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం ఇస్తానని చెప్పారు.. ఒకరికైనా ఇచ్చారా?

అయితే ఇలా తన మాటలతో.. మేనిఫెస్టోలతో ప్రజలను నమ్మించడం... ఆ తరువాత మాట తప్పి మోసం చేయడం..ఇదే చంద్రబాబు ట్రాక్ రికార్డ్ ... అంటున్నారు రాజకీయ నిపుణులు, విశ్లేషకులు. పాతికేళ్ల క్రితమే చంద్రబాబు కోటి ఉద్యోగాలు 1999 లో హామీ ఇస్తామన్నారు. పోనీ చేసారా ? ఉద్యోగాలు ఇచ్చారా ? లేదు...కానీ తనను తాను ఓ విజనరీ అని మీడియాలో ప్రచారం చేసుకుంటూ పబ్బం గడుపుతున్నారు. అదే ఏడాది రేషన్ సరుకులు సైతం ఇంటికే ఇస్తాం అని మాట ఇచ్చారు... అదేమైనా చేసారా ? చేయలేదు..కానీ మళ్ళీ తాను విజనరీ అని చెప్పుకుంటారు..

బాబు ఏం చేసినా.. ఏ చిన్న పని చేసినా కూడా దానికి మీడియా కవరేజ్ మాత్రం ఉండేలా చేసుకుంటారు. అయితే ఎంతసేపూ మీడియా ద్వారా తనను తాను సంస్కర్తగా చెప్పుకుంటూ రాష్ట్రానికి తానె దిక్కు అనేలా ప్రచారం చేసుకోవడం తప్పా.. ఇన్నాళ్లలో ఏపీకి ఆయన చేసిందేం లేదంటున్నారు. ఇన్నేళ్ళలో ఇదిగో...నేను ఇది చేశాను అని చెప్పుకునేందుకు చంద్రబాబు దగ్గర ఏమీ లేదన్నారు... కానీ మళ్ళా ఆంధ్రాకు నేనే దిక్కు అని చెప్పుకోవడంలో మాత్రం చంద్రబాబు ఏమాత్రం ఆలోచించరని జనం చెవులు కొరుక్కుంుటన్నారు.

తాజాగా పెన్షన్ల విషయంలో చంద్రబాబు చేసింది అందరికీ తెలిసిందే. వాలంటీర్లు పెన్షన్లు ఎలా ఇస్తారంటూ.. అడ్డుతగిలారు. ఇతర అంశాల్లో ప్రజలను ఇబ్బంది పెట్టడమే కాకుండా దాన్ని మళ్ళీ ఎదురు జగన్ మోహన్ రెడ్డి మీదకు నెట్టేయడం... కూడా చేశారని... ఏపీ ప్రజలు ఆరోపిస్తున్నారు.. ల్యాండ్ టైట్లింగ్ యాక్టు పేరిట ప్రజల భూములు లాక్కుంటారంటూ అబద్ధపు ప్రచారం చేయడం ద్వారా ప్రజలను నమ్మించి లబ్ధిపొందడానికి చంద్రబాబు వేస్తున్న ఎత్తులు అన్నీ ఇన్నీ కావు.... కానీ విజ్ఞులైన ప్రజలు మాత్రం తమకు ఎవరేమిటన్నది తెలుసనీ... ఎన్నికల సమయంలో ఓటుతో చెప్పాల్సిన వారికి సరైన రీతిలో సమాధానం చెబుతామని అంటున్నారు. మరి చూడాలి మరోసారి చంద్రబాబును ప్రజలు నమ్ముతారా? లేదాఅనేది

2024-05-04T09:07:36Z dg43tfdfdgfd