చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు

చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు

    పలు జిల్లాల్లో మాత్రం వడగాలులుంటాయన్న వాతావరణ శాఖ

హైదరాబాద్, వెలుగు: ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనాలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని శనివారం వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలుపడుతాయని పేర్కొంది. దాదాపు అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్​ను జారీ చేసింది. అయితే, పలు జిల్లాల్లో మాత్రం వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.  

వరుసగా ఐదో రోజూ మంటే..

రాష్ట్రంలో వరుసగా ఐదో రోజూ ఎండ తీవ్రంగా కొట్టింది. శనివారం అత్యధికంగా జగిత్యాల జిల్లా జైన, కరీంనగర్​ జిల్లా వీణవంకలో 46.8 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్గొండ జిల్లా తెల్దేవరపల్లిలో 46.7, నారాయణపేట జిల్లా ఊట్కూరులో 46.4, నిజామాబాద్​ జిల్లా జకోరాలో 46.4, మంచిర్యాల జిల్లా నస్పూర్​లో 46.3, పెద్దపల్లి జిల్లా తక్కళ్లపల్లిలో 46.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో 44 నుంచి 45.9 డిగ్రీల మధ్య రికార్డయ్యాయి. మొత్తంగా 7 జిల్లాల్లో 46 డిగ్రీలకుపైగా.. 18 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా టెంపరేచర్లు నమోదయ్యాయి.

©️ VIL Media Pvt Ltd.

2024-05-05T01:41:08Z dg43tfdfdgfd