చేనేత కార్మికులకు రూ.50 కోట్ల బకాయిలు విడుదల

చేనేత కార్మికులకు రూ.50 కోట్ల బకాయిలు విడుదల

చేనేత కార్మికులకు చెల్లించాల్సిన బకాయిల్లో రూ.50 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. గతేడాది బతుకమ్మ చీరలకు సంబంధించి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు రూ.351 కోట్ల బిల్లులు చెల్లించలేదు. దీంతో వేలాది మంది కార్మిక కుటుంబాలు ఆందోళనకు దిగాయి. మంత్రి పొన్నం కార్మికులతో చర్చించి.. బకాయిల విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో ప్రభుత్వం ఆర్థిక వెసులుబాటును దృష్టిలో పెట్టుకొని 50కోట్లు రిలీజ్ చేసింది.  దీంతో వేలాది మంది కార్మికులకు ఊరట కలగనుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గడిచిన మూడు నెలల్లో సమగ్ర శిక్షా అభయాన్ యూనిఫామ్ల తయారీకి సుమారు రూ. 47 కోట్లు అడ్వాన్సుగా చెల్లించింది.  నూలు కొనుగోలు, సైజింగ్ కు రూ. 14 కోట్లు విడుదల చేసింది. 

also read : ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..

©️ VIL Media Pvt Ltd.

2024-04-19T14:45:50Z dg43tfdfdgfd