చేనేత చీరల క్లియరెన్స్ సేల్... మహిళల నుంచి మంచి స్పందన

విశాఖలో ప్రతిరోజు ఏదో ఒక ఎక్స్‌పో, ఏదో ఒక ప్రదర్శన జరుగుతుంటుంది. దీనివల్ల చాలా వరకు వినియోగదారులకు ఉపయోగమే అని చెప్పాలి. ముఖ్యంగా లేపాక్షి లాంటి ప్రభుత్వ సంస్థలు ఈ మధ్యనే ఒక షో పెట్టాయి. ఈ షోలో క్లియరెన్స్ సేల్ కి సంబంధించిన అన్ని వస్తువుల్ని సేల్కు పెట్టాయి. ఈ క్లియరింగ్ సేల్ లో మంచి మంచి ఆభరణాలు వస్త్రాలు, వస్తువులు అందుబాటులో ఉన్నాయనిలేపాక్షి మేనేజర్ కార్తీక్ చెప్పారు.

ఈ నేపథ్యంలో అందరూ లేపాక్షి కి వచ్చి తమకి కావాల్సినవి తీసుకుని వెళ్తున్నారు. లేపాక్షి ఎంపోరియంలో ఈ నెల 31 వరకు నిర్వహించే క్లియరెన్స్ సేల్ కు అద్భుత స్పందన లభిస్తోందని లేపాక్షి (ప్రభుత్వ రంగ సంస్థ) విశాఖ నగర బ్రాంచి మేనేజర్ ఏ.కార్తిక్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన వివరాలు తెలియ చేశారు. విశాఖలో చాలామందికి లేపాక్షి ఎంపోరియం అంటే తెలుసు. అసలు లేపాక్షి ఎంపోరియం అంటే తెలియని వారే ఉండరు. ఈ నేపథ్యంలో లేపాక్షి కి వచ్చి మంచి వస్తువులు కొనుక్కోవాలి అనేది ఎంపోరియం నిర్వాహకుల ఆలోచన.

Tirupati Tour: జస్ట్ రూ.3,500 కే తిరుపతి టూర్ ప్యాకేజీ... తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, బస ఉచితం

క్లియరెన్స్ సేల్ కు విశేష స్పందన, తీమేటిక్ ఎగ్జిబిషన్ ప్రారంభం.. లేపాక్షి మేనేజర

ఈనెల 27 న బుధవారం ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ ఈనెల 31న ముగుస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ ఎండీ ఎం.బాల సుబ్రహ్మణ్యం రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. తయారీ దారులే నేరుగా తాము తయారు చేసిన హస్త కళా వస్తువులను ఈ ఎగ్జిబిషన్లో విక్రయిస్తారన్నారు.

---- Polls module would be displayed here ----

ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, కలంకారి, వైట్వుడ్, ఏలూరు కార్పెట్లుకొండపల్లి బొమ్మలు బంజారా -క్రోచెట్ లెస్ ఏటికొప్పాక బొమ్మలు, రోజ్ వుడ్ బొమ్మలు, వెల్వెట్ కార్పెట్స్, లెదర్ పప్పెట్రీ,వైట్ వుడ్ బర్డ్స్, లెదర్ లాంప్ షేడ్స్, బ్రాస్,కాపర్ వేర్, పేపర్ మెష్ ఐటమ్స్ ఎ.పి. వుడ్ కార్వింగ్స్,స్టోన్ కార్వింగ్ రుద్రాక్ష స్పటిక, చేనేత వస్త్రాలు, చీరలు, డ్రెస్ మెటీరియల్‌, నారాయణపేట చీరలు, కలంకారి, పోచంపల్లి, కాశ్మీరి షాల్స్ ఇంకా మరెన్నో అందుబాటులో ఉన్నాయన్నారు.

Special Trains: సమ్మర్ స్పెషల్... తిరుపతి, నర్సాపూర్, కాకినాడకు ప్రత్యేక రైళ్లు

హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి కళాకారులకు చేయూత ఇవ్వాలని ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు. అలాగే డిస్కౌంట్ ఇవ్వడానికి కూడా ఎంపోరియం సిద్ధంగా ఉంది. డిస్కౌంట్ సంబంధించిన పర్సంటేజ్ ను కూడా ఇప్పటికే తెలిపింది. లేపాక్షి ఎంపోరి యంలో వస్తువులకు ఈ నెల 31 వరకు 10 నుంచి 40 శాతం వరకు డిస్కౌంట్ సదుపాయం ఉందన్నారు. నగర వాసులు, పర్యాటకులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

2024-03-28T09:28:47Z dg43tfdfdgfd