జలాశయం నుండి బయటపడ్డ గ్రామాలపై .. లోకల్ 18 ఎక్స్ క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ !

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోనీ ముంపు గ్రామాలు ఇటీవల శ్రీరాజరాజేశ్వరి జలాశయం నీటిమట్టం అధికంగా తగ్గడంతో గ్రామాల ఆనవాళ్లు దర్శనమిస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు మమేకమైఇళ్లను చూసేందుకు వచ్చి తమ జ్ఞాపకాలను నెమరు వేసుకొని కన్నీటిపర్యంతమవుతున్నారు. ముంపులో సర్వం కోల్పోయామని, ప్రభుత్వాలు వెంటనే స్పందించి ముంపు గ్రామాల బాధితులకు ఉపాధి అవకాశాలతో పాటు 5లక్షల నష్టపరిహారాన్ని ఇవ్వాలని వారు వేడుకుంటున్నారు.

ఒకప్పుడు తామే పలువురు కూలీలకు ఉపాధి ఇచ్చేవారిమని, ప్రస్తుతం తామే ఉపాధి లేక కూలీలుగా మారామని కన్నీరు మున్నీరుగా విలపించారు. జలాశయం నీటిమట్టం తగ్గడంతో బయటపడిన తమ తమ గ్రామాలను,ఇండ్లను చూసి చలించిపోతున్నారు. అప్పుడే తమ బతుకులు బాగుండేవని, ప్రస్తుతం తమకు ఇండ్లు తప్ప ఏం లేవని, అప్పుల బాధలతో ఇక్కడ యువత, ఇంటి పెద్ద దిక్కులు గల్ఫ్ బాట పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

---- Polls module would be displayed here ----

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రత్యేక చొరవ తీసుకొని ముంపు గ్రామాల్లో ఇండస్ట్రీస్ నెలకొల్పి ముంపు గ్రామాల యువతకు ఉపాధి కల్పించి ఆదుకోవాలని, ముంపు గ్రామాల మహిళలు వివిధ ప్రాంతాలకు కూలీలుగా ఆటోలపై వెళ్తూ ప్రమాదాలకు గురై మృతి చెందుతున్నారని గుర్తు చేశారు.

తమ పాత గ్రామాలు జలాశయం నీటిమట్టం అధికంగా తగ్గడంతో బయటపడ్డామని, వాటిని చూసేందుకు ఆర్ అండ్ ఆర్ కాలనీలో నుంచి ప్రజలు వచ్చి పూర్వపు తమ ఇండ్లను, వారు చదువుకున్న పాఠశాల, ఫ్రెండ్స్ తో ముచ్చటించిన ప్రాంతాలను చూసుకుంటూ నెమరు వేసుకుని భావోద్వేగాలకు లోనవుతున్నారు. ఆ దృశ్యాలు అందరిని ఆలోచించేలా చేస్తూ.. కంటతడి పెట్టిస్తున్నాయనే చెప్పాలి. తమ గ్రామాలు మిడ్ మానేరు జలాశయంలో ముంపునకు గురికావడంతో దిక్కులేని పరిస్థితుల్లో రోడ్డున పడ్డామని, ఒకప్పుడు రైతులుగా ఉన్న మేము, ప్రస్తుతం ఉపాధి లేక దీనావస్థలో ఉన్నామని లోకల్18 తో రుద్రవరం గ్రామానికి చెందిన కాసర్ల అరుణ్ కుమార్, రాధారపు వెంకటేశులు ప్రత్యేకంగా మాట్లాడారు.

JNTUHలో డ్రోన్ టెక్నాలజీపై అవగాహన.. డ్రోన్లను ఎలా తయారు చేస్తారో తెలుసా..

తమ గ్రామాలు జలాశయం నుంచి బయటపడడంతో.. ఉద్వేగాన్ని ఆపుకోలేక ఆ ప్రాంతాలను సందర్శించి, భావోద్వేగాలకు లోనవుతున్న దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. ముంపు గ్రామాల ప్రజల త్యాగాలు వెలకట్టలేవని చెప్పాలి. లోన్లు తీసుకున్నా.. లోన్లు కట్టలేని పరిస్థితిలో ఉన్నామని, చేద్దామంటే కనీస ఉపాధి హామీ పని కూడా లేదని, దినసరి కూలీలుగా మారి వివిధ ప్రాంతాలకు వెళ్తే మళ్లీ తిరిగి వస్తామని భరోసా లేక బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నామని ముంపు గ్రామాల ప్రజలు చెబుతున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ బతుకులకు భరోసా దొరకడం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా ముంపు గ్రామాల ప్రజలపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

2024-04-23T13:40:20Z dg43tfdfdgfd