జార్ఖండ్ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి ఇంట్లో.. గుట్టలు గట్టలుగా డబ్బులు

జార్ఖండ్ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి ఇంట్లో.. గుట్టలు గట్టలుగా డబ్బులు

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాల్లో భారీగా నోట్ల కట్టలు పట్టుబడ్డాయి. మే 6వ తేదీ సోమవారం జార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహించింది. వీరేంద్ర రామ్ కేసులో జార్ఖండ్ రూరల్ డెవలప్‌మెంట్ మంత్రి అలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ నివాసంలో భారీ మొత్తంలో నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఈడీ వర్గాలు తెలిపారు. సీజ్ చేసిన నగదును లెక్కిస్తున్నట్లు చెప్పారు.పట్టబడిన నగదుకు సంబంధించిన వీడియాలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గత ఏడాది  గ్రామీణాభివృద్ధి శాఖ మాజీ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర కె రామ్‌ను మనీలాండరింగ్ కేసు లో ఈడీ అరెస్టు చేసింది. ఈ కేసులో భాగంగా ఈరోజు ఉదయం మంత్రి పీఎస్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది.

కాగా,  జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు.. జార్ఖండ్‌ను లూత్‌ఖండ్‌గా మార్చే పని చేస్తున్నాయని బీజేపీ ఎంపీ దీపక్ ప్రకాశ్ తీవ్రంగా విమర్శించారు. ఈరోజు మళ్లీ రూ.25 కోట్లకు పైగా సొమ్మును స్వాధీనం చేసుకున్నారని..  అది అధికార పార్టీ మంత్రులదేనని ఆయన ఆరోపించారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-06T05:15:28Z dg43tfdfdgfd