డబ్బు సమస్యలకు చెక్.. ఈ సూత్రాలు ఫాలో అయితే ఆర్థిక ఇబ్బందులేవీ రావు!

Lal Kitab: వేద జ్యోతిష్యశాస్త్రం, హస్తసాముద్రికానికి సంబంధించి లాల్ కితాబ్ విలువైన సమాచారాన్ని అందిస్తుంది. ఇది వేద జ్యోతిషశాస్త్రంలో ఒక ముఖ్యమైన శాఖ. మొత్తం 5 పుస్తకాల రూపంలో లాల్ కితాబ్ పరిహారాలు ఉంటాయి. నిత్యం జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు ఇది పరిష్కార మార్గాలను చూపుతుంది. దీంట్లో పేర్కొన్న కొన్ని సూత్రాలు ఆర్థిక సమస్యలను, దురదృష్టాన్ని తొలగించగలవు. సిరి సంపదలు, ఫైనాన్షియల్ సక్సెస్ కోసం పాటించాల్సిన లాల్ కితాబ్ రెమిడీస్ ఏవో చూద్దాం.

* వెండి నాణెం

సంపద, విజయం సిద్ధించాలంటే ఒక వెండి నాణెం మీతో ఎల్లప్పుడు ఉంచుకోవాలని లాల్ కితాబ్ సూచిస్తుంది. దీన్ని ఒక లాకెట్‌గా ధరించవచ్చు. లేకపోతే వాలెట్ లేదా హ్యాండ్‌బ్యాగ్‌లో ఉంచుకోవచ్చు. వెండి శరీర ఎనర్జీపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఇది శ్రేయస్సు, అదృష్టాన్ని తీసుకొస్తుంది.

* ఇంటి శుభ్రత

ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు చక్కగా మెయింటెన్ చేస్తే ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఇంటిని ఒక పద్దతి ప్రకారం, చిందరవందరగా లేకుండా చూసుకోవాలి. దీంతో ఇల్లు విజయం, సంపదను ఆకర్షిస్తుందని లాల్ కితాబ్ పేర్కొంది. ఇంట్లోకి వెంటిలేషన్ బాగా ఉండాలి. గాలి, వెలుతురు బాగా ప్రసరించే ఏర్పాట్లు చేసుకోవాలి.

Om Namo Venkatesaya chant: తిరుమలలో వినిపించే 'ఓం నమో వెంకటేశాయ' పాడింది ఈమెనే

* ఆకుపచ్చ, ఎరుపు రంగులు

భారత సంప్రదాయంలో ఎరుపు, ఆకుపచ్చ రంగులను లక్కీ కలర్స్‌గా భావిస్తారు. దురదృష్టం తొలగి, సంపదలు ఆకర్షించాలంటే ఈ రెండు రంగుల్లో ఉండే ఉపకరణాలు, గృహాలంకరణ వస్తువులు వాడాలని లాల్ కితాబ్ సూచిస్తుంది. ఆకుపచ్చ రంగు అభివృద్ధి, సంపదను సూచిస్తే.. ఎరుపు రంగు అదృష్టం, విజయాన్ని ఆకర్షిస్తుంది.

* రత్నాలు

సానుకూల ప్రభావం కోసం చాలా మంది రత్నాలు ధరిస్తుంటారు. లాల్ కితాబ్ ప్రకారం.. శ్రేయస్సు, అదృష్టం పొందడానికి పచ్చ, ముత్యాలు, రూబీ వంటి రత్నాల ఆభరణాలను ధరించాలి. రూబీ రత్నం విజయాన్ని తెచ్చే శక్తిగా పేర్కొంటారు. ముత్యాల రత్నం సంపద, ప్రశాంతతకు ప్రతీక. పచ్చ రత్నం శ్రేయస్సు, పురోగతిని అందిస్తుంది.

---- Polls module would be displayed here ----

* వినాయక పూజ

హిందూ సంప్రదాయంలో వినాయకునికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఎలాంటి వేడుకల్లో అయినా ముందు విఘ్నేశ్వరున్ని పూజిస్తారు. ఆయన్ను సంపద, శ్రేయస్సుకు ప్రతీకగా భావిస్తారు. లాల్ కితాబ్ ప్రకారం.. శ్రేయస్సు, అదృష్టం కోసం గణేశుడిని పూజించాలి. స్వామి ఆశీస్సుల కోసం మోదకం, లడ్డూ లేదా మరో తీపి పదార్థాన్ని సమర్పించాలి. వినాయక మంత్రాన్ని పఠించాలి.

* శక్తివంతమైన మంత్రాలు

మీ జీవితంలోకి సంపదలు కలగడానికి మంత్రాలు కీలక ప్రభావం చూపుతాయి. సంపద, విజయాన్ని ఆకర్షించడానికి గాయత్రీ మంత్రం, మహామృత్యుంజయ మంత్రం, లక్ష్మీ మంత్రం వంటి మంత్రాలను జపించాలని లాల్ కితాబ్ పేర్కొంది. ఏకాగ్రతతో, అంకితభావంతో ఈ మంత్రాలను పఠించాలి.

* ఇండోర్ ప్లాంట్స్

ఇంట్లో కొన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్ పెంచితే శుభప్రదం. శక్తి ప్రవాహాన్ని పెంచుతాయి. సంపదల కోసం ఇంట్లో మనీ ప్లాంట్ లేదా వెదురు మొక్కను పెంచుకోవాలి. ఇవి విజయాన్ని ఆకర్షించి సిరిసంపదలను కట్టబెడతాయి. వెదురు మొక్క ఎదుగుదల, విజయాన్ని అందిస్తే.. మనీ ప్లాంట్ అదృష్టం, సంపదను ఆకర్షిస్తుంది.

2024-04-19T12:20:14Z dg43tfdfdgfd