డాన్స్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. వీడియో వైరల్.. అసలు కథ వేరే ఉంది!

ఇది ఎన్నికల టైమ్. ఈ సమయంలో పాలిటిక్స్‌కి సంబంధించిన ఎలాంటి ట్రిక్ అయినా క్లిక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. ఇదే గమనించిన ఓ x యూజర్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డాన్స్ వేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించి.. అలాంటి యానిమేషన్ వీడియో తయారుచేసి.. ఆ క్లిప్‌ని ట్వీట్ చేశారు.

x లోని Atheist_Krishna అకౌంట్‌లో ఈ వీడియోని మే 6, 2024న పోస్ట్ చెయ్యగా.. ఇప్పటికే దాన్ని 90 లక్షల మందికి పైగా చూశారు. 1.40 లక్షల దాకా లైక్స్ వచ్చాయి.

"ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నానో తెలుసా? దీన్ని చూసి ఆ నియంత.. నన్ను అరెస్టు చెయ్యరని నాకు తెలుసు" అని సరదా క్యాప్షన్ ఇచ్చారు. ఐతే.. ఈ వీడియోని ప్రధాని మోదీ చూశారు. చూడటమే కాదు.. మెచ్చుకున్నారు కూడా. "మీ లాగే నేను కూడా.. నాకు నేను డాన్స్ వెయ్యడం చూసి ఎంజాయ్ చేశాను. పోల్ సీజన్ పీక్‌కి చేరిన సమయంలో ఇలాంటి క్రియేటివిటీ నిజంగా ఆనందం కలిగించింది" అని మోదీ ఈ వీడియోని రీట్వీట్ చేస్తూ రిప్లై ఇచ్చారు.

ఆ వీడియోని ఇక్కడ చూడండి

ఈ వీడియోకి నెటిజన్లు కూడా తమదైన శైలిలో కామెంట్స్ ఇస్తున్నారు. "మీరు నిజంగా వజ్రం. మిమ్మల్ని నియంత అని పిలిచిన వారిపై జాలి పడుతున్నాను" అని ఓ యూజర్ కామెంట్ ఇవ్వగా.. "మిమ్మల్ని డిక్టేటర్ అని పిలిచిన వారి చెంప చెళ్లుమనిపించాలి" అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు.

మీరు కూల్ భారత ప్రధాని మిస్టర్ మోదీ. మేము ముమ్మల్ని ప్రేమిస్తున్నాము, మెచ్చుకుంటున్నాము, మిమ్మల్ని గౌరవిస్తున్నాం సార్ అంటూ మరో యూజర్ కామెంట్ ఇచ్చారు. ఎవరు నిజమైన డిక్టేటరో.. ఇప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు.

2024-05-07T03:02:25Z dg43tfdfdgfd