తీహార్ జైలు ఢిల్లీ ప్రభుత్వం పరిధిలోకే వస్తుంది : కేజ్రీవాల్ పై అమిత్ షా

తీహార్ జైలు ఢిల్లీ ప్రభుత్వం పరిధిలోకే వస్తుంది : కేజ్రీవాల్ పై అమిత్ షా

లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజరీవాల్ ను ఉద్దేశించి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. తీహార్ జైలు ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోకే వస్తుందని, ఢిల్లీ సీఎంగా ఉన్న కేజ్రీవాల్ ఆయన హత్యకు ఆయనే ప్లాన్ చేశాడా అని అన్నారు. జైలులో కేజ్రీవాల్ కు సరైన వైద్య సదుపాయాలు కల్పించట్లేదన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేతల కామెంట్స్ కి స్పందించిన అమిత్ షా ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

కేజ్రీవాల్ ను చంపేందుకు కుట్ర జరుగుతోందంటూ ఆయన భార్య సునీత, పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు అమిత్ షా. కేజ్రీవాల్ అరెస్ట్ లో కేంద్రం పాత్ర గురించి మీడియా ప్రశ్నించగా స్పందించిన అమిత్ షా. ఈ అరెస్ట్ లో కేంద్ర ప్రభుత్వ ప్రమేయం లేదని, ఈ అంశంపై ఈడీ సుప్రీం కోర్టుకు వివరణ ఇస్తుందని అన్నారు. కేజ్రీవాల్ కు మొదటిసారి సమన్లు జారీ చేసినప్పుడే ఈడీ ఎదుట హాజరయ్యి ఉంటే, కేజ్రీవాల్ ఆరు నెలల క్రితమే అరెస్ట్ అయ్యి ఉండేవాడని అన్నారు అమిత్ షా. 

©️ VIL Media Pvt Ltd.

2024-05-02T14:31:28Z dg43tfdfdgfd