తెలంగాణకు రెయిన్ అలర్ట్.. మూడు రోజులు భారీ వర్షాలు

తెలంగాణకు రెయిన్ అలర్ట్.. మూడు రోజులు భారీ వర్షాలు

 తెలంగాణకు  రెయిన్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. రానున్న మూడు రోజులు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో వర్షం కురిసే అవకాశముందన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయన్నారు. గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉందన్నారు అధికారులు.

 

ఆదివారం వరకు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్సుందన్నారు. ఆదిలాబాద్, కొమురం భీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లోనూ వానలు పడే అవకాశముందని తెలిపింది వాతావరణ శాఖ. గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశముందని ప్రకటించింది.

©️ VIL Media Pvt Ltd.

2024-04-20T04:01:03Z dg43tfdfdgfd