తెలంగాణలో పంటనష్టానికి 15.81 కోట్లు రిలీజ్

తెలంగాణలో పంటనష్టానికి 15.81 కోట్లు రిలీజ్

  • ఎకరానికి రూ.10 వేల చొప్పున 10  జిల్లాల్లోని  15,246 మంది రైతులకు పరిహారం  
  • జీవో జారీ చేసిన రాష్ట్ర సర్కారు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతాంగానికి రూ.15.81 కోట్ల పరిహారాన్ని రాష్ట్ర సర్కారు రిలీజ్​ చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత మార్చి నెలలో 4 రోజుల పాటు కురిసిన అకాల వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల్లో పంట నష్టం జరిగింది. అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పంట నష్టంపై ఎన్యూమరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. ఆఫీసర్లు నేరుగా పంట పొలాల వద్దకు వెళ్లి సర్వే చేశారు.  అకాల వర్షాలతో 15 వేల 814 ఎకరాల 3 గుంటల విస్తీర్ణంలో పంట నష్టపోయినట్టు ఎన్యూమరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వెల్లడైంది. 

రాష్ట్రవ్యాప్తంగా 10 జిల్లాల్లోని 15,246 మంది రైతులకు చెందిన వివిధ పంటలు నష్టపోయినట్టు అధికారులు నిర్ధారించారు. సర్వేల ద్వారా తేల్చిన పంట  నష్టానికి ఎకరానికి రూ.10 వేల చొప్పున  15,246 మంది రైతులకు 15 కోట్ల 81 లక్షల 40 వేల 750 రూపాయలు  పంట నష్టం పరిహారంగా  అందించింది.  దీనికి సంబంధించిన బిల్లులను ఆర్థికశాఖకు వ్యవసాయశాఖ  గత నెలలోనే పంపించింది.  అయితే, పార్లమెంట్​ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్​ కోడ్​ అమల్లో ఉన్నందున పరిహారం చెల్లించేందుకు సర్కారు ఎలక్షన్​కమిషన్ నుంచి అనుమతి కోరింది. తాజాగా, ఈసీ అనుమతించడంతో సోమవారం పంట నష్టపోయిన రైతుల బ్యాంకు అకౌంట్లలో నిధులను ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసినట్టు సర్కారు  జీవోలో వెల్లడించింది. 

సర్వేలో తేలిన పంట నష్టం వివరాలు 

అకాల వర్షాలకు  రాష్ట్రంలోని 10 జిల్లాల్లో 15,814.03 ఎకరాల్లో పంట నష్టం జరిగితే..  అందులో ఒక్క కామారెడ్డి జిల్లాలోనే అత్యధికంగా 10 ,328.04 ఎకరాల్లో పంట నష్ట పోయినట్టు వ్యవసాయశాఖ సర్వేలో తేలింది.  ఆ తర్వాత నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో 1,652. 25 ఎకరాలు, సిరిసిల్లలో 1,014. 6 ఎకరాలు, మిగతా సిద్దిపేట, మెదక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాల్లో వెయ్యి ఎకరాల లోపు నష్టం జరిగింది. నిర్మల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మంచిర్యాల, కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో 500 ఎకరాల లోపు నష్టం జరగ్గా, వంద ఎకరాల లోపు సంగారెడ్డి జిల్లాలో 76.04 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు వ్యవసాయశాఖ అధికారులు సర్వేలో తేల్చారు. వీరందరికీ సోమవారం రూ.15,81,40,750 నిధులు విడుదల చేసినట్టు వ్యవసాయశాఖ వెల్లడించింది.   

©️ VIL Media Pvt Ltd.

2024-05-07T01:33:11Z dg43tfdfdgfd