తెలంగాణలో మాట్లాడితే ఢిల్లీలో కేసు ఎలా పెడతారు? : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో మాట్లాడితే ఢిల్లీలో కేసు ఎలా పెడతారు? : సీఎం రేవంత్ రెడ్డి

తాను తెలంగాణలో మాట్లాడితే ఇక్కడ కేసు పెట్టకుండా ఢిల్లీలో ఎందుకు పెట్టారని రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. ఇక్కడ ఉన్న బీజేపీ ఎంపీలు తనపై ఎందుకు ఫిర్యాదు చేయలేదని అడిగారు. దేశ ప్రధానిగా మోదీని గౌరవిస్తానని, కానీ గుజరాత్ వాడిగా తెలంగాణకు వచ్చి తిడుతూ, శపించడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణలో గత పదేండ్లుగా కాంగ్రెస్​ కార్యకర్తలపై కేసులు, అక్రమ అరెస్టులు, హత్యలు చేసి భయపెట్టాలని చూస్తే కేసీఆర్ ను ఇంటికి పంపించారన్నారు.

 ‘‘కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటే కాంగ్రెస్ ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేస్తారా? కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని రద్దు చేస్తారా?’ అని ప్రశ్నించారు. 400 సీట్లు గెలవడం ద్వారా రాజ్యాంగాన్ని మార్చి.. రిజర్వేషన్లు రద్దు చేసి.. దేశాన్ని అంబానీ, అదానీలకు అమ్మేసే కుట్ర జరుగుతోందని ఆరోపిం చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన చేపడ్తామని రాహుల్ గాంధీ తన పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చారని, తెలంగాణ లో ఈ ప్రక్రియను ప్రారంభించామని చెప్పారు. 

©️ VIL Media Pvt Ltd.

2024-05-02T05:14:57Z dg43tfdfdgfd