తెలంగాణలో వడదెబ్బతో ముగ్గురు మృతి

తెలంగాణలో వడదెబ్బతో ముగ్గురు మృతి

మంథని టౌన్/వేములవాడ రూరల్/ములుగు, వెలుగు: రాష్ట్రంలో వడదెబ్బతో ముగ్గురు చనిపోయారు. పెద్దపల్లి జిల్లాలో ఉపాధి పనులు చేస్తుండగా ఓ మహిళ కుప్పకూలగా..సిరిసిల్ల జిల్లాలో ఓ రైతు, ములుగు జిల్లాలో వ్యవసాయ కూలీ ప్రాణాలు కోల్పోయారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం విలోచవరం గ్రామానికి చెందిన అక్కపాక లక్ష్మీ(55) రోజులాగే మంగళవారం ఉదయం ఉపాధి హామీ కూలీ పనులకు వెళ్లింది. పని ప్రదేశంలో నీరసంగా ఉందని తోటి కూలీలకు చెబుతూ ఒక్కసారిగా కింద పడిపోయింది. 108  వెహికల్‌‌‌‌‌‌‌‌ వచ్చేలోపే ఆమె చనిపోయింది.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం బాలరాజుపల్లికి చెందిన నాగుల బాలయ్య (50) సోమవారం రాత్రి వరకు వడ్లు ఆరబెట్టుకుని ఇంటికి వచ్చాడు. కొద్దిసేపటికే అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు వేములవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే, మార్గమధ్యలోనే బాలయ్య చనిపోయాడు. ములుగు జిల్లా ములుగు మండలం మహ్మద్​ గౌస్​పల్లికి చెందిన చింతల రాజు (39) వ్యవసాయ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం పక్క గ్రామం రాంచంద్రాపూర్​లో కూలీ పనులు చేశాడు. అనంతరం తీవ్ర కడుపునొప్పితో ములుగు ఏరియా దవాఖానలో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. మంగళవారం పంచోత్కులపల్లి ఏరియాలో  శవమై కనిపించాడు. స్థానికుల ఇచ్చిన సమాచారం ఆధారంగా.. తీవ్ర ఎండవేడితో రాజు వడదెబ్బకు గురై చనిపోయి ఉంటాడని పోలీసులు  అనుమానిస్తున్నారు. 

©️ VIL Media Pvt Ltd.

2024-04-24T05:13:25Z dg43tfdfdgfd