దాడికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి - వైసీపీ డిమాండ్

టిడిపి ఓటమి భయంతో వైసీపీ నేతలపై దాడికి పాల్పడుతుందని, అటువంటి ఘటనలు మానుకోవాలని వైసీపీ ప్రకటన విడుదల చేసింది. వైసీపీ ప్రధాన కార్యాలయం నుండి విడుదలైన ప్రకటన ప్రకారం.. ఎన్నికల కోడ్ కూయగానే పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు అన్ని పార్టీలు సహకరించాల్సిన అవసరం ఉందని, కానీ ఇలా దాడులకు పాల్పడే సంస్కృతి సమంజసం కాదని వైసీపీ పేర్కొంది. అంతేకాకుండా మహిళా నేతలను భయభ్రాంతులను చేసేందుకు ఇలా వరుసగా టిడిపి కి చెందిన కొందరు, మహిళా నేతలపై దాడులకు పాల్పడడం తగదన్నారు.

సాక్షాత్తు హోం మంత్రి తానేటి వనిత తన నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తుండగా, అల్లరి మూకలు రాళ్ళు విసరడం అలాగే విజయవాడ లో వైసీపీ మహిళా కార్యకర్తలపై బోండా ఉమ అనుచరులు దాడికి పాల్పడడం వంటి ఘటనలను తమ పార్టీ సీరియస్ గా తీసుకుందని, దీనిపై ఫిర్యాదులు చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కోడలిపై దాడికి సైతం యత్నించారని ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న తమ కార్యకర్తలను టిడిపి కంట్రోల్ చేయాలని సూచించారు.

రూ.4 లక్షలు సంపాదన.. అదరగొడుతున్న 79 ఏళ్ల రైతు

అంతేకాకుండా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్ది మండలంలో ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య రమ్యపై సైతం దాడికి పాల్పడ్డారని , ఇటువంటి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని వైసీపీ కోరింది. తమ విజయాన్ని పసిగట్టిన టిడిపి ఓర్వలేక చేస్తున్న దాడులుగా తాము భావిస్తున్నామని, ఎన్ని కుట్రలు పన్నినా ప్రజల మనసులో తమకు ఉన్న స్థానాన్ని ఎవరూ చెరపలేరని ఈ విషయాన్ని టిడిపి గ్రహించాలని వైసీపీ ప్రకటన ఇచ్చింది.

10న ఫ్రీ మెడికల్ క్యాంప్.. రూ.5000 విలువైన స్కానింగ్ ఉచితం

ఇది ఇలా ఉంటే టిడిపి సైతం తమ కార్యకర్తలపై వైసిపి దాడులకు పాల్పడుతుందని విమర్శిస్తోంది. కాగా ఎన్నికల కమిషన్ మాత్రం రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం లో ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా చర్యలు చేపడుతోంది. అంతేకాకుండా ముమ్మర తనిఖీలు నిర్వహిస్తూ.. అక్రమంగా తరలిస్తున్న నగదును ఎప్పటికప్పుడు స్వాధీనం చేసుకుంటూ పూర్తి నిఘా కేటాయించింది.

2024-05-08T14:22:58Z dg43tfdfdgfd