దాల్చిన చెక్కతో ఆ సమస్యకు చెక్ పెట్టొచ్చు.. వాడే విధానం ఇదే

(Anna Raghu,Senior Correspondent News18,Amaravati)

ఈ రోజుల్లో ప్రజలు అన్నింట్లో మార్పులు వస్తున్నాయి. కానీ ఆహార జీవన విధానంలో మాత్రం రావడం లేదు. ఎందుకంటే సమయానికి ఇది జరిగితే చాలు. రేపు చేసుకుందాంలే అన్న ధీమా. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ బయట ఆహారం మీద ఆధారపడుతున్నారు. దీని వల్లన అనేక సమస్యలు వస్తున్నాయి. బయట దొరికే చిరుతిండి వలన మానవుని శరీరంలో కొలెస్ట్రాల్(Cholesterol) రోజురోజుకు పేరుకుపోతుంది. దీంతో అనేక దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్నారు. ఈ రోజుల్లో వాతావరణం తగ్గట్టు మనం ఆహారం తీసుకోవాలి. అంటే చిరుధ్యానాలు మన జీవన ఆహారంగా మలుచుకోవాలి.

కొలెస్ట్రాల్ రెండు రకాలు..

వాస్తవానికి మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్‌లు ఉంటాయి.   కొలెస్ట్రాల్‌ కారణంగా ప్రజలు  దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. ఇప్పుడు అందరికీ సమస్యగా మారింది. రెండు రకాల కొలెస్ట్రాల్‌లు ఉంటాయి. అవి ఏమిటంటే ఒకటి మంచి కొలెస్ట్రాల్ మరొకటి చెడు కొలెస్ట్రాల్. అయితే మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు రక్తనాళాల్లో పేరుకుపోతుంది. దీని ద్వారా మానవునికి అధిక రక్తపోటు, గుండెపోటుతో పాటు స్ట్రోక్ వంటి తీవ్రమైన వ్యాధులు సంభవిస్తాయి. కాబట్టి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి తక్కువ స్థాయిలో ఉంచుకోవడం అనేది మానవునికి చాలా ముఖ్యం. మన శరీరానికి తగట్టు ఆహారాన్ని తీసుకోవాలి. అప్పుడే మనం కొలెస్ట్రాల్‌ను నియంత్రించవచ్చు.

Masoor Dal: ఈ పప్పు బూస్ట్ కంటే బలమైనది.. కానీ అతిగా తింటే ఏమౌంతుదో తెలుసా..?

దివ్య ఔషదం..

కొన్ని ఇంటి చిట్కాలు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. మన వంటగదిలో దొరికే  కొన్ని మసాలా దినుసులు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. వాటిలో ముఖ్యమైనది దాల్చిన చక్క. ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో  ముఖ్య పాత్ర పోషిస్తుంది. వంటకాలలో  మసాలా దినుసుగా ఉపయోగిస్తారు. ఇది రుచిని ఇవ్వడమే కాకుండా మన శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు మస్తుగా ఉంటాయి. ఇది శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో దోహదపడుతుంది.

ఇలా కూడా వాడొచ్చు..

దీనికి మరొక ఔషధం చక్కా టీ, దీనిని మనం ప్రతిరోజు తీసుకోవచ్చు. దీనిని ఎలా తయారు చేసుకోవాలి అంటే ముందుగా  ఒక గ్లాసు నీటిని వేడి చేసుకోవాలి. నీటిలో రెండు లవంగాలు లేదా ఒక స్పూన్ల లవంగాల పొడి వేసి సుమారు 5 నిమిషాల పాటు బాగా మరిగించి.. వడగట్టి కాస్త తేనె కలిపి తాగాలి. దీన్ని ప్రతి రోజు  తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్‌ను తగ్గించపకోవచ్చు. దీనితో పాటు  షుగర్, బరువును తగ్గించుకోవచ్చు. కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో దాల్చిన చెక్క తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఆయుర్వేద, ఔదష నిపుణులు కూడా సూచిస్తున్నారు.

2024-03-28T15:29:18Z dg43tfdfdgfd