దేశంలోనే తొలి కేసు: అధికారికంగా ఫోన్ ట్యాపింగ్ పై కేసు నమోదు

దేశంలోనే తొలి కేసు: అధికారికంగా ఫోన్ ట్యాపింగ్ పై కేసు నమోదు

హైదరాబాద్ : తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసుపై అధికారికంగా బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. టెలిగ్రాఫ్ యాక్ట్  జతపరుస్తూ నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు. దీంతో  దేశంలోనే తొలిసారిగా టెలిగ్రాఫ్ ఆక్ట్ కింద కేసు నమోదు అయ్యింది.

ఈ  ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాత్రధారులు, సూత్రధారులు ఎవరన్నది ఒక్కటొకటిగా తేలుతున్నది. పోలీసుల కస్టడీలో ఉన్న ఎస్ఐబీ (స్పెషల్​ ఇంటెలిజెన్స్​ బ్రాంచ్) మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావు విచారణలో గుట్టు బయట పెడుతున్నాడు. ప్రతిపక్ష నేతలు, ప్రజా సంఘాల నేతలే టార్గెట్​గా గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఫోన్​ ట్యాపింగ్​కు పాల్పడిందని, ఇందులో నాటి ఇంటెలిజెన్స్​ చీఫ్​ ప్రభాకర్ రావు కీలకంగా వ్యవహరించారని చెప్పాడు. దీంతో ప్రభాకర్​రావును ఈ కేసులో ప్రధాన నిందితుడి(ఏ1)గా పోలీసులు చేర్చారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నాడు.

ప్రణీత్ రావును ఏ2గా,  సిటీ టాస్క్ ఫోర్స్ మాజీ డీఎస్పీ రాధాకిషన్ రావును ఏ3గా, భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ(గతంలో ఇంటెలిజెన్స్​ అడిషనల్​ ఎస్పీ) భుజంగరావును ఏ4గా, హైదరాబాద్​ సిటీ సెక్యూరిటీ వింగ్​ అడిషనల్​ డీసీపీ (గతంలో ఇంటెలిజెన్స్​ అడిషనల్​ ఎస్పీ) తిరుపతన్నను ఏ5గా చేర్చారు. మరికొందరు ప్రైవేట్ వ్యక్తుల పేర్లను కూడా ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. ఈ కేసులో ఏ3గా ఉన్న రాధాకిషన్ రావును పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తి అయ్యాయి. మరికాసేపట్లో రాధాకిషన్ ను కోర్టులో హాజరుపర్చనున్నారు.

©️ VIL Media Pvt Ltd.

2024-03-29T12:29:10Z dg43tfdfdgfd