నాలుగు ఎంపీ స్థానాలకు 316 నామినేషన్లు

నాలుగు ఎంపీ స్థానాలకు 316 నామినేషన్లు

హైదరాబాద్/సికింద్రాబాద్/శామీర్​పేట/ఎల్బీనగర్/గండిపేట, వెలుగు : లోక్​సభ ఎన్నిలకు గురువారంతో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల ఎంపీ స్థానాలకు మొత్తంగా 316 నామినేషన్లు అందాయి. హైదరాబాద్​స్థానానికి చివరి రోజైన గురువారం 25 మంది 37 సెట్ల నామినేషన్లు వేశారు. మొత్తంగా 57 మంది నుంచి 85 నామినేషన్లు అందాయి. సికింద్రాబాద్ స్థానానికి గురువారం 23 మంది 26 సెట్ల నామినేషన్ల వేశారు.  మొత్తంతా 57 మంది నుంచి 75 నామినేషన్లు అందాయి.

మల్కాజిగిరి ఎంపీ స్థానానికి చివరి రోజు 61 మంది 91 సెట్ల నామినేషన్లు వేశారు. జగదీశ్వరరావు అనే దివ్యాంగుడు మల్కాజిరి ఇండిపెండెంట్​ఎంపీ అభ్యర్థిగా గురువారం నామినేషన్​వేశారు. దేశవ్యాప్తంగా 15% మంది దివ్యాంగుల కుటుంబాలు ఉన్నాయని, 10 కోట్ల దివ్యాంగ ఓటర్లు ఉన్నారని జగదీశ్వర్ రావు తెలిపారు. వారి గొంతుకగా తాను పోటీ చేస్తున్నట్లు తెలిపారు. మొత్తంగా మల్కాజిరిలో114 మంది నుంచి 177 నామినేషన్లు అందాయి. చేవెళ్ల ఎంపీ స్థానానికి మొత్తంగా 82 మంది 88 సెట్ల నామినేషన్లు వేశారు. చివరి రోజు 30 మంది నుంచి 32 నామినేషన్లు దాఖలయ్యాయి.

అలాగే కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి మొత్తంగా 24 మంది నుంచి 50 నామినేషన్లు వచ్చాయి. చివరి రోజైన గురువారం 15 మంది 24 సెట్ల నామినేషన్లు వేశారు. కంటోన్మెంట్ రిటర్నింగ్ ఆఫీసును ఎన్నికల జనరల్ అబ్జర్వర్​ ప్రియాంక శుక్లా(ఛత్తీస్ గఢ్) సందర్శించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల జనరల్, పోలీస్ ఎన్నికల పరిశీలకులు డాక్టర్ సరోజ్ కుమార్, పి.శ్రీవిద్య, శాశంక్ ఆనంద్ గురువారం హైదరాబాద్ చేరుకున్నారు. జీహెచ్ఎంసీ ఆఫీసుకు వచ్చారు. బల్దియా కమిషనర్ రోనాల్డ్ రోస్ వారికి ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను  వివరించారు.

©️ VIL Media Pvt Ltd.

2024-04-26T05:06:05Z dg43tfdfdgfd