నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : ESICలో ఉద్యోగాలు..ఎగ్జామ్ లేకుండానే ఎంపిక..నెలకు రూ.67000పైనే

ESCIC Recruitment 2024 : ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC)లో వివిధ విభాగాలలో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభం అయింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ esic.gov.in ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అప్లయ్ చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 5,2024. ఈ పోస్ట్ లకు అప్లయ్ చేయాలనుకుంటున్నట్లయితే పోస్టుల వివరాలు,జీతం,అర్హత,వయోపరిమితి,ఎంపిక ప్రక్రియ తదితర వివరాలు ఇక్కడ చూడండి.

పోస్టుల వివరాలు

జనరల్ మెడిసిన్- 02 పోస్టులు

జనరల్ సర్జరీ- 02 పోస్టులు

ఆర్థోపెడిక్స్- 02 పోస్టులు

అనస్థీషియా - 01 పోస్ట్

పీడియాట్రిక్స్- 01 పోస్ట్

సైకియాట్రీ - 01 పోస్ట్

మొత్తం-09 పోస్టులు

వయోపరిమితి

అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి ఇంటర్వ్యూ తేదీ నాటికి 45 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు.

నిరుద్యోగులకు భారీ శుభవార్త: పరీక్ష లేకుండానే రైల్వే ఉద్యోగాలు..నెలకు రూ.35000 కంటే ఎక్కువ జీతం

విద్యార్హత

ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు/కాలేజీల నుండి సంబంధిత స్పెషలైజేషన్‌లో PG డిగ్రీ/DNB/డిప్లొమాతో MBBS కలిగి ఉన్న అభ్యర్థులు ESIC యొక్క ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా పరిగణించబడతారు.

అప్లికేషన్ ఫీజు

అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ. 300 చెల్లించాలి. దరఖాస్తు రుసుము డిమాండ్ డ్రాఫ్ట్/బ్యాంకర్ చెక్కు రూపంలో 'ESI ఫండ్ A'కి చెల్లించబడుతుంది. SC/ST/PH, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.

---- Polls module would be displayed here ----

ఎంపిక ప్రక్రియ

వాక్-ఇన్ ఇంటర్వ్యూలో పనితీరు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూకు హాజరు కావడానికి TA/DA చెల్లించబడదు.

జీతం

ESIC రిక్రూట్‌మెంట్ 2024కి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.67700 జీతం చెల్లించబడుతుంది.

అప్లయ్ చేయడానికి లింక్,నోటిఫికేషన్‌ను ఇక్కడ చూడండి

ESIC Recruitment 2024అప్లయ్ చేయడానికి లింక్

ESIC Recruitment 2024 నోటిఫికేషన్

ఇతర సమాచారం

అభ్యర్థులు డాక్యుమెంట్ల వెరిఫికేషన్ కోసం ఉదయం 09:00 గంటలకు రిపోర్టింగ్ సమయంలో ESIC మోడల్ హాస్పిటల్, బాపునగర్, అహ్మదాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ (2వ అంతస్తు)దగ్గర హాజరు కావాలి.

ఇంటర్వ్యూ తేదీ- 05.04.2024 ఉదయం 09:30 నుండి

స్థానం- మెడికల్ సూపరింటెండెంట్ కార్యాలయం, ESIC మోడల్ హాస్పిటల్, బాపునగర్, అహ్మదాబాద్ (గుజరాత్)

2024-03-29T10:16:07Z dg43tfdfdgfd