Trending:


Fact Check: 2024 Ap అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ‘ETG Research’ ప్రీపోల్ సర్వే చేసిందా?

2024 Ap అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ‘ETG Research’ఎలాంటి ప్రీపోల్ సర్వే ఫలితాలను విడుదల చేయలేదు13 మే 2024న జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో, తెలుగుదేశం పార్టీకి(TDP) 110-120 సీట్లు, జనసేన పార్టీకి(JSP) 18-20 సీట్లు, వైసీపీకి(YCP) 24-27, బీజేపీకి(BJP) 5-6 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి(INC) 0-1 సీటు వస్తాయని, అలాగే TDP-JSP-BJP కూటమికి 54.75 శాతం ఓట్లు, YCPకి 36 శాతం ఓట్లు, INCకి 05 శాతం ఓట్లు, ఇతరులకు 4.25 శాతం ఓట్లు వస్తాయని ‘ETG Research’...


జార్జియా మరో యుక్రెయిన్‌గా మారనుందా?

ఇది గత కొంతకాలంగా జార్జియాలో పౌరసమాజంపై వివిధ రూపాలలో జరుగుతున్న దాడులలో భాగం. ఈ చట్టం ఎవరినైనా అణిచివేసే చట్టం. ప్రభుత్వానికి నచ్చని ఏ పౌర సమాజ సంస్థనైనా అణిచివేసే వెసులుబాటు ఈ చట్టం కల్పిస్తోంది’


TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త.. స్వామివారి దివ్యానుగ్రహం పొందే అరుదైన అవకాశం

తిరుపతి ఎప్పుడు చూసినా నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా ఉంటుంది. ప్రతి రోజు లక్షలాది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి సైతం భక్తులు ఇక్కడకు వస్తుంటారు. నిత్యం గోవింద నామ స్మరణంతో తిరుమల కొండలు మారుమోగుతుంటాయి. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో తిరుమలకు సాధారణ భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఈ నేపథ్యంలో సామాన్యులకు మేలు కలిగేలా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీ బ్రేక్ దర్శనాలను కొన్ని రోజుల పాటు రద్దు చేసింది. ఈ క్రమంలోనే తిరుమతిలోని శ్రీనివాసమంగాపురంలో కొలువైన కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక వసంతోత్సవాలు మే 27 నుంచి మే 29 వరకు మూడురోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. తొలి రెండు రోజులు శ్రీవారు ఉభయనాంచారులతో కలిసి వసంతోత్సవంలో పాల్గొంటారు. ఉత్సవాల్లో చివరిదైన మూడోరోజు ఉత్సవమూర్తులను వసంత మండపానికి తీసుకొచ్చి వేదపండితులు శాస్త్రోక్తంగా ఆస్థానం నిర్వహిస్తారు. వసంత రుతువులో లభించే పుష్పాలు, ఫలాలను సమర్పించి స్వామి వారి దివ్యానుగ్రహం పొందడమే వసంతోత్సవం ముఖ్య ఉద్దేశమని పండితులు చెప్తున్నారు. కాగా.. వేసవిలో తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు టీటీడీ అధికారులు. క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు, అల్పాహారం, వైద్య సౌకర్యాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు ఎండ వేడి నుండి ఉపశమనం కల్పించేందుకు ఆలయ మాడ వీధుల్లో చలువ పందిళ్లు, చలువసున్నం, కార్పెట్లు ఏర్పాటు చేస్తామని ఆలయ ఈఓ తెలిపారు. ఆలయ పరిసరాల్లో భక్తులు సేద తీరేందుకు తాత్కాలిక షెడ్లు కూడా ఏర్పాటు చేశామని అన్నారు. ఈ వేసవిలో తిరుమలకు వచ్చే భక్తుల కోసం మరిన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో తెలిపారు.


ఉచిత బస్సు ప్రయాణంపై మోదీ కామెంట్స్.. మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్

తెలంగాణలో అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం పథకంపై ప్రధామంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్న ప్రభాకర్ స్పందిస్తూ.. ఓ వీడియో విడుదల చేశారు. ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రధాని మోదీ సహించకపోవటం దురదృష్టకరమని.. మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించటాన్ని మోదీ జీర్ణించుకోలేకపోతున్నారంటూ పొన్నం దుయ్యబట్టారు. ఈ పథకంలో తప్పేముందంటూ ప్రధానిని ప్రశ్నించారు. ఉచిత ప్రయాణం వల్లే మెట్రోకు నష్టాలు వస్తున్నాయనటం దారుణమన్నారు.


అమెరికా U-వీసా కుట్ర కేసులో నలుగురు భారతీయులు

అమెరికా U-వీసా కుట్ర కేసులో నలుగురు భారతీయులు U-వీసాల కోసం సాయుధ దోపిడీలకు పాల్పడినందుకు నలుగురు భారతీయ పౌరులతో సహా ఆరుగురు వ్యక్తులపై US కోర్టు అభియోగాలు మోపింది. చికాగో, శివారు ప్రాంతాల్లో సాయుధ దోపిడీలకు పాల్పడినట్లు ఫెడరల్ కోర్టు శుక్రవారం వారిపై నేరారోపణ చేసింది. తద్వారా బాధితులు యునైటెడ్ స్టేట్స్‌లోని నిర్దిష్ట నేర బాధితుల కోసం రిజర్వు చేసిన ...


జూన్ 4 లోగా లక్ష ఫిర్యాదుల పరిష్కారం

జూన్ 4 లోగా లక్ష ఫిర్యాదుల పరిష్కారం గత సర్కారు హయాంలో రెండున్నర లక్షల కంప్లయింట్స్  ఇప్పటికే లక్షన్నర సాల్వ్ చేసిన ఆఫీసర్లు ‘ధరణి’ కమిటీ  కీలక నిర్ణయం  ఆ తర్వాతే సర్కారుకు నివేదిక  ప్రక్షాళన దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు హైదరాబాద్: ధరణి సమస్యలపై చర్చించేందుకు ఏర్పాటైన కమిటీ ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 4వ తేదీలోగా పెండింగ్ లో ఉన్న లక్ష ...


Taiwan: తైవాన్ పార్లమెంట్ లో కాలర్లు పట్టుకుని కొట్టుకున్న ఎంపీలు.. వైరల్ వీడియో..

Taiwan parliament: తైవాన్ పార్లమెంట్ లో శుక్రవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒక బిల్లును ప్రవేశ పెట్టే క్రమంలో అధికార, అపోసిషన్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఒకరిపై మరోకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు.


ఖమ్మంలో విషాదం.. బస్సులోంచి జారిపడి యువతి మృతి

ఖమ్మంలో విషాదం.. బస్సులోంచి జారిపడి యువతి మృతి హైదరాబాద్​:  ఆర్టీసీ బస్సులోంచి జారిపడి ఓ యువతి మృతి చెందింది.  ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పెద్దమునగాలకు చెందిన అనూష (26) బస్సులో వెళుతోంది. ఈక్రమంలో ఎం పీడీవో ఆఫీసు సమీపంలోకి రాగానే  ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఆర్టీసీ డ్రైవర్‌ ఒక్కసారిగా బ్రేక్‌ వేశాడు. దీంతో బస్సు ఫుట్‌బోర్డుపై నిలుచున్న...


Gajalakhmi RajYoga: మరో రెండు రోజుల్లో గజలక్ష్మీ రాజయోగం.. ఈ రాశులకు ధన లాభం..!

Rajyog Rashifal: ఈ మొత్తాలన్నీ మే 19న అందుకోబోతున్నాయనే శుభవార్త. మా లక్ష్మి వారి తలపై చేతులు పెట్టుకుంటుంది... Gajalakhmi RajYoga: గ్రహం యొక్క సంచారాన్ని బట్టి అదృష్ట చక్రం మారవచ్చు. గ్రహాల స్థానాలలో మార్పులు 12 వ రాశి వ్యక్తులను ప్రభావితం చేస్తాయి. కొన్నిసార్లు ఆ ప్రభావం సానుకూలంగా ఉంటుంది, కొన్నిసార్లు ప్రతికూలంగా ఉంటుంది. Gajalakhmi RajYoga:శుక్రుడు, సంపద , శ్రేయస్సును ప్రసాదించేవాడు. మే 19న శుక్రుడు వృషభ రాశికి సంచారం చేస్తాడు. పర్యవసానంగా వృషభరాశిలో గురు, శుక్రుడు కలవడం వల్ల గజలక్ష్మీ రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం చాలా శుభప్రదం Gajalakhmi RajYoga: గజలక్ష్మి రాజయోగం ఫలితంగా, కొన్ని రాశుల యొక్క నుదురు కొన్ని ప్రభావాలలో తెరవబడుతుంది. శుభకాలం ప్రారంభమవుతుంది. చాలా డబ్బు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారాలలో చాలా లాభాలుంటాయి. Gajalakhmi RajYoga: మేష రాశి వారికి జీవితంలో ఉత్తమ విజయాన్ని అందిస్తుంది. ఆర్థిక లాభం ఉంటుంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు వ్యాపారంలో గొప్ప విజయాన్ని సాధించగలరు. ఉద్యోగార్థులకు కూడా మంచి సమయం. గౌరవం పెరుగుతుంది. ప్రేమ జీవితం బాగుంటుంది. Gajalakhmi RajYoga: వృషభం: గురు, శుక్రుల కలయిక వల్ల వృషభ రాశిలో గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది, ఈ రాశి వారికి చాలా శుభప్రదం అవుతుంది. ఏదో పెద్దది జరగబోతోంది. సింగిల్స్ పెళ్లి చేసుకోవచ్చు. కెరీర్‌లో మీరు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అవకాశం లభిస్తుంది. ఆర్థిక లాభం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. Gajalakhmi RajYoga: మకరం: గజలక్ష్మి రాజయోగం కూడా మకర రాశి వారికి అనుకూల ఫలితాలను ఇస్తుంది. విజయాన్ని రుచి చూస్తారు. ఒకరి సహాయంతో పెద్ద లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ జీవితం బాగుంటుంది. మీరు పిల్లల నుండి కూడా ఆనందాన్ని పొందుతారు. డబ్బు వస్తుంది. Gajalakhmi RajYoga: కుంభం: ఈ ప్రత్యేక యోగం కుంభరాశి వారిపై కూడా ప్రభావం చూపుతుంది. జీవితంలో సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయి. డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. పాత పెట్టుబడుల వల్ల లాభాలు వచ్చే అవకాశం ఉంది. సమాజంలో విలువలు పెరుగుతాయి. (Disclaimer: ఈ సమాచారం సాధారణ సమాచారంపై ఆధారపడింది. న్యూస్ 18 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)


సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్

సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్, ఎంపీ అవినాష్ రెడ్డిల పేర్లను ప్రస్తావించద్దంటూ కడప కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీమ్ కోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచార సమయంలో జగన్, అవినాష్ ల పేర్లు ప్రస్తావించద్దంటూ షర్మిల, సునీత, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై విధించిన ఆంక్షలను సవాల...


Nagababu: ఎలక్షన్ ఇంకా పూర్తి కాలేదు, అరాచకాలకు ఛాన్స్! స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పహారా ఉండాలి: నాగబాబు

Janasena Leader Naga Babu: అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిశాయి అనుకోవద్దని, ఓట్ల లెక్కింపు ఇంకా పూర్తికాలేదని.. కౌంటింగ్ ముగిసే వరకూ అప్రమత్తంగా ఉండాలని కూటమి పార్టీల శ్రేణులకు నాగబాబు పిలుపునిచ్చారు. ఓటమి కళ్ల ముందు కనిపించడంతో వైసీపీ శ్రేణులు ఎలాంటి అరాచకానికి పాల్పడుతారో పల్నాడు, తాడిపత్రి, తిరుపతిల్లో చూశామన్నారు. ఏపీ ఎన్నికల్లో దాదాపు 82 శాతం ఓట్లు పోలవడం ప్రజాస్వామ్య విజయం అని, కానీ కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఎలక్షనీరింగ్ పూర్తి...


స్వాతి మలివాల్‌ దాడి కేసులో కేజ్రీవాల్ పీఏ అరెస్ట్

స్వాతి మలివాల్‌ దాడి కేసులో కేజ్రీవాల్ పీఏ అరెస్ట్ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో కీలక పరిణామం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ పీ.ఏ బిహవ్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కుమార్‌ను సీఎం ఇంటి వెనుక గేటు నుంచి బయటకు తీసుకెళ్లారు. దర్యాప్తులో సహకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని కుమార్ ఢిల్లీ పోలీసులకు ఇమెయిల్ పంపిన వెంటనే ఈ ఘటన జరిగింది....


Jeevan Reddy : మత విశ్వాసాలను రెచ్చగొట్టేలా ప్రధాని వ్యాఖ్యలు : జీవన్‌రెడ్డి

Jeevan Reddy About PM Modis Comments: ప్రధాని నరేంద్ర మోదీ మతవిశ్వాసాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే అయోధ్య రామాలయాన్ని బుల్డోజర్‌తో కూల్చేస్తారంటూ మోదీ వ్యాఖ్యలు చేయడం దారుణమని జీవన్‌ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో జీవన్‌ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అయోధ్య రామాలయంపై...


ఆంధ్రప్రదేశ్: స్వాతంత్ర్యం వచ్చాక 75 ఏళ్ల తర్వాత తొలిసారి ఓటు వేసిన ఈ ఊరి ప్రజలు ఇప్పుడు ఏమంటున్నారంటే..

ఆంధ్రప్రదేశ్‌లోని ఈ గ్రామానికి చెందిన ఆదివాసీలు తొలిసారి ఓటు వేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వారు పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటేయడం ఇదే తొలిసారి.


తెలుగుదేశం ఆఫీసులో వైఎస్ జగన్ ఎయిర్‌పోర్ట్ ఘటన డాక్టర్.. సంచలన ఆరోపణలు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్లే సమయంలో గన్నవరం ఎయిర్ పోర్టులో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తూ పోలీసులకు పట్టుబడటం కలకలం రేపింది. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వెంకటాయపాలెనికి చెందిన ఎన్ఆర్ఐగా గుర్తించారు. అయితే పోలీసులు తనను అకారణంగా అదుపులోకి తీసుకున్నారని డాక్టర్ లోకేష్ కుమార్ ఆరోపిస్తున్నారు. సీఎం అవినీతిని ప్రశ్నించాననే కారణంతోనే అదుపులోకి తీసుకుని హింసించారని ఆరోపించారు.


Ananthapuram Politics : అనంతపురం జిల్లాలో హోరాహోరీ - పోలింగ్ సరళితో రాని స్పష్టత - జోరుగా బెట్టింగులు

Elections 2024 : అనంతపురం జిల్లాలో నిన్న మొన్నటి వరకు అభ్యర్థుల ప్రచారాల హో.. అభ్యర్థుల ఇళ్ల వద్ద నాయకులు,కార్యకర్తలు, ఓటర్లు హంగామా. ఇప్పుడు పోలింగ్ అయిపోయింది టెన్షన్ తేరింది అనుకున్నారు. కానీ ఇప్పుడు పోటీ చేసిన అభ్యర్థుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. గెలుపు లెక్కలతో ఎవరికి వారు టెన్షన్లు పెంచుకుంటూ పోతున్నారు. పోటీచేసిన అభ్యర్థుల్లో టెన్షన్ టికెట్ రానంత వరకు టికెట్ రాదేమో అని భయపడిన నేతలు టికెట్ వచ్చి బరిలో నిలిచిన అనంతరం గెలుస్తామో లేదో అన్న...


తెలంగాణలో వాళ్లందరికీ గుడ్‌న్యూస్.. లక్షతో పాటు తులం బంగారం, నిధులు విడుదల

తెలంగాణ వాసులకు కాంగ్రెస్ ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కళ్యాణ లక్ష్మి లబ్దిదారులకు అదిరిపోయే శుభవార్త వినిపించింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు.. కళ్యాణ లక్ష్మి పథకం కింద లక్ష రూపాయల ఆర్థిక సహాయంతో పాటు.. తులం బంగారం కూడా ఇచ్చేందుకు గానూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఉత్తర్వులు కూడా విడుదల చేశారు.


TS EAPCET Rank Cards: టీఎస్ ఎప్‌సెట్-2024 ర్యాంకు కార్డులు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

TS EAPCET 2024 Rank Cards: తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన TSEAPCET -2024 పరీక్ష ఫలితాలు మే 18న విడుదలైన సంగతి తెలిసిందే. ఫలితాలతోపాటు ర్యాంకు కార్డులను కూడా అందుబాటులో ఉంచారు. అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు తమ ఎప్‌సెట్ రిజిస్ట్రేషన్ నెంబరు, ఎప్‌సెట్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ర్యాంకుకార్డులు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది....


Post-Poll Violence In AP : పోలింగ్ అనంతర హింసపై సిట్‌ దర్యాప్తు ప్రారంభం- నాలుగు ప్రాంతాల్లో నాలుగు బృందాల పర్యటన

Telugu News: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు ప్రక్రియ ప్రారంభమైంది. వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో ఏర్పాటైన 13 మంది సభ్యులతో కూడిన సిట్‌ ఇవాళ తొలిసారిగా ఆన్‌లైన్‌లో సమావేశమైంది. సిట్‌కు బాధ్యత వహిస్తున్న బ్రిజ్‌లాల్‌ శుక్రవారం రాత్రే డీజీపీతో సమావేశమయ్యారు. అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉన్నందున ఉదయాన్నే పని ప్రారంభించారు. మార్నింగ్‌ 13 మందితో...


ఆర్టీసీకి, మెట్రోకి సంబంధమే లేదు... మంత్రి పొన్నం ప్రభాకర్​

ఆర్టీసీకి, మెట్రోకి సంబంధమే లేదు... మంత్రి పొన్నం ప్రభాకర్​ మహిళలకు ఫ్రీ బస్ .. పీఎం జీర్ణించుకోలేకపోతుండ్రు ప్రధాని స్థాయి దిగజార్చవద్దు హైదరాబాద్: ఉచిత బస్సు సౌకర్యాలపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు.‘మహిళలు ఫ్రీ బస్​జర్నీ చేయడాన్ని పీఎం జీర్ణించుకోలేకపోతున్నరు. కొన్ని రాష్ట్రాలు అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్య...


Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు

Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలకు మండే ఎండల నుండి కాస్త రిలీఫ్ దక్కింది. గత కొద్దీ రోజులుగా అక్కడక్కడా కురుస్తున్న వర్షాలతో ఇరు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. తీవ్రమైన ఎండలతో అల్లాడిన జనాలు వర్షాలతో ఉపశమనం పొందుతున్నారు. ఈ వర్షాలు ఇంకొన్ని రోజుల పాటు కురవనున్నాయని వాతావరణ శాఖ...


కేయూ వైస్ ఛాన్సలర్ పై విజిలెన్స్ ఎంక్వైరీకి సర్కార్ ఆదేశం

కేయూ వైస్ ఛాన్సలర్ పై విజిలెన్స్ ఎంక్వైరీకి సర్కార్ ఆదేశం వరంగల్:  కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తాటికొండ రమేశ్ పై విజిలెన్స్ ఎంక్వైరీకి సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో వీసీ రమేశ్ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణకు చర్యలు చేపట్టారు అధికారులు. అక్రమ నియామకాలు,  బదిలీలు, ఫేక్ ప్రాజెక్టులకు అప్రూవల్స్ తదితర అక్రమాలపై ఉద్యోగ, విద్యార్థి సంఘాల నేతల...


Mallareddy Land Issue : పోలీసుల అదుపులో ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి - భూ వివాదమే కారణం !

Telangana News : మాజీమంత్రి మల్లారెడ్డి , ఆయన అల్లురు రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేట్‌బషీరాబాద్‌ పీఎస్‌కు తరలించారు . సుచిత్ర పరిధిలోని సర్వే నెం.82లో భూ వివాదం నేపథ్యంలో…. ల్యాండ్‌ దగ్గరకు వచ్చి హల్‌చల్‌ సృష్టించారు మల్లారెడ్డి, రాజశేఖర్‌ రెడ్డి. ఈ తరుణంలోనే… మల్లారెడ్డిని పేట్‌బషీరాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. .కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని కాపాడుకుంటానంటూ మల్లారెడ్డి వివాదం ఉన్న స్థలంలో వీరంగం...


JNPA: జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీలో హెచ్ఆర్‌ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, టైపిస్ట్ పోస్టులు

JNPA Recruitment: ముంబయిలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ కాంట్రాక్ట్ ప్రాతిపదికన నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 05 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మే 28 నుంచి 30వ తేదీ వరకు ఇంటర్వ్యూకి హాజరు కావోచ్చు. షార్ట్‌లిస్టెడ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. వివరాలు.. ఖాళీల సంఖ్య: 05 ⏩ మార్కెటింగ్...


CBSE 12th Result 2024 : సీబీఎస్ఈ 12వ తరగతి మార్కుల వెరిఫికేషన్‌ రిజిస్ట్రేషన్ ప్రారంభం.. పూర్తి వివరాలివే

CBSE Class 10th 12th Result 2024 : సీబీఎస్‌ఈ వార్షిక ఫలితాలు ఇప్పటికే విడుదలయ్యాయి. అయితే.. తాజాగా 12వ తరగతి మార్కుల వెరిఫికేషన్‌ కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి.


Telangana Cabinet Meeting: కేబినెట్ భేటీకి అనుమతి రాకపోతే ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు

EC Denied Permission To Telangana Cabinet Meeting: హైదరాబాద్: ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాకపోవడంతో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రైతాంగానికి సంబంధించిన పలు కీలకమైన అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించాలని మంత్రులు భావించారు. కేబినెట్ భేటీ నిర్వహించడానికి ప్రభుత్వం ముందుగానే ఈసీని అనుమతి కోరింది. కానీ శనివారం (మే 18న) మధ్యాహ్నం నుంచి రాత్రి 7 గంటల వరకు ఈసీ నుంచి ఎలాంటి సమాచారం...


మహిళల కోసం ప్రభుత్వం అద్భుతమైన ప్రభుత్వ స్కీమ్.. వివరాలివే..!

దేశంలోని మహిళలను ఆర్థికంగా బలంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కీలక పథకాలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే మహిళలను పెట్టుబడుల వైపు ఆకర్షించడానికి కేంద్ర ప్రభుత్వం ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్’ (MSSC) పథకాన్ని తీసుకొచ్చింది. పట్టుబడిపై ఆకర్షణీయమైన రాబడి వచ్చేలా మహిళల కోసం ప్రత్యేకంగా ఈ మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీం ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ 2023లో ప్రకటించిన భారత ప్రభుత్వం ప్రకటించిన ఈ పథకం మహిళలకు వెన్నుదన్నుగా నివలబోతోంది. ఈ స్కీం ద్వారా మహిళలు లేదా బాలికల పేరిట 2 సంవత్సరాల కాలవ్యవధికి గాను రూ. 2 లక్షల వరకు డిపాజిట్ సౌకర్యాన్ని అందిస్తున్నారు. దీనిపై అధిక వడ్డీ చెల్లిస్తారు. పోస్టాఫీస్ తో పాటు పలు బ్యాంకుల్లో ఈ స్కీం అందుబాటులో ఉంటుంది. 2023లో ప్రారంభించిన ఈ పథకం రెండేళ్ల పాటు అనగా మార్చి 2025 వరకు అందుబాటులో ఉండనుంది. మహిళా ఇన్వెస్టర్లను ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌ని తీసుకొచ్చింది. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసిన వారు సంవత్సరానికి 7.5 శాతం స్థిర వడ్డీ అందుకుంటారు. ప్రతి 3 నెలలకోసారి వడ్డీ లెక్కింపు జరుగుతుంది. అనంతరం ఈ మొత్తం ఖాతాలో జమవుతుంది. ఈ పథకంలో మహిళలు ఎవరైనా చేరే వీలు కల్పించారు. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ (MSSC) పథకంలో చేరాలంటే మహిళ పేరు మీదే అకౌంట్ ఓపెన్ చేయాలి. పిల్లలకు, ఇతర చిన్నారులకు గార్డియన్‌గా ఉంటూ ఖాతా తెరిచే వీలుంది. ఇప్పటికే ఈ పథకానికి మహిళల నుంచి అనూహ్య స్పందన లభించింది. మహిళా సమ్మాన్ రెండేళ్ల గడువు కలిగిన పెట్టుబడి పథకం. రెండేళ్లు పూర్తయ్యాక అసలుతో పాటు వడ్డీ ఖాతాలో జమ అవుతుంది. అయితే, కేవలం ఒకేసారి పెట్టుబడి పెట్టేందుకు వీలుంటుంది. పలు దఫాలుగా ఇన్వెస్ట్ చేయడం కుదరదు. ఇది గ్యారంటీడ్‌ రిటర్న్స్‌ అందించే సురక్షితమైన, లో-రిస్క్ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్‌ అని చెప్పుకోవచ్చు. వృత్తితో సంబంధం లేకుండా మహిళలు ఎవరైనా ఇందులో చేరి ఈ పథకం లబ్ది పొందవచ్చు. ఉదాహరణకు ఈ సేవింగ్స్‌ స్కీమ్‌లో రూ.2 లక్షలు పెట్టుబడి పెడితే, మొదటి త్రైమాసికం తర్వాత, రూ.3,750 వడ్డీని అందుకుంటారు. ఈ మొత్తం మళ్లీ రీఇన్వెస్ట్‌ అవుతుంది. రెండో త్రైమాసికం చివరిలో రూ.3,820 వడ్డీని అందుకుంటారు. ఈ మొత్తం కూడా తిరిగి ఇన్వెస్ట్‌ అవుతుంది. ఇలా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. బాండ్ మెచ్యూర్ అయినప్పుడు, ఇన్వెస్టర్లు మొత్తం రూ.2,32,044 అందుకుంటారు.


Swati Maliwal Case: స్వాతి మలివాల్‌పై దాడి కేసులో కీలక పరిణామం, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Swati Maliwal Assault Case: ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ దాడి కేసులో కీలక పరిణామం జరిగింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్‌ని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మే 13వ తేదీన ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లినప్పుడు బిభవ్ తనపై దాడి చేశాడని స్వాతి మలివాల్ ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 7-8 సార్లు చెంప దెబ్బలు కొట్టాడని, ఆ తరవాత ఛాతి కడుపులో తన్నాడని అందులో పేర్కొన్నారు. పీరియడ్స్ ఉన్నాయని చెప్పినా వినకుండా ప్రైవేట్...


Andhra News : పెట్రో బాంబులకు అలా చెక్ - ఏపీ అధికారుల ప్లాన్ వర్కవుట్ అవుతుందా ?

Andhra Election News : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల అనంతర హింస పెరిగిపోవడంతో కట్టడి కోసం పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా పెట్రో బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలను నిషేధించారు. అలా అమ్మితే పెట్రోల్ బంకుల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇటీవల పల్నాడులో జరిగిన గొడవల్లో పెట్రో బాంబులతో ఇరు వర్గాలు దాడులు చేసుకున్నాయి. తర్వాత మాచర్ల ఎమ్మెల్యే స్వగ్రామంలో జరిపిన సోదాల్లో పెద్ద ఎత్తున పెట్రో బాంబులు దొరికాయి. దీంతో...


కాకినాడ జిల్లాలో వెరైటీ వేషధారణలు.. చూస్తే జిగేల్ అనాల్సిందే..

భలే భలే బుట్ట బొమ్మలు ఆ బుట్ట బొమ్మలతో కలిసిన బటర్ ప్లై ఆకారాలు. ఇంకేముంది ఆ ఉమ్మడి జిల్లాలో ఏ కార్యక్రమం జరిగినా ఒక ప్రత్యేక రాష్ట్రం నుంచి ఆ బటర్ ప్లై బుట్ట బొమ్మలను తీసుకొస్తున్నారు. ఇంకా కార్యక్రమంలో ప్రత్యేక అట్రాక్షన్ గా ఆ బుట్ట బొమ్మలు నిలుస్తున్నాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. నిజానికి ఆ కార్యక్రమానికి వచ్చిన పలువురు కూడా అక్కడ ఆ బుట్ట బొమ్మ బటర్ఫ్లై లతో సెల్ఫీలు తీసుకుంటూ ఉత్సాహంగా గడుపుతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇంతకీ ఆ బుట్ట బొమ్మలో బటర్ ప్లై ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఆ జిల్లా ఎక్కడుంది ఆ విశేషాలు ఒకసారి చూద్దాం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కాకినాడ జిల్లాలో ఈ మధ్యకాలంలో ఏ ఆధ్యాత్మిక ఊరేగింపు జరిగిన ఏ వివాహ కార్యక్రమం ఊరేగింపు జరిగిన ఇతర రాష్ట్రాల నుంచి అంటే కేరళ రాష్ట్రం నుంచి బటర్ఫ్లై బుట్ట బొమ్మలు అతిథులుగా వస్తున్నారు. అంటే దాదాపు 11 మందికి పైగా ఈ బుట్ట బొమ్మల అలంకరణలో బటర్ఫ్లై వేషధారణలో రంగురంగుల విద్యుత్ కాంతులు ఆకట్టుకునే విధంగా మీరు వేషధారణలో ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా సాయం సంధ్య సమయంలో అదే విధంగా రాత్రి సమయంలో వీరి వేషధారణ ప్రత్యేకంగా పలువురిని ఆకర్షిస్తుంది. ఒక వివాహ కార్యక్రమాలు జరిగే ఊరేగింపు కావచ్చు. లేకపోతే ఒక అమ్మవారి జాతర కార్యక్రమంలో ఊరేగింపు కావచ్చు. ఇలా ఏ కార్యక్రమామైనా ఈ బుట్ట బొమ్మలు ముందు వెళ్తూ వారి ముందు ప్రత్యేక శబ్దం వెళుతుంది. నిజానికి రెండు కళ్ళు సరిపోవు అనే విధంగా అత్యంత అట్రాక్షన్ గా ఈ బుట్ట బొమ్మ బటర్ఫ్లై వేషధారణ ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. తొలిసారి కాకినాడ జిల్లాలో ఇటీవలే జరిగిన తలుపులమ్మ అమ్మవారి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ బుట్ట బొమ్మలు పరిచయం అనేది ప్రారంభం అయింది. నిజానికి జిల్లాలో ఇదే మొదటిసారి అని కూడా చెప్పుకోవచ్చు. కేరళ రాష్ట్రం నుంచి ఈ టీం ఇక్కడికి వచ్చినట్లుగా నిర్వాహకులు తెలియజేశారు. వివాహ కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు ఇలా విందు వినోదాల ఊరేగింపులో ఈ బుట్ట బొమ్మలు ప్రస్తుతం ట్రెండ్ సెట్ చేస్తున్నాయని చెప్పవచ్చు జిల్లాకు తొలిసారి ఈ బుట్ట బొమ్మల బటర్ ప్లై ఆకారాలు వేషధారణలు వేసుకున్న వారు వచ్చిన తరుణంలో అందరూ వింతగా తిలకించడం ప్రారంభించారు. కేరళ వాయిద్యం కేరళ వేషధారణ కలిస్తే ఎలా ఉంటాయో చూపించారు దీంతో అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎన్నో రకాల అద్భుత వేషధారనులు ఉన్నప్పటికీ ఈ బుట్ట బొమ్మల బటర్ ఫ్లై పైన మాత్రమే దృష్టి పెట్టారు. సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. వారితో మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తూ ఉత్సాహంగా కాకినాడ జిల్లాలో ప్రజలు గడిపారు. మరి మీకు కూడా మీ ప్రాంతంలో జరిగే కార్యక్రమానికి ఈ బుట్ట బొమ్మల బటర్ ఫ్లై కావాలంటే ఖచ్చితంగా కేరళ వారిని సంప్రదించాల్సిందే.


రాత్రిపూట కుక్కలు అరిస్తే ఏమౌతుంది..?

చెడు జరగబోతుంటే ముందుగానే గుర్తించి కుక్కలు ఏడుస్తాయని కొందరు నమ్ముతుంటే... కొందరు మాత్రం చనిపోయిన వారి ఆత్మలు కనిపించినప్పుడు కుక్కలు ఏడుస్తాయని భావిస్తారు. మీరు గమనించారో లేదో.. అర్థరాత్రి సమయంలో ఒక్కోసారి కుక్కలు గట్టిగా ఏడుస్తూ ఉంటాయి. కుక్కలు అరవడం వేరు.. ఏడ్వడం వేరు. ఆ ఏడుపు మనకు చాలా చిరాకుగా అనిపిస్తూ ఉ:టాయి. కానీ...ఆ ఏడుపు అశుభం అని చాలా మంది నమ్ముతారు. ఏదైనా జరగబోయే ప్రమాదాన్ని కుక్కలు ముందుగానే పసిగడతాయని, అందుకే ఏడుస్తాయని కూడా...


సింహాచలం వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. తిరుమల తరహాలోనే ఇక్కడ, ఇక హ్యాపీగా!

Simhachalam Two Electric Buses Started: సింహాచలం అప్పన్న దేవాలయంలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఆలయ చైర్మన్ అశోక్ గజపతిరాజు, ఈవో శ్రీనివాసమూర్తి ఈ బస్సుల్ని ప్రారంభించారు. ఒక్కో బస్సు ఖరీదు రూ.కోటి 65 లక్షలు కాగా.. రెండున్నర గంటల పాటు చార్జింగ్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 225 కిలోమీటర్ల పాటు మైలేజ్ ఇస్తుంది. భక్తుల సౌకర్యార్ధం.. కాలుష్యాన్ని తగ్గించేందుకు కరెంట్‌‌తో నడిచే బస్సుల్ని తీసుకొచ్చామన్నారు.


Tirupati Attack Case : చంపాలని కాదు ప్రతి దాడి మాత్రమే - పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో నిందితుడి భార్య ప్రకటన

Elections 2024 : నామినేషన్ సమయంలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాహనంపై దాడి చేసినందున తాము పులివర్తి నానిపై ప్రతిదాడి చేశామని అంతే కానీ ఆయనను చంపాలని కాదని ఈ దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న భానుకుమార్ రెడ్డి సతీమణి, జడ్పీటీసీ ఢిల్లీ రాణి అన్నారు. నిందితుల్ని అరెస్టు చేయడంతో ఆమె తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ప్రతి దాడి చేశాం ! చంద్రగిరి ఎమ్యెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాహనం పై చేసిన దాడికి ప్రతిదాడిగా పులివర్తి నాని...


ప్రధాని మోదీ ఛైర్‌లో కూర్చోబోతున్న 'కట్టప్ప'.. ఎందుకో తెలుసా..?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల రసవత్తరంగా సాగుతున్నాయి. దేశంలో ప్రధాని పదవి కోసం రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీ మధ్య పోరు సాగుతోంది. 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా 'పీఎం నరేంద్ర మోదీ' సినిమా విడుదలైంది. ఈ చిత్రంలో నరేంద్ర మోదీ పాత్రలో వివేక్ ఒబెరాయ్ నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా బోల్తాకొట్టడంతో.. ఎప్పుడు రిలీజ్ అయ్యిందో కూడా ప్రేక్షకులు మర్చిపోయారు. తాజాగా మోదీ జీవితంపై మరో చిత్రం తెరకెక్కబోతున్నట్లు,...


రాజీవ్‌ బతికుంటే రామాలయం ఎప్పుడో పూర్తయ్యేది:ఎమ్మెల్సీ జీవన్రెడ్డి

రాజీవ్‌ బతికుంటే రామాలయం ఎప్పుడో పూర్తయ్యేది:ఎమ్మెల్సీ జీవన్రెడ్డి రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్‌    గేట్స్​ తెరిచినప్పుడు మోదీ ఎక్కడున్నడు హైదరాబాద్​: రాజీవ్‌గాంధీ బతికుంటే రామాలయం నిర్మాణం ఎప్పుడో పూర్తయ్యేదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. ఇవాళ గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అయోధ్యలో రామాలయం గేట్లు తెరిపించి...


300 కిలోమీటర్లు పాదయాత్రగా వచ్చి.. కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించిన భక్తుడు

300 కిలోమీటర్లు పాదయాత్రగా వచ్చి.. కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించిన భక్తుడు కొండగట్టు అంజన్న దీవెనతో అనుకున్న కోర్కె తీరింది. శిథిలావస్థకు చేరిన సీతారామ భక్తాంజనేయ స్వామి ఆలయం నిర్మాణం పూర్తి అయింది. అంజన్న దీనెనతో అనుకున్నది జరిగిందని.. మొక్కులు చెల్లించుకునేందుకు ఓ భక్తుడు 300 కిలోమీటర్లు కాలినడకన కొండగట్టుకు చేరుకున్నాడు. స్వామివారిని దర్శ...


మద్యం మత్తులో 105 రూపాయలకు విలువైన ఇళ్లు కొన్నారు.. దీనిని చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది..!

105 రూపాయలు పెట్టి ఎవరైనా ఇల్లు కొన్నారని చెపితే.. సాధారణంగా ఎవరూ నమ్మరు. ఎందుకంటే ప్రస్తుతం ఆ డబ్బుకు ఇల్లు కాదు కదా అద్దెకు కూడా ఒక చిన్న గది కూడా దొరకదు. అయితే ఇంగ్లండ్‌లోని డెర్బీషైర్‌లో నివసిస్తున్న ఒక వ్యక్తి అదే చేశాడు. అంతేకాదు అతను తన భార్యతో కలిసి అక్కడే నివసిస్తున్నాడు. (Credit- YouTube) ది సన్ నివేదిక ప్రకారం.. బాబ్ కాంప్‌బెల్ అతని భార్య కరోల్ ఆన్ ఈ చవకైన మరియు విలాసవంతమైన ఇంట్లో నివసిస్తున్నారు. ఈ ఇల్లు నిర్మానం కోసం వారికి కేవలం 105 రూపాయలు మాత్రమే ఖర్చు అయ్యిందంటే ఎవరూ నమ్మలేరు. ఆన్‌లైన్ ట్రేడింగ్ సైట్ ఈబేలో మద్యం మత్తులో ఈ ఇంటిని తాము కొన్నట్లు బాబ్ స్వయంగా చెప్పాడు. (Credit- YouTube) అసలు ఏమయ్యిందంటే.. కాంప్‌బెల్ మద్యం మత్తులో ఉన్న సమయంలో.. కేవలం ఒక పౌండ్ అంటే 105 రూపాయలు విలువ చేసే ధాన్యం నిల్వ చేసే పెద్ద డ్రమ్‌ని కొనుగోలు చేశాడు. అయితే మద్యం మత్తు దిగిన తర్వాత తాము ధాన్యం డ్రమ్ కొనుగోలు చేశామని తెలుసుకొని.. దానితో ఇల్లు నిర్మించుకోవాలని అనుకున్నారు. అయితే ఇల్లు పూర్తి చేయడానికి మాత్రం ఆయనకు 6 సంవత్సరాలు పట్టింది. (Credit- YouTube) ధాన్యం నిల్వచేసే డ్రమ్ వారి ఇంటి గోడలుగా చేసుకున్నారు. అలాగని ఈ ఇంట్లో ఏ సౌకర్యాలు లేవనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇంట్లో వంటగడిలో ఓవెన్, హబ్, సింక్, కెటిల్ ఇలా అన్ని వస్తువులూ ఉన్నాయి. దీనితో పాటు ఈ దంపతులు సుఖంగా నిద్రించడానికి డబుల్ కాట్ మంచం కూడా ఫస్ట్ ఫ్లోర్ లో ఏర్పాటు చేసుకున్నారు. ఐదు సంవత్సరాలుగా గోపురం లాంటి ఈ ఇంట్లో ఆ జంట నివసిస్తుంది. అయితే ఈ ఇంటి గురించి మొదట చర్చించినప్పుడు తన భార్యకు ఈ ఐడియా అస్సలు నచ్చలేదని బాబ్ కాంప్‌బెల్ తెలిపాడు. అయితే ప్రస్తుతం ఆమెకు ఈ ఇల్లు స్వర్గంలా కనిపిస్తుందని తెలిపాడు. ఇక ఇంటిని నిర్మించుకున్న తర్వాత.. అతను చుట్టుపక్కల ప్రాంతాన్నంతా పచ్చని చెట్లతో నిపేశాడు. (Credit- YouTube) మొదట తాము కొన్న భారీ డ్రమ్ ని ఓ కళాఖండా మార్చాలని ఈ దంపతులు అనుకున్నారు.. అయితే తర్వాత దానితో 4మీటర్ల ఎత్తు.. నాలుగు మీటర్ల గుండ్రని ఇంటిని నిర్మించుకున్నారు. ఈ ఇంట్లో అనేక విషయాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. ఇంట్లో పొయ్యి, డైనింగ్ టేబుల్ కోసం పాత గ్యాస్ బాటిల్ నుంచి సిమెంటుతో చేసిన భాగాన్ని ఉంచారు. (Credit- YouTube) మద్యం మత్తులో కొనుగోలు చేసిన ఓ భారీ డ్రమ్ తో వీరు అద్భుతమైన ఇంటిని నిర్మించుకున్నారు. తాము అనుకోకుండా ఈ పని చేసినా మంచే జరిగిందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ జంట ఇంగ్లండ్ లో చాలా పాపులర్ అయ్యింది. (Credit- YouTube)


Lok Sabha Election 2024: ఎన్నికల్లో పట్టుబడిన డబ్బు ఎంతో తెలిస్తే షాక్! తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

Election Commission Of India: దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Election) తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ నేతలు పెద్ద ఎత్తున ప్రయత్నించారు. వారికి ఎలక్షన్ కమిషన్ (Election Commission) షాక్ ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన తనిఖీల్లో పెద్ద ఎత్తున డబ్బు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఎన్నికల తాయిళాలను ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు పట్టుబడిన నగదు, మాదక...


హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బ్యాడ్‌ న్యూస్.. సంస్థ కీలక ప్రకటన

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. మెట్రో సేవల్లో మార్పులు చేసినట్టు.. రాత్రి వేళల్లో సేవలు మరో అర్ధగంట పొడిగించినట్టుగా వచ్చిన వార్తలపై యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. అయితే.. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వార్తలను అధికారులు ఖండించారు. దీంతో.. రాత్రివేళల్లో ఆలస్యంగా ప్రయాణించే వాళ్లకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయనుకుని సంతోషించేలోపే.. సంస్థ ప్రకటన విడుదల చేయటంతో నిరాశకు లోనయ్యారు.


ఐన్‌స్టీన్ చెప్పినట్లే జరిగింది.. 109 ఏళ్ల క్రితం ఆయన ఏమన్నారంటే..!

ఈ పరిశోధన రాయల్ ఆస్ట్రోనామికల్ సొసైటీలో ప్రచురించబడింది. శాస్త్రవేత్తలు దాదాపు 10,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న బ్లాక్ హోల్ వ్యవస్థను పరిశీలించారు. శాస్త్రవేత్తలు బ్లాక్ హోల్ యొక్క అక్రెషన్ డిస్క్ యొక్క వేడి పదార్థం ద్వారా విడుదలయ్యే ఎక్స్-కిరణాలను సంగ్రహించారు. ఈ డేటాను గణిత నమూనాలలోకి అందించిన తర్వాత.. దానిపై మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు. ఐన్‌స్టీన్ 1915లో సాపేక్ష సిద్ధాంతాన్ని అందించారు. ఇందులో బ్లాక్ హోల్స్ కు సంబంధించి అంచనాలు వేశారు. అయితే ఇలా జరగడం శాస్త్రవేత్తలు చూడటం ఇదే తొలిసారి. ఒక వస్తువు బ్లాక్ హోల్‌ను సమీపిస్తే.. గురుత్వాకర్షణ శక్తి దాని వృత్తాకార కక్ష్యను విడిచిపెట్టి నేరుగా లోపలికి వెళ్లేలా చేస్తుంది అని ఐన్‌స్టీన్ చెప్పారు. ఇప్పుడు NASA యొక్క NuSTAR మరియు NICER అంతరిక్ష టెలిస్కోప్‌లు బ్లాక్ హోల్‌కు నాలుగు వైపులా అలాంటి ప్రాంతాలు ఉన్నాయని నిరూపించాయి. కాంతి వేగంతో కాల రంధ్రంలోకి పదార్థం కదులుతున్నట్లు శాస్త్రవేత్తలు గమనించారు.


ఇదెక్కడి ఇచ్చంత్రం సామీ.. నడిరోడ్డుపై భర్తను వదిలేసి భార్యాపిల్లల్ని కొట్టేసిన దొంగలు..!

హైదరాబాద్‌లో ఓ ఆశ్చర్యకరమైన దొంగతనం జరిగింది. దొంగలు ఓ ఫ్యామిలీని కొట్టేశారు. అది కూడా నడిరోడ్డు మీదే.అది కూడా భర్తను వదిలేసి.. భార్యను ఇద్దరి పిల్లల్ని ఎత్తుకెళ్లిపోయారు. మరి ఈ ఘటనను కిడ్నాప్ అనాలి కదా అనుకుంటున్నారా.. కాదు దొంగతనమే అనాలి. ఎందుకంటే.. ఎత్తుకెళ్లింది మనుషుల్ని కాదు.. విగ్రహాలను. అది కూడా రోడ్డు మీద జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన ఫ్యామిలీ విగ్రహాలను దొంగలు కొట్టేశారు. ఇప్పుడు దీనిపై నెట్టింట ఆసక్తికర చర్చ నడుస్తోంది.


స్వాతి మలివాల్ కేసులో తొలిసారి స్పందించిన కేజ్రీవాల్

స్వాతి మలివాల్ కేసులో తొలిసారి స్పందించిన కేజ్రీవాల్ న్యూఢిల్లీ:స్వాతి మలివాల్ కేసులో తొలిసారి స్పందించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. రాజ్యసభ ఎంపీ పేరు చెప్పకుండా కేజ్రీవాల్ బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన నేతలను ఒక్కొక్కరిగా ఎంచుకొని అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. తాజాగా తన వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ ను అరెస్ట్ చ...


Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు పని వేళల్లో మార్పులు, అధికారుల క్లారిటీ!

Hyderabad Metro : మెట్రో రైలు సమయాలు పొడిగింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు స్పష్టం చేశారు. యథావిధిగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే మెట్రో రైళ్లు నడుస్తాయన్నారు.


ప్రధాని మోదీ ప్రజలను రెచ్చగొడుతున్నారు: మల్లికార్జున్ ఖర్గే

ప్రధాని మోదీ ప్రజలను రెచ్చగొడుతున్నారు: మల్లికార్జున్ ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే  ఫైరయ్యారు. దేశ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్సీపీఎస్పీ నాయకుడు శరద్ పవార్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో కలిసి మే 1...


ఒకే కుటుంబంలోని ఐదుగురిని గొడ్డలితో నరికి చంపి.. వ్యక్తి ఆత్మహత్య!

ఒకే కుటుంబంలోని ఐదుగురిని గొడ్డలితో నరికి చంపి.. వ్యక్తి ఆత్మహత్య! రాయ్‌పూర్:  ఛత్తీస్‌గఢ్‌లో దారుణ సంఘటన జరిగింది. సారన్‌గఢ్-బిలాయ్‌గఢ్ జిల్లాలో మే 18వ తేదీ శనివారం ఒకే కుటుంబంలోని ఐదుగురు సభ్యులను నరికి చంపగా, మరొక వ్యక్తి ఉరివేసుకుని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. రాయ్‌పూర్‌కు 200 కిలోమీటర్ల దూరంలోని సలిహా పోలీస్ స్టేషన్ పరిధిలోని థర్గావ్ గ్రామ...


ఫేక్ సర్టిఫికెట్స్ దందా.. ఇద్దరు అరెస్ట్, నలుగురు పరార్

ఫేక్ సర్టిఫికెట్స్ దందా.. ఇద్దరు అరెస్ట్, నలుగురు పరార్ హైదరాబాద్:- నగరంలో నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టు చేశారు మహేశ్వరం ఎస్ఓటీ,  చైతన్య పురి పోలీసులు. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ల తయారీ చేసి నిరుద్యోగ యువతి యువకులకు విక్రహిస్తున్న  ఏడుగురు సభ్యుల ముఠాలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరో నలుగురు పరారయ్యారు. అరెస్టైన వారిని మెహదీపట...


KU Vice Chancellor: కేయూ వీసీ ప్రొ. రమేష్‌పై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశం

KU Vice Chancellor Prof Tatikonda Ramesh | వరంగల్: గత మూడేళ్లలో కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్. తాటికొండ రమేష్‌ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యునివర్సిటీ టీచర్ల సంఘం జనవరిలో సీఎం రేవంత్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శికి రెండు సార్లు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం కేయూ వీసీపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం శనివారం (మే 18న) నాడు ఆదేశాలు జారీ...


స్వాతి మలివాల్‌ దాడి కేసులో వీడియో రిలీజ్ చేసిన ఆప్

స్వాతి మలివాల్‌ దాడి కేసులో వీడియో రిలీజ్ చేసిన ఆప్ కేజ్రీవాల్‌ నివాసంలో స్వాతి మలివాల్‌ సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన సెకన్ల సీసీటీ ఫుటేజ్‌ శుక్రవారం వైరల్‌ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే స్వాతి మలివాల్ ఇంట్లో నుంచి పంపిచేటప్పుడు రికార్డ్ అయిన సీసీ టీవీ ఫుటేజ్ లు విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎక్స్‌లో పో...


ఈజిప్ట్ పిరమిడ్లు నిర్మాణం ఇలా జరిగిందంట.. వెలుగులోకి వచ్చిన షాకింగ్ సమాచారం..!

ఈజిప్టులో 3700 నుండి 4700 సంవత్సరాల క్రితం నిర్మించబడిన పిరమిడ్లు ప్రపంచ వింతలలో ఒకటి.అయితే వీటిని ఎలా నిర్మించారు, రాళ్లను ఎలా తీసుకొచ్చారు అనేది చాలా ఏళ్లుగా మిస్టరీగా మిగిలిపోయింది. తాజాగా దీనిపై అమెరికాలోని ఓ యూనివర్శిటీ నిర్వహించిన అధ్యయనంలో.. దాని రహస్యాలను తెలుసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. యూనివర్శిటీ ఆఫ్ నార్త్ కరోలినా విల్మింగ్టన్ పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. ఈజిప్టులో నైలు నదికి 64 కిలోమీటర్ల ఉపనది ఉండేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. అది అది పూర్తిగా ఎండిపోయి కొన్ని సంవత్సరాల తర్వాత ఎడారిగా మారిపోయింది. ఇక పిడమిడ్ల విషయానికి వస్తే.. దానిని నిర్మించడానికి ఉపయోగించిన భారీ రాళ్లను ఈ నదులు ఉపయోగించే ఇక్కడికి తరలించారని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. దీన్ని గుర్తించేందుకు రాడార్ శాటిలైట్ ఇమేజరీ టెక్నాలజీని ఉపయోగించారు. దీనికోసం 31 వరుసల పిరమిడ్‌లతో నది గమనాన్ని పరిశోధిస్తున్నామని ప్రొ.ఎమాన్ కోనిమ్ తెలిపారు. అలాగే రాడార్ శాటిలైట్ ఇమేజరీ టెక్నాలజీ ద్వారా ఇసుక కింద కొండచరియలు విరిగిపడడాన్ని గుర్తించి చిత్రాలను తీస్తున్నట్లు తెలిపారు. నది మార్గం, విస్తీర్ణం ఇంకా సరిగ్గా నిర్ధారించలేదని.. అప్పటికి ఉన్న మ్యాప్‌ను సాంకేతికతతో కనిపెడతామని చెపుతున్నారు.


హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్ల దూరం వెళ్లండి.. ఇక్కడ మీరు ఏం కోరుకుంటే అదే..

హైదరాబాదుకు 50 కిలోమీటర్ల దూరంలో యాదగిరిగుట్టపై లక్ష్మీ నరసింహ స్వామి కొలువుదీరినారు. ఈ దేవాలయం తెలంగాణలోనే ప్రముఖ క్షేత్రంగా పేరు గావించింది. పూర్వంలో యాద మహర్షి అనే ముని ఇక్కడ తపస్సు చేయడం వల్ల నరసింహుని దర్శనం పొందాడని భక్తులు చెప్తున్నారు. యాద మహర్షి పేరు మీదగా యాదగిరిగుట్టగా పిలవబడుతుంది. దీనిపై ప్రత్యేక కథనం లోకల్ 18 అందిస్తుంది.వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఉన్నటువంటి...