పూజ తర్వాతే ఇక్కడ మద్యం సేవిస్తారు.. ఆ భక్తులు ఎవరు ? ఆ ఆచారం ఎందుకు ?

మద్యం సీసాలను  పూజకు సమర్పించే ఆలయం ఒకటి ఉంది. ఇక్కడ మద్యం సీసాలను ఉంచి పూజలు నిర్వహించిన తర్వాతే మద్యాన్ని స్వీకరిస్తారు ఆ భక్తులు. ఇంతకు ఆలయం ఎక్కడ ఉందో తెలుసా? మన తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా అల్లాదుర్గం గ్రామ శివారులో...

మెదక్ జిల్లా అల్లాదుర్గం గ్రామ శివారులో వెలిసిన రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం ప్రముఖ ఆలయాలలో ఒకటి. భక్తులు కోరుకున్న కోరికలు తీర్చే ఆలయంగా ఈ ఆలయం ప్రసిద్ది గాంచిది. ఈ ఆలయానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఎక్కువగా ఈ ఆలయానికి మార్వాడీలు సోలాపూర్, పూణే, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుండి తమ మొక్కులు తీర్చుకునేందుకు వస్తుంటారు.

మీ చేతిలో మొబైల్ ఫోన్ ఉందా.. ఇలా చేయకుంటే ప్రమాదమే

అయితే వారి ఆచార సాంప్రదాయ ప్రకారంగా ఇక్కడ మద్యం బాటిళ్లను ఉంచి పూజలు నిర్వహించడం ఆనవాయితీ వస్తోంది. మద్యం బాటిళ్లను ఉంచి పూజలు నిర్వహించిన అనంతరం వాటిని వారు స్వీకరిస్తారు. ఈ సాంప్రదాయంపై ఆలయ పూజారి గంగాధర్ మాట్లాడుతూ.. మార్వాడీల వంశపారపర్యంగా మద్యం సీసాలను ఉంచి పూజలు నిర్వహించే సంప్రదాయం రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద కొనసాగుతుందన్నారు.

Pumpkin Deepam: అన్ని సమస్యలకు ఏకైక పరిష్కారం గుమ్మడికాయ దీపారదన.. ఎలా చేయాలంటే..

భక్తులకు కొంగుబంగారంగా ప్రసిద్ధిగాంచిన రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయానికి నిరంతరం మార్వాడీలు పూజల కోసం వస్తుంటారన్నారు. రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం ముందు నాగదేవతల విగ్రహాలతో పాటు ప్రత్యేకంగా గుండం ఉండగా, అక్కడే చెరువు సైతం వెలసి ఉంది. ఇక్కడికి వచ్చిన భక్తులు నాగ దేవతల విగ్రహాలకు కూడా పూజలు నిర్వహిస్తారు. ఏది ఏమైనా మార్వాడీలు తమ సంప్రదాయం ప్రకారం ఈ ఆలయం వద్ద మద్యం సీసాలను ఉంచి పూజలు నిర్వహించడం విశేషమే కదా మరి ! (మద్యపానం ఆరోగ్యానికి హానికరం)

2024-05-04T08:07:28Z dg43tfdfdgfd