పట్టుబట్టి వెంటిలేటర్ పై పరీక్ష రాసి..ఈ విద్యార్థిని ఎన్ని గ్రేడ్ పాయింట్స్ సాధించిందంటే ?

పది పరీక్ష రాయాలని పట్టు విడువకుండా.. వెంటీలేటర్ పై ఓ విద్యార్థిని పరీక్ష రాసి బెస్ట్ గ్రేడ్ పాయింట్స్ సాధించింది. ఇంతకు ఇంతగా పట్టుబట్టి పరీక్ష రాసిన విద్యార్థిని ఎవరో కాదు.. నాంపల్లికి చెందిన కిర్ఫాన్ కౌర్ ఖనూజా..

పది పరీక్షల సమయంలో ప్రమాదానికి గురైన ఈ విద్యార్థిని వైద్యశాలలో వెంటీలేటర్ పై ఉండి, పది పరీక్ష రాసింది. పూర్తి వివరాలలోకి వెళితే.. నాంపల్లికి చెందిన కిర్ఫాన్ కౌర్ ఖనూజా పదవ తరగతిని అబిడ్స్ లో గల స్లేట్ ది స్కూల్ లో పూర్తి చేసింది. కాగా పదవ తరగతి విద్యార్థులకు సాధారణంగా ఫ్రీ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో కిర్ఫాన్ కౌర్ ఖనూజా సైతం మార్చి 1వ తేదీన ఫ్రీ ఫైనల్ పరీక్షకు హాజరైంది. ఆ సమయంలో పరీక్ష రాసి తన తల్లితో పాటు ఇంటికి వెళ్తుండగా, అదే మార్గంలో బైక్ పై వస్తున్న ఓ యువకుడు.. హఠాత్తుగా వారిని ఢీకొన్నాడు. దీనితో కిర్ఫాన్ కౌర్ ఖనూజా కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు కేర్ వైద్యశాలకు తరలించి చికిత్స అందించే ప్రయత్నం చేశారు.

నాటి వైద్యశాల.. నేడు కళాశాల గా మారింది.. ఎక్కడంటే..

కానీ పది పరీక్షలకు ఈ ప్రమాదం ఆమె పాలిట శాపంగా మారిందని అప్పుడే తల్లిదండ్రులు గుర్తించారు. ఈ ప్రమాదంలో కిర్ఫాన్ కౌర్ ఖనూజా తలలో రక్తం గడ్డ కట్టి ఉన్నట్లు వైద్యులు తెలిపి, అందుకు తగిన చికిత్స ప్రారంభించారు. చికిత్స పూర్తైన అనంతరం కిర్ఫాన్ కౌర్ ఖనూజా కోలుకుంది. అయితే వైద్యులు మాత్రం ఎట్టి పరిస్థితిలో చాలా విశ్రాంతి అవసరమని ఆమె తల్లిదండ్రులకు సూచించారు.

ఇక కొంచెం కోలుకున్న ఈ విద్యార్థిని పది పరీక్ష ఎలాగైనా రాయాలని వెంటీలేటర్ పై నుండే పట్టుబట్టింది. దీనితో తల్లిదండ్రులు వద్దని వారించారు. అయినా చదువు పై బాల్యం నుండే మక్కువ గల కిర్ఫాన్ కౌర్ ఖనూజా మాట వినని పరిస్థితి. మరల తాను జూన్ లో పది పరీక్ష రాసిన యెడల తన సర్టిఫికెట్ పై సప్లిమెంటరీ అంటూ వస్తుందని గ్రహించి ఈ విద్యార్థిని మరింతగా తల్లిదండ్రుల పై ఒత్తిడి తెచ్చింది.

ఆ జిల్లాలలో ఠారెత్తిస్తున్న ఎండలు.. రికార్డ్ స్థాయిలో ఇలా..

చివరకు వారు వైద్యుల పర్యవేక్షణలో పరిక్ష రాసేలా చర్యలు తీసుకున్నారు. దీనికి పాఠశాల ప్రిన్సిపాల్ సైతం సహకరించగా.. వెంటీలేటర్ పై ఉంటూ కిర్ఫాన్ కౌర్ ఖనూజా పది పరీక్షలు రాసింది. తాజాగా విడుదలైన పది ఫలితాలలో కిర్ఫాన్ కౌర్ ఖనూజా 8.7 గ్రేడ్ పాయింట్స్ సాధించింది. తాను పట్టిన పట్టు విడువకుండా.,,, వెంటీలేటర్ పై ఉండి కిర్ఫాన్ కౌర్ ఖనూజా పది పరీక్ష రాయడమే కాకుండా బెస్ట్ గ్రేడ్ పాయింట్స్ సాధించడం పై ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు.

2024-05-02T03:14:21Z dg43tfdfdgfd