పదేళ్లు బీఆర్ఎస్​ దళితులను మోసం చేసింది : వివేక్​ వెంకటస్వామి

పదేళ్లు బీఆర్ఎస్​ దళితులను మోసం చేసింది : వివేక్​ వెంకటస్వామి

  • బీజేపీ ఏకంగా రిజర్వేషన్ల రద్దుకు సిద్ధమైంది
  • కాంగ్రెస్​ తోనే దళితులకు న్యాయం 
  • చెన్నూర్​ ఎమ్మెల్యే డాక్టర్​ వివేక్​ వెంకటస్వామి

పెద్దపల్లి, వెలుగు: పదేళ్ల పాలనలో బీఆర్ఎస్​ దళితులను మోసం చేసిందని, బీజేపీ ఏకంగా రాజ్యాంగాన్ని రద్దు చేసి, రిజర్వేషన్లను దళిత, బహుజనులకు లేకుండా చేయాలని కుట్ర చేస్తోందని చెన్నూర్​ ఎమ్మెల్యే డాక్టర్​ వివేక్​వెంకటస్వామి ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్‌‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెద్దపల్లి ఎంపీ  అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మద్దతు సభకు స్థానిక ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి వివేక్​ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీకి మూడొంతుల మెజారిటీ వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందన్నారు. 

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రిజర్వేషన్లు కొనసాగుతాయన్నారు. బీఆర్ఎస్​ సర్కార్‌‌‌‌లో దళితబంధు కోసం కమీషన్లు తీసుకుని, వారి కార్యకర్తలు, లీడర్లకే ఇచ్చుకున్నారన్నారు. దళితుల అభివృద్ధి కోరుకునే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థులను గెలిపించుకొని రాహుల్​ గాంధీని ప్రధానిగా చేసుకోవాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. 

పెద్దపల్లి నియోజకవర్గంలో విశాక ట్రస్టు ద్వారా సుమారు 2వేల బోర్ వెల్స్ వేయించామని ప్రభుత్వ స్కూళ్లలో బెంచీలు పంపిణీ చేశామని గుర్తుచేశారు. ఈనెల 13న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లడుతూ తన గెలుపులో ఎమ్మార్పీఎస్‌‌ లీడర్ల పాత్ర కూడా ఉందన్నారు. పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీ గెలుపు ఖాయమైందన్నారు. గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ దళితులకు చేసిందేమీ లేదన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌‌ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు పెరుక నవీన్​, లీడర్లు దుర్గప్రసాద్, బాపు, సజ్జద్, ఈర్ల స్వరూప, ఉనుకొండ శ్రీధర్​పటేల్​ తదితరులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-06T02:30:04Z dg43tfdfdgfd