పాము కరిచిందా? కంగారులో ఈ తప్పులు అస్సలు చేయొద్దు

ప్రస్తుతం పాము కాటు వల్ల చాలామంది చనిపోవడానికి కారణం పాము కరిచిన వెంటనే వారు చేసేటటువంటి పొరపాట్లే. తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు పాము కాటుకు గురైన అనంతరం వారు స్పందించే తీరును బట్టి ప్రాణాపాయస్థితికి చేరుకోవడం. లేదా అపాయము నుంచి తప్పించుకోవడం లాంటివి జరుగుతుంటాయని వైద్య నిపుణులు సైతం అంటున్నారు. కొందరు పాముకాటుకు గురైన వెంటనే నాటు వైద్యం చేసే వాళ్ళని ఆశ్రయించడం చేస్తుంటారు.‌

ముఖ్యంగా ఏజెన్సీ జిల్లాగా పేరొందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటువంటి సంఘటనలు అడపాదడపాజరుగుతూనే ఉంటాయి. ఈ క్రమంలో అసలు పాముకాటుకు గురైన వ్యక్తికి ఎటువంటి ప్రాథమిక చికిత్స అందించాలి..? పాము కాటుకు గురైన వ్యక్తిని ఎంత సమయంలో ఆసుపత్రికి తీసుకువెళ్లాలి? ఆసుపత్రికి తీసుకెళ్లే ముందు చేయవలసిన ప్రధమ చికిత్స ఏమిటి.? అనే విషయాలను ప్రముఖ స్నేక్ క్యాచర్ మిథున్ కుమార్ లోకల్ 18 కు వివరించారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.....

Tirumala Rs 300 Darshanam Tickets: తిరుమలలో రూ.300 దర్శనం టికెట్స్ కావాలా? సులువుగా పొందండి ఇలా

పాము కరిచిన తీరును బట్టి అది విషపూరితమా కాదా అనే విషయాన్ని ముందుగా నిర్ధారించుకోవలసి ఉంటుంది. పాము కరిచిన చోట రెండు కాట్లుపడి రక్తం వస్తే అదిఖచ్చితంగా విషపూరితమైన పాము అని నిర్ధారించుకోవలసి ఉంటుంది. పాము కరిచిన వ్యక్తిని సాధ్యమైనంత త్వరగా వైద్య చికిత్సను అందించడం ఎంతో ముఖ్యం. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపు పాము కరిచిన చోట చిన్న గాయాన్ని చేసి బ్లడ్ ప్రెజర్ ద్వారా విషాన్ని బయటికి లాగేయాలి.

అంతేకానీ నోటి ద్వారా తీస్తే తీసే వ్యక్తికి ప్రమాదం సంభవించే అవకాశం లేకపోలేదు. చాలామంది సరైన అవగాహన లేకుండా నోటితో విషయాన్ని తీసి అపాయాన్ని కొని తెచ్చుకున్న సంఘటనలు సైతం జిల్లాలో లేకపోలేదు. అలా చేయకుండా ఉండడం ఉత్తమం. అంతేకాకుండా పాము కాటుకు గురైన వ్యక్తిని కంగారు పెట్టకుండా గుండెకు కింది వైపున గాయం ఉండే విధంగా వ్యక్తిని చూడవలసి ఉంటుంది.‌

Trains Cancelled: సెలవుల్లో ఊరెళ్తున్నారా? విజయవాడ మీదుగా వెళ్లే ఈ రైళ్లు రద్దు

పాముకాటు గాయమైన పైభాగాన విషయం శరీరంలోకి పాకకుండా ఒక కట్టు బలంగా కట్టి, అనంతరం వీలైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్తే ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉంది. నలుగురు పాముకాటు గురైన వెంటనే నాటు వైద్యులను సైతం సంప్రదిస్తున్న పరిస్థితి ఉంది. ఇది అంత మంచి పద్ధతి కాదు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులలో పాముకాటుకు విరుగుడుకు ఇచ్చే యాంటీ ఇంజక్షన్ అందుబాటులో ఉంది. ఎటువంటి అజాగ్రత్త చేయకుండా వీలైనంత త్వరగా పాముకాటుకు గురైన వ్యక్తిని వైద్య చికిత్స అందించడం ఉత్తమమని అంటున్నారు.

2024-04-24T13:13:54Z dg43tfdfdgfd