పిల్లలు ధ్యానం ఆచరిస్తే ఇన్ని ఉపయోగాలా.. మరి ధ్యాన సాధన చేయిస్తే సరి !

మనిషి ఏకాగ్రతతో ఉండాలంటే ధ్యానం చాలా అవసరమని 25 సంవత్సరాలు గా ధ్యాన బోధ చేస్తున్న SN చారి అంటున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీ నగర్ లో గల రామకృష్ణ విద్యానికేతన్ ఆధ్వర్యంలో వేసవి సెలవుల్లో ఐదు నుంచి 10వ తరగతి విద్యార్థులకు ధ్యాన బోధ చేస్తున్నారు. చిన్నారుల్లో ఏకాగ్రత పెరిగి చదువుపై ఫోకస్ చేయాలంటే ధ్యానం చాలా అవసరని గత 25 సంవత్సరాలుగా ధ్యాన బోధ చేస్తున్న SN చారి అంటున్నారు.

ప్రతి మనిషి ఏకాగ్రతతో ఉన్నప్పుడే తను చేసే పనిలో కానీ, చదువులో కానీ, మరి ఏదైనా విషయంలో కానీ ఎలాంటి పొరపాట్లు లేకుండా చేస్తాడన్నారు. ఉదాహరణకు సూర్యకిరణాలను భూతద్దం నుంచి ఒక పేపర్ పై ఉంచినప్పుడు ఆ కాగితం కాలిపోతుంది. అదే సూర్యకిరణాల కింద పేపర్ పెడితే ఏ లాంటి శక్తి ఉండదు.

ఈ మాస్టార్ మల్టీ టాలెంట్ కి ఫిదా అవ్వాల్సిందే.. ఇదే అతడి ప్రతిభ..

అదే మనిషి కూడా ఏకగ్రతతో మనసును ఒకచోట ఉంచి పనిచేసినప్పుడు అందులో నుంచి ఒక శక్తి ఉత్పన్నమవుతుందన్నారు. అప్పుడు ఆ శక్తి మంచి కార్యాలకు ఉపయోగకరంగా ఉంటుందని ఆయన వివరించారు. చదువుకునే పిల్లల్లో చాలావరకు బుక్కు ముట్టగానే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది దాన్ని ధ్యానం ద్వారా కంట్రోల్ చేయవచ్చు.

మనసు ఏకగ్రతతో ఉన్నప్పుడు చదివిన ప్రతి అక్షరం మనసులో ముద్రించుకొని ఉంటుంది. ఎప్పుడు అడిగినా ఆ విషయం గురించి తప్పకుండా చెప్పగలుగుతాడు. మనసు ఏకగ్రత లేకుండా చదివినా వాటిని తొందరగా మర్చిపోతారని ఆయన అంటున్నారు. ప్రతి మనిషి జీవితంలో ధ్యానం అనేది చాలా ముఖ్యమైనది ధ్యానం వల్ల దృఢంగా మారుతాడు మనిషి. ధ్యానం ఓంకారం చేయడం చాలా బాగుంది. ఇంటి వద్ద మొబైల్ చూసే కంటే ఇక్కడికి వచ్చి ధ్యానం చేస్తుంటే చదువుపై ఏకగ్రత పెరుగుతుందని విద్యార్థులు చెబుతున్నారు.

2024-05-02T08:59:57Z dg43tfdfdgfd