పిల్లలకు స్కూల్ లో చేర్పించే ముందు ఇవి నేర్పించాల్సిందే...!

ఏదైనా తినే ముందు హ్యాండ్ వాష్ చేసుకోవాలి అనే విషయాన్ని కూడా నేర్పించాలి. చిన్న పిల్లలు కదా ఏం నేర్చుకుంటారు అనుకుంటాం. కానీ.. వారు ఈ వయసులోనే ఎక్కువగా నేర్చుకుంటారు.

 

ఈ రోజుల్లో పిల్లలను స్కూల్లో చేర్పించే ముందు.. కచ్చితంగా ప్రీ స్కూల్ లో చేర్పిస్తున్నారు. ఎందుకు అంటే... చదువుకంటే ముందు.. ప్రీ స్కూల్ లో పిల్లలు స్కూల్ కి అలవాటు పడతారు. అంతేకాదు... చాలా విషయాలు ప్రీ స్కూల్ లోనే నేర్చుకుంటారు. అయితే... మీరు మీ పిల్లలను ప్రీ స్కూల్ లో చేర్పించే ముందు ముందుగానే పేరెంట్స్ కొన్ని విషయాలు నేర్పించాలి. మరి ఎలాంటి విషయాలు నేర్పించాలో చూద్దాం...

చిన్నపిల్లలు ఏం చేసినా... వాళ్లకు ఏం తెలుస్తాయి..? చిన్నగా నేర్చుకుంటారులే అనుకుంటారు. కానీ.. మీరు పిల్లలను ప్రీ స్కూల్స్ లో చేర్పించేముందు వారికి మీరు కొన్ని పరిశుభ్రత గురించి నేర్పించాలి. ముఖ్యంగా టాయ్ లెట్ సీట్ పై కూర్చోవడం నేర్పించాలి. అంతేకాటు.. వారికి టాయ్ లెట్ కి వెళ్లాల్సి వస్తే... టీచర్స్ కి చెప్పాలి అనే విషయం కూడా నేర్పించాలి. వారు టీచర్స్ కి చెప్పడం వస్తే ఇబ్బంది ఉండదు.

ఇక.. ఏదైనా తినే ముందు హ్యాండ్ వాష్ చేసుకోవాలి అనే విషయాన్ని కూడా నేర్పించాలి. చిన్న పిల్లలు కదా ఏం నేర్చుకుంటారు అనుకుంటాం. కానీ.. వారు ఈ వయసులోనే ఎక్కువగా నేర్చుకుంటారు.

పిల్లలకు తల్లి, తండ్రి పేరు, వాళ్ల ఇంటి అడ్రస్, కనీసం ఫోన్ నెంబర్స్ అయినా నేర్పించాలి. పిల్లలు ఎక్కడికో తప్పిపోయినా.. వారి పేర్లు, తల్లిదండ్రుల పేర్లు తెలిస్తే పోలీసులకు మరింత సులువుగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో, ఈ విషయాలను చిన్న పిల్లలకు చాలా చిన్న వయస్సులోనే నేర్పించాలి.

పెద్దలను గౌరవించడం ఎంత ముఖ్యమో చిన్న పిల్లలకు నేర్పండి. మీ బిడ్డ ఏదైనా తప్పు చెబితే, మీరు వెంటనే వారికి వివరించాలి. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు చెప్పేది విస్మరిస్తారు. ఎవరితో అయినా అగౌరవంగా మాట్లాడితే అది చూసి ముద్దుగా మాట్లాడుతున్నారు అని  నవ్వుకుంటారు. కానీ ఆ పని చేయకూడదు. ఎదుటి వారిని గౌరవించాలి, ఎదైనా సహాయం చేస్తే థ్యాంక్స్ చెప్పాలి, తప్పు చేస్తే సారీ చెప్పాలి అనే విషయాలు నేర్పించాలి.

2024-05-07T09:14:04Z dg43tfdfdgfd