పెండింగ్ సీఎంఆర్​పై సర్కారు సీరియస్

పెండింగ్ సీఎంఆర్​పై సర్కారు సీరియస్

  • మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్ట్.. 125 శాతం ఫైన్ 
  • 12 శాతం వడ్డీతో 60 రోజుల్లో చెల్లించాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు: గత వానాకాలానికి సంబంధించిన కస్టమ్​ మిల్లింగ్​ రైస్​ (సీఎంఆర్) పెండింగ్ పై కఠినంగా వ్యవహరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రెవెన్యూ రికవరీ యాక్ట్ ను ప్రయోగించి, మిలర్ల నుంచి పెండింగ్ సీఎంఆర్ కు సంబంధించిన డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించింది. గత వానాకాలానికి సంబంధించి మిల్లర్ల నుంచి సివిల్ సప్లైస్ కు 2.49 లక్షల టన్నుల సీఎంఆర్  రావాల్సి ఉంది. గత కొన్ని నెలలుగా సీఎంఆర్ ఇవ్వకుండా మిల్లర్లు జాప్యం చేస్తున్నారు. 

దీంతో ఈ మిల్లర్లపై కఠినంగా వ్యవహరించి సీఎంఆర్ రికవరీ చేసి.. సీఎంఆర్ పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరతో పాటు 125% ఫైన్ వేయాలని సర్కారు నిర్ణయించింది. అలాగే, ఏడాదికి 12 శాతం వడ్డీతో సహా మిల్లర్ల నుంచి వసూలు చేయాలని సివిల్ సప్లై కమిషనర్ అధికారులను సర్కారు ఆదేశించింది. పెండింగ్ సీఎంఆర్ ఉన్న మిల్లర్ల నుంచి ఆయా జిల్లా కలెక్టర్లు, సివిల్ సప్లై జిల్లా అధికారులు ఈ నిధులను 60 రోజుల్లో వసూలు చేయాలని  ఉత్తర్వులు జారీ చేసింది.

©️ VIL Media Pvt Ltd.

2024-04-28T01:13:24Z dg43tfdfdgfd