పేదల ఆకలి తీరుస్తున్న వీళ్ళ సేవలకు సలాం..

కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో గత 13 ఏళ్లుగా వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చే రోగులకు రోగుల సహాయకులకు దాదాపుగా ప్రతిరోజు వెయ్యి మందికి పైగా ఉచితంగా మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తున్నారు సద్గురు దత్త కృపాలయం వారు. మానవసేవే మాధవసేవ అన్న సూక్తితో కర్నూలు జిల్లాకు చెందిన కె. చంద్రశేఖర్ రెడ్డి, క్రిష్ణ కుమారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ నిత్యాన్నదాన సేవ ఎంతోమంది పేదల ఆకలిని తీరుస్తుంది. ఆకలి అంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి లేదనకుండా అన్నం పెట్టే దంపతులు ఇద్దరిని చూసి ఎంతోమంది దైవ స్వరూపులుగా భావించి వారు చేస్తున్న సేవలను చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

2011లో మొదలైన ఈ ఉచిత అన్నదాన సేవ అంచలంచలుగా ఎదిగి ఇవాళ లక్షల మంది మన్ననలను పొందుతుంది. ఈ దంపతుల సేవలు మెచ్చిన కొంతమంది రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఈ నిత్యాన్న సేవలో భాగస్వాముల మౌతామంటూ వాలంటరీగా సేవ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇలాంటి గొప్ప కార్యక్రమాలు సద్గురుదత్త కృపాలయం వారు చేస్తున్నడంతో చాలామంది పేదల సైతం ఆ దంపతులిద్దరిని ఆది దంపతులుగా భావించి వారిద్దరికీ ప్రత్యేక కృతజ్ఞతలను తెలుపుకుంటున్నారు.

హమ్మయ్య.. థైరాయిడ్ సమస్యకు పరిష్కారం దొరికింది.. ఫ్రీగా దొరికే ఈ ఆకు తింటే చాలు.. 

ఇదిలా ఉంటే కర్నూల్ పట్టణంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో దాదాపుగా ప్రతిరోజు వెయ్యి మంది ఇన్ వార్డు పేషెంట్లకు ఉదయమే అన్న వితరణ టోకెన్లు జారీ చేసి మధ్యాహ్నం 12 అవగానే ఉచితంగా భోజనాన్ని అందిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ప్రతిరోజు ఏదో ఒక రకమైన స్వీటుతో పాటు పచ్చడి,సాంబార్,పెరుగు,మజ్జిగ, పప్పు, వంటి నాలుగు రకాల ఆహార పదార్థాలను అందిస్తున్నారు. సద్గురు దత్తకృపాలయంలో వంట చేసేవారు సైతం ఎంతో నియమ నిష్టతో పరిశుభ్రతతో ఉదయం నాలుగు గంటలకే లేచి అలాంటి స్నానమాచరించి ఆ భగవంతుని ప్రార్థిస్తూ వంట కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఉదయం 10:30 లోపు వంటలన్నీ పూర్తి చేసి ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించడం విశేషం.

ఎలాంటి లాభఫేక్షను ఆశించకుండా కె.చంద్రశేఖర్ రెడ్డి వారి సతీమణి క్రిష్ణ కుమారి పేదల ఆకలి తీర్చేందుకే గత 13 సంవత్సరాలుగా ఈ సేవకే అంకితమై ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను చేపట్టారు. అంతేకాకుండా ప్రతి పేదవారికి ఉచితంగా వైకుంఠ రథాన్ని ఏర్పాటు చేయడం. వారికి కర్మకాండలు బాడీ ప్రిజర్ బాక్స్లను అందజేయడం కూడా చేస్తూ నిజంగా భగవత్ స్వరూపులనిపించుకుంటున్నారు. వీళ్ళ సేవలు చూసిన జనం సైతం వీరిని భగవంతులుగా భావించి ఎంతో గౌరవమర్యాదులతో ఆరాధిస్తున్నారు...

2024-04-20T11:51:06Z dg43tfdfdgfd