పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా.. అయితే ఈ గ్రంథాలయం కల్పించిన సూపర్ ఛాన్స్..

ప్రస్తుతం పోటీ పరీక్షల కాలం ఇది. ఈ నేపథ్యంలో ఎందరో నిరుద్యోగులు ఉచిత కోచింగ్ సెంటర్లలో చేరేందుకు అమిత ఆసక్తి చూపుతుంటారు. మరి కొందరు వేల రూపాయల డబ్బులు వెచ్చించి కోచింగ్ సెంటర్ల బాట పడుతుంటారు. కానీ ఈ గ్రంథాలయంలో గల పుస్తకాలను పఠిస్తే చాలు వారికి ప్రభుత్వ ఉద్యోగం గ్యారెంటీ. అటువంటి గ్రంథాలయం ఎక్కడ ఉందో తెలుసా మన సంగారెడ్డి లో గల జిల్లా కేంద్ర గ్రంథాలయమే..

సంగారెడ్డి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జ్ఞానాన్ని పెంపొందించేటటువంటి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ఇక్కడ 200కు పైగా భాషల్లో పలు పుస్తకాలు ఉన్నాయట. అయితే ఈ గ్రంథాలయం కలిగించే అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయాల శాఖ అధికారిని వసుంధర తెలిపారు. లోకల్18 తో ఆమె మాట్లాడుతూ .. ఈ గ్రంథాలయంలో ఆన్లైన్ సభ్యత్వ నమోదుకు అవకాశం ఉందని , ఆన్లైన్లో www.ndli.com ఈ వెబ్సైట్ ద్వారా లాగిన్ అయి రిజిస్టర్ ద్వారా తమ పేర్లను, పూర్తి వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. అన్ని వివరాలను నమోదు చేసిన అనంతరం ఒక ఐడి క్రియేట్ అవుతుందని, ఈ ఐడి ద్వారా స్మార్ట్ ఫోన్లోనే గ్రంథాలయంలో లభించే పుస్తకాలను చదువుకునే అవకాశం ఉంటుందన్నారు.

---- Polls module would be displayed here ----

అంతే కాకుండా తమ గ్రంథాలయం వద్ద కు వచ్చే పాఠకుల కోసం ఉచితంగా వైఫైను సైతం ఏర్పాటు చేశామన్నారు. కోచింగ్ సెంటర్లకు ధీటుగా తమ గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం ఎన్నో పుస్తకాలు ఉన్నాయని, వీటిని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని వసుంధర కోరారు. మరి ఇంకెందుకు ఆలస్యం .. గ్రంథాలయంకు వెళ్ళకుండా .. ఆన్లైన్ లో సైతం పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉండడం ఈ గ్రంథాలయం ప్రత్యేకత. వెంటనే రిజిష్టర్ చేసుకోండి మరి.

2024-04-23T12:25:08Z dg43tfdfdgfd