ప్రజ్వల్ వీడియోల పేరిట .. 25 వేలపెన్ డ్రైవ్‌‌‌‌లు పంచి పెట్టారు : కుమారస్వామి

ప్రజ్వల్ వీడియోల పేరిట .. 25 వేలపెన్ డ్రైవ్‌‌‌‌లు పంచి పెట్టారు : కుమారస్వామి

బెంగళూరు: ఎన్నికల వేళ ప్రజ్వల్ రేవణ్ణవిగా ఆరోపిస్తూ అభ్యంతరకర వీడియోలున్న 25 వేల పెన్ డ్రైవ్‌‌‌‌లను పంచారని కర్నాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్ డీ కుమారస్వామి విమర్శించారు. జేడీఎస్ ను దెబ్బతీయాలనే ఈ కుట్ర వెనక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఉన్నారని మండిపడ్డారు. మంగళవారం కుమారస్వామి మీడియాతో మాట్లాడారు." మహిళలపై ప్రజ్వల్ లైంగిక వేధింపులకు పాల్పడిన వీడియోలుగా ఆరోపిస్తూ.. మొదటి పెన్ డ్రైవ్ ను ఏప్రిల్ 21న బెంగళూరు రూరల్ నియోజకవర్గంలో రిలీజ్ చేశారు. 

దీనిపై ఏప్రిల్ 22న మా పోలింగ్ ఏజెంట్ పూర్ణచంద్ర.. పోలీసులకు, రిటర్నింగ్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేశారు. నవీన్‌‌‌‌గౌడ్‌‌‌‌, కార్తీక్‌‌‌‌గౌడ్‌‌‌‌ (రేవణ్ణ డ్రైవర్‌‌‌‌), చేతన్‌‌‌‌, పుట్టరాజు అలియాస్‌‌‌‌ పుట్టి సహా ఐదుగురిపై కేసు నమోదైంది. కేసు బుక్ చేసి 15 రోజులు అవుతున్న నిందితులపై ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు. వీడియోల విడుదల ద్వారా మహిళల పరువు తీసిన వారిని మొదట అరెస్టు చేయాలి” అని డిమాండ్​ చేశారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-08T01:51:47Z dg43tfdfdgfd