ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం.. ఎందుకంటే..?

ప్రధాని నరేంద్ర మోదీని దివంగత మాజీ ప్రధాని నరసింహారావు కుటుంబం హైదరాబాద్ లో కలిసింది. పీవీ గారికి మరణానంతరం భారతరత్న ప్రదానం చేసినందుకు ఆయన కుటుంబ సభ్యులు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. 

         

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరుకుంది. పోలింగ్‌కు కేవలం ఆరు రోజుల సమయం మాత్రమే ఉండటంతో అన్ని రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయడానికి స్వయంగా ప్రధాని మోడీ రంగంలో దిగారు. ఈ క్రమంలో కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో నిర్వహించనున్న సభల్లో ప్రధాని  పాల్గొనున్నారు. 

 ఇదిలా ఉంటే..  దివంగత మాజీ ప్రధాని నరసింహారావు కుటుంబం హైదరాబాద్ లో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.  మాజీ ప్రధాని పీవీ గారికి భారతరత్న ప్రదానం చేసినందుకు ఆయన కుటుంబ సభ్యులు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. 

ఇటీవల మాజీ ప్రధాని, తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు గారెకి  కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం  అందించిన విషయం తెలిసిందే. భారత పీవీ నరసింహారావు తరఫున ఆయన కుమారుడు ప్రభాకర్ రావు అవార్డు స్వీకరించిన విషయం తెలిసిందే..  

ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేస్తూ.. పీవీ సేవలను ప్రతి భారతీయుడూ గుర్తించుకుంటాడని కొనియాడారు. పివి గారు మన దేశానికి అందించిన సేవలు చిరస్మరనీయమనీ, ఆయనకు భారతరత్న లభించడం గర్వంగా ఉందని అన్నారు.

2024-05-07T17:45:41Z dg43tfdfdgfd