ప్రభుత్వ పాఠశాల విద్యార్థినికి టెన్త్‌లో 593 మార్కులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలువడిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో కర్నూలు జిల్లాకు చెందిన షైక్ హ్యూమేరా ఇక్బాల్ అనే ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి సత్తా చాటారు. కర్నూల్ పట్టణంలోని పాతబస్తీలో గల కడపుర వీధిలో నివాసం ఉంటున్న షేక్ ఇక్బాల్ బాషా, షేక్ ఆసియా తాసిన్ దంపతుల కుమార్తె షేక్ హ్యూమేరా ఇక్బాల్ అనే విద్యార్థిని కర్నూల్ పట్టణంలోని కంట్రోల్ రూమ్ సమీపంలో ఉన్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ 10వ తరగతిలో తనదైన శైలిలో సత్తా చాటారు.

పదవ తరగతి పరీక్ష ఫలితాలు వెలువడిన సందర్భంగా 600 మార్కులకు గాను 593 మార్కులతో జిల్లా టాపర్ లిస్టులో ఒకరిగా నిలిచింది. ఈ పరీక్ష ఫలితాల్లో ఫస్ట్ లాంగ్వేజ్ 100 మార్కులు, సెకండ్ లాంగ్వేజ్ 100 మార్కులు,థర్డ్ లాంగ్వేజ్ 94 మార్కులు, మ్యాథ్స్ 100 మార్కులు, సైన్స్ 99 మార్కులు, సోషల్ స్టడీస్ లో 100 మార్కులు సాధించి స్కూల్ ఫస్ట్ వచ్చింది. దీంతో తమ కూతురు పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 593 మార్కులు సాధించడంతో తల్లిదండ్రుల ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి.

Ooty Tour: బెంగళూరు, మైసూర్, ఊటీ టూర్... తక్కువ ధరకే తెలంగాణ టూరిజం ప్యాకేజీ

తమ కూతురు పదవ తరగతి పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అవడంతో ఆ తల్లిదండ్రులు వీధిలో ఉండే వారికి అంత మిఠాయిలు పంచిపెట్టి ఆనందంతో సంబరాలు జరుపుకున్నారు. ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తమ కూతురు పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వడం చాలా సంతోషకరమైన విషయం అని తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు.

అంతేకాకుండా ఆ విద్యార్థి సైతం తను ఇంతటి ఘన విజయాన్ని సాధించడానికి తన పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయలక్ష్మి, మిగతా టీచర్స్ తనకు ఎంతో సపోర్టుగా నిలిచి ఎప్పుడు ఎలాంటి డౌట్స్ అడిగిన విసుక్కోకుండా మంచిగా చెప్పి సపోర్ట్ చేసేవారని ముఖ్యంగా మా ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు.

Tirupati Trains: వేసవి సెలవుల ఎఫెక్ట్... హైదరాబాద్ నుంచి తిరుపతికి మరిన్ని ట్రైన్స్

అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ఏదో ప్రైవేట్ పాఠశాలల్లో చదివితేనే మంచి మార్కులు వస్తాయని ఆలోచిస్తుంటారు. కానీ ప్రభుత్వ పాఠశాలలో చెప్పే ఉపాధ్యాయులు ఎంతో నైపుణ్యం కలవాలని వారు పరీక్షలు రాసి పాసయ్యాకే టీచర్ ఉద్యోగం పొంది విద్యార్థులకు పాఠాలు బోధించడానికి ఎంపిక అవుతారని తెలిపారు.

కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శంగా తీసుకోవాలి అని కోరారు. అంతేకాకుండా ఇదే స్ఫూర్తితో తాను నీట్ పరీక్షలు రాసి ఎంబిబిఎస్ డాక్టర్ కావాలనే గోల్కా పెట్టుకొని చదువుతానని ఫ్యూచర్ లో ఒక మంచి డాక్టర్ గా ఎదిగి ఎంతోమందికి సేవ చేస్తానని తెలిపింది.

2024-04-23T04:53:53Z dg43tfdfdgfd