ప్రైవేట్ ప్లేన్లు, హెలికాప్టర్లకు ఫుల్‌‌‌‌‌‌‌‌ గిరాకీ

ప్రైవేట్ ప్లేన్లు, హెలికాప్టర్లకు ఫుల్‌‌‌‌‌‌‌‌ గిరాకీ

  • ఎన్నికల టైమ్‌‌‌‌‌‌‌‌ కావడంతో 40 శాతం పెరిగిన బుకింగ్స్
  • డిమాండ్‌‌‌‌‌‌‌‌కు సరిపడా అందుబాటులో లేకపోవడంతో లీడర్ల తిప్పలు
  • హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గంటకు రూ.3.5 లక్షలు, ప్లేన్‌‌‌‌‌‌‌‌కు రూ.5.25 లక్షల వరకు చార్జ్ 

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల వేళ ప్రైవేట్ ప్లేన్లు, హెలికాప్టర్లకు మస్తు డిమాండ్ పెరిగింది. దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించేందుకు వివిధ పార్టీల ముఖ్య నేతలు ప్లేన్లు, హెలికాప్టర్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇందుకోసం ముందుగానే బుకింగ్స్ చేసుకుంటున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే బుకింగ్స్ 40 శాతం పెరిగాయి. అయితే డిమాండ్‌‌‌‌‌‌‌‌కు సరిపడా ప్రైవేట్ జెట్స్, చాపర్స్ అందుబాటులో లేవు. దీంతో ప్రైవేట్ ఆపరేటర్లు రేట్లు పెంచేశారు. విమానానికి గంటకు రూ.4.5 లక్షల నుంచి రూ.5.25 లక్షల వరకు చార్జ్ చేస్తున్నారు. హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గంటకు రూ.3.5 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. గత లోక్ సభ ఎన్నికలతో పోలిస్తే ప్లేన్లు, హెలికాప్టర్లకు ఈసారి డిమాండ్ బాగా పెరిగిందని రోటరీ వింగ్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డబ్ల్యూఎస్ఐ) ప్రెసిడెంట్ కెప్టెన్ ఉదయ్ గెల్లి తెలిపారు. ‘‘మారుమూల ప్రాంతాలకు తక్కువ టైమ్‌‌‌‌‌‌‌‌లో వెళ్లేందుకు నేతలు ఎక్కువగా హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటికి 25 శాతం డిమాండ్ పెరిగింది. కానీ సరిపడా అందుబాటులో లేవు. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఏపీ లాంటి పెద్ద రాష్ట్రాల్లో హెలికాప్టర్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు”అని ఆయన వెల్లడించారు. 

రోజుల వారీగా అద్దె.. 

గత లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ప్లేన్లకు 30 నుంచి 40 శాతం డిమాండ్ పెరిగిందని బిజినెస్ ఎయిర్ క్రాఫ్ట్ ఆపరేటర్స్ అసోసియేషన్ (బీఏవోఏ) ఎండీ కెప్టెన్ ఆర్కే బాలీ తెలిపారు. ‘‘విమానాలు అడ్వాన్స్ బుకింగ్ అవుతున్నాయి. ఆపరేటర్లు డిమాండ్‌‌‌‌‌‌‌‌కు సరిపడా సప్లై చేయలేకపోతున్నారు. గంటల వారీగా కాకుండా రోజుల వారీగా అద్దెకు ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నారు. విమానాలకు గంటకు రూ.4.5 లక్షల నుంచి రూ.5.25 లక్షల వరకు తీసుకుంటున్నారు” అని పేర్కొన్నారు. ‘‘సాధారణ రోజుల్లో సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గంటకు రూ.80 వేల రూ.90 వేలు చార్జ్‌‌‌‌‌‌‌‌ ఉంటుంది. ట్విన్ ఇంజిన్‌‌‌‌‌‌‌‌ది అయితే రూ.1.5 లక్షల నుంచి రూ.1.7 లక్షలు వసూలు చేస్తారు. కానీ ఇప్పుడు ఎలక్షన్ టైమ్ కాబట్టి సింగిల్ ఇంజిన్‌‌‌‌‌‌‌‌కు రూ.1.5 లక్షల వరకు, ట్విన్ ఇంజిన్ అయితే రూ.3.5 లక్షల వరకు చార్జ్ చేస్తున్నారు”అని వెల్లడించారు. కాగా, మన దేశంలో 112 ప్రైవేట్ సంస్థలు ఫ్లైట్, హెలికాప్టర్ సర్వీసులు అందిస్తున్నాయి. 2019 లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల టైమ్‌‌‌‌‌‌‌‌లో ప్లేన్లు, హెలికాప్టర్ల కోసం బీజేపీ రూ.250 కోట్లు ఖర్చు చేయగా, కాంగ్రెస్ రూ.126 కోట్లు ఖర్చు చేసింది.

©️ VIL Media Pvt Ltd.

2024-04-19T03:45:43Z dg43tfdfdgfd