బంపరాఫర్: సివిల్ ఏవియేషన్ మంత్రిత్వశాఖలో కన్సల్టెంట్ పోస్టులు..పరీక్ష లేకుండానే ఎంపిక

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ.. వివిధ కేటగిరీలలో కన్సల్టెంట్ (FOI)పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అధికారిక వెబ్‌సైట్ civilaviation.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 17 పోస్టులను భర్తీ చేయనుంది. మీరు కూడా ఈ పోస్ట్‌లలో ఉద్యోగం పొందాలని కోరుకుంటే.. మే 8 లోపు ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అప్లయ్ చేసేముందు పోస్టుల వివరాలు,అర్హతలు, వయోపరిమితి తదితర వివరాలు తెలుసుకోవడం ముఖ్యం. వీటన్నింటికి సంబంధించిన వివరాలను ఇక్కడ చూడండి.

పోస్టుల వివరాలు

కన్సల్టెంట్ {సీనియర్ ఫ్లయింగ్ ఆపరేషన్ ఇన్‌స్పెక్టర్ (విమానం)} – 02 పోస్టులు

కన్సల్టెంట్ {ఫ్లయింగ్ ఆపరేషన్ ఇన్‌స్పెక్టర్ (విమానం)} – 10 పోస్టులు

కన్సల్టెంట్ {ఫ్లయింగ్ ఆపరేషన్ ఇన్‌స్పెక్టర్ (హెలికాప్టర్)} – 05 పోస్టులు

భారీ శుభవార్త..10వ తరగతి అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు..దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

 వయోపరిమితి 

దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితి 64 ఏళ్లు మించకూడదు.

విద్యార్హత

దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులందరూ 10+2 లేదా ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి.

అప్లికేషన్ లింక్, నోటిఫికేషన్‌ను ఇక్కడ చూడండి

Civil Aviation Ministry Recruitment 2024అప్లయ్ చేయడానికి లింక్

Civil Aviation Ministry Recruitment 2024 నోటిఫికేషన్

జీతం

కన్సల్టెంట్ {సీనియర్ ఫ్లయింగ్ ఆపరేషన్ ఇన్‌స్పెక్టర్ (విమానం)} – రూ 746000

కన్సల్టెంట్ {ఫ్లయింగ్ ఆపరేషన్ ఇన్‌స్పెక్టర్ (విమానం)} – రూ 502800

కన్సల్టెంట్ {ఫ్లయింగ్ ఆపరేషన్ ఇన్‌స్పెక్టర్ (హెలికాప్టర్)} – రూ 282800

2024-04-25T15:03:05Z dg43tfdfdgfd