బాలు అనుకొని బాంబుని తన్నిన బాలుడు.. తర్వాత షాకింగ్.. ఎన్నికల వేళ తీవ్ర దుమారం

ఓ బాలుడు బాల్ అనుకొని పొరపాటున నాటు బాంబును కాలితో తన్నాడు. దీంతో అది భారీ శబ్దంతో పేలిపోయింది. అయితే ఈ ఘటనలో తీవ్రంగా గాయడిన బాలుడిని హాస్పిటల్ కి తరలించగా..ట్రీట్మెంట్ పొందుతూ బాలుడు మరణించాడు. ఇదే ఘటనలో మరో ఇద్దరు బాలురు గాయపడ్డారు. వెస్ట్ బెంగాల్ లో సోమవారం ఉదయం 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే ఎన్నికల సమయం కావడంతో ఈ ఘటన రాజకీయరంగు పులుముకుంది. ఎన్నికలకు ముందు దాడులకు పేలుడు పదార్థాలను నిల్వ ఉంచుకున్నారని బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. ఘటన జరిగిన ప్రాంతంలో టీఎంసీ అగ్రనేత, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ బహిరంగ సభ జరిగే కొద్దిసేపటిముందు ఈ ఘటన జరగడం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హుగ్లీ జిల్లాలోని పాండువా గ్రామంలో రాజ్ బిస్వాస్ (11)అనే బాలుడు సోమవారం ఉదయం 8 గంటల సమయంలో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఇంటి దగ్గర్లో ఆడుకుంటున్న సమయంలో బాల్ అనుకొని ఓ నాటు బాంబును కాలితో తన్నాడు. దీంతో అది వెంటనే భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ ఘటనలో రాజ్ బిస్వాస్ తో పాటు మరో ఇద్దరు బాలురకు గాయాలయ్యాయి. వారిని గమనించిన స్థానికులు వెంటనే సమీపంలోని పాండువా రూరల్ గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. రాజ్ బిస్వాస్‌ పరిస్థితి విషమించడం వల్ల అక్కడి నుంచి చుంచుర ఇమాంబర హాస్పిటల్ కి తరలించగా ట్రీట్మెంట్ పొందుతూ మృతిచెందాడు. రాజ్ బిస్వాస్‌.. బుర్ద్వాన్‌కు చెందిన వాడని, వేసవి సెలవుల్లో పాండువాలోని తన మామయ్య ఇంటికి వచ్చాడని పోలీసులు తెలిపారు. గాయపడిన మరో ఇద్దరు బాలురను రూపమ్ బల్లభ్ (13), సౌరవ్ చౌదరి (13)గా గుర్తించారు. వీళ్లు ఏడో తరగతి చదువుతున్నట్లు తెలిపారు. రూపమ్ చేతులకు గాయాలవగా, సౌరవ్ కాలికి గాయాలయ్యాయి.

ఒక సంవత్సరం పాటు స్నానం చేయకపోతే ఏమవుతుంది? ముక్కు మూసుకోకుండా ఇది తెలుసుకోండి

ఈ ఘటనపై బీజేపీ హూగ్లీ ఎంపీ లాకెట్ ఛటర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పేలుడుకు టీఎంసీనే కారణమని ఆరోపించారు. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేందుకు టీఎంసీ ఇలాంటి విధ్వంసకర మార్గాలను ఆశ్రయిస్తోందన్నారు. అయితే, లాకెట్ ఛటర్జీ స్వయంగా బయటి వ్యక్తులతో కలిసి రెండు రోజుల క్రితం ఈ ప్రాంతాన్ని సందర్శించారని,దీనిని బట్టి బాంబును ఎవరు తీసుకువచ్చారో స్పష్టంగా తెలుస్తుందని TMC జిల్లా అధ్యక్షురాలు అసీమా పాత్ర ప్రతిస్పందించారు.

2024-05-07T10:33:40Z dg43tfdfdgfd