బీఆర్ఎస్ ఎక్కడా కూడా గెలిచే పరిస్థితి లేదు : తీన్మార్ మల్లన్న

బీఆర్ఎస్  ఎక్కడా కూడా గెలిచే పరిస్థితి లేదు :  తీన్మార్ మల్లన్న 

కేసీఆర్ ప్రస్థానం ఎక్కడ మొదలైందో అక్కడికే చేరకుందని చెప్పారు  ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ జిల్లాల పట్టభద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్‌).  ఒక్కడితో ఉద్యమం మొదలు పెట్టానని చెప్పే కేసీఆర్ ఇప్పుడు ఒంటరిగానే మిగిలారన్నారు.   కేసీఆర్ వెంట ఉద్యమకారులు ఎవరూ లేరన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో  బీఆర్ఎస్  పరిస్థితి దింపుడు కళ్లెం లాగా ఉందని..  ఎక్కడా కూడా గెలిచే పరిస్థితి లేదన్నారు. వరంగల్ లో తీన్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడారు.  

అన్ని స్థానాల్లో డమ్మీ అభ్యర్థులను నిలబెట్టి బీజేపీ మెప్పు పొందేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు తీన్మార్ మల్లన్న. అవినీతిపరులను బీజేపీలోకి పంపిందే కేసీఆర్ అని చెప్పారు. వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరురి రమేష్ కు కేసీఆర్ ఆశీస్సులు ఉన్నాయన్నారు.  తమ సర్వేల్లో కడియం కావ్య అత్యధిక మోజార్టీతో గెలవబోతుందని తేలిందన్నారు 

ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన మోడీ హయాంలో 50 వేల ఉద్యోగాలు పోయాయని ఆరోపించారు తీన్మార్ మల్లన్న. ఇండియా కూటమి కేంద్రంలో అధికారం లోకి వస్తే 50 శాతం బీసీల కు రిజర్వేషన్ ఇస్తుందని తెలిపారు.  ఎస్సీ,ఎస్టీ, బీసీలకు జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్లు కాంగ్రెస్ కల్పిస్తుందని చెప్పుకొచ్చారు.  బీజేపీ ఓటేస్తే వన్ నేషన్ కాదు..  దేశంలో జీరో ఎలక్షన్ అవుతుందన్నారు.  మోడీ నిర్ణయాలు దేశానికి మంచివి కావన్నారు.  పట్టభద్రుల ఎమ్మెల్సీ  ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు.  ప్రతి ప్రభుత్వంలో ఏసీబీ తరహాలోనే మండలిలో తన పాత్ర పోషిస్తానని చెప్పారు.

©️ VIL Media Pvt Ltd.

2024-04-29T07:18:23Z dg43tfdfdgfd