‘బీజేపీ ఎప్పటికీ బలమైన దేశాన్ని తయారు చేయలేదు’.. నిజంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారా?

దేశంలో మరోసారి మోదీని ప్రధానిగా చేసే లక్ష్యంతో బీజేపీ పని చేస్తోంది. అబ్‌కీ బార్‌ మోదీ సర్కార్‌ నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఎన్డీఏ కూటమికి 400పైగా సీట్లు వస్తాయనే దీమాతో బీజేపీ అగ్రనేతలు ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో మోదీకి సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఓ ర్యాలీలో మోదీ మాట్లాడుతూ.. ‘బీజేపీ ఎప్పటికీ బలమైన భారతదేశాన్ని తయారు చేయలేదు’ అని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వీడియోను చాలా మంది సోషల్‌ మీడియా యూజర్లు పోస్టు చేస్తున్నారు.

ప్రస్తుతం అసత్య ప్రచారాలకు సోషల్‌ మీడియా అడ్డాగా మారింది. వైరల్‌ వీడియోల్లో వాస్తవం ఎంత? అనేది నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మోదీ వైరల్‌ వీడియోపై PTI ఫాక్ట్ చెక్ డెస్క్ ఇన్వెస్టిగేషన్‌ చేసింది. చివరికి ఏం తేల్చింది?

(PTI ఫాక్ట్ చెక్ డెస్క్ ఇన్వెస్టిగేషన్ చేసిన స్టోరీ ఇది)

* జరుగుతున్న ప్రచారం ఏంటి?

క్రింద స్రీన్ షాట్ కింద సంబంధించిన వీడియో లింక్ చూడండి

ఒక ఫేస్‌బుక్ యూజర్‌ ఏప్రిల్ 26న ప్రధాని మోదీ ర్యాలీలో ప్రసంగించిన వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో.. బీజేపీ ఎప్పటికీ బలమైన భారతదేశాన్ని తయారు చేయలేదని మోదీ చెబుతున్న వినిపిస్తోంది. పోస్ట్ క్యాప్షన్‌లో.. ‘భాజపా ప్రభుత్వం భారతదేశాన్ని ఎప్పటికీ బలోపేతం చేయలేదని మోదీ చెబుతున్నారు, ఫలితాన్ని చూడండి’ అని రాశారు.

* ఇన్వెస్టిగేషన్‌లో ఏం తెలిసింది?

క్రింద స్రీన్ షాట్ కింద సంబంధించిన వీడియో లింక్ చూడండి

పీటీఐ ఫ్యాక్ట్‌ చెక్‌ డెస్క్ వైరల్‌ వీడియోను ఇన్‌విడ్ టూల్ సెర్చ్ ద్వారా రన్ చేసింది. వీడియో అనేక కీఫ్రేమ్‌లను ఎక్స్‌ట్రాక్ట్‌ చేసింది. గూగుల్‌ లెన్స్ ద్వారా కీఫ్రేమ్‌లలో ఒకదానిని రన్ చేస్తున్నప్పుడు, అదే వీడియోతో ఉన్న ఒక X పోస్ట్‌ బయట పడింది. అనంతరం ఏప్రిల్ 21న నరేంద్ర మోదీ అధికారిక ఛానెల్‌లో అప్‌లోడ్ అయిన యూట్యూబ్‌ లైవ్‌ని డెస్క్‌ కనుక్కొంది.

* యూట్యూబ్‌ వీడియో

యూట్యూబ్ వీడియో ప్రకారం.. ఎన్‌డీఏ స్టార్ క్యాంపెయినర్ ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్‌లో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. జాలోర్‌ ప్రజలతో మాట్లాడిన ప్రధాని మోదీ, పక్కా ఇల్లు లేని వారికి మోదీ హామీ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సారి గెలిచాక నిర్మించనున్న 3 కోట్ల ఇళ్లలో ఒకటి మీకూ చెందుతుందని పేర్కొన్నారు. శాశ్వత ఇల్లు అందని కుటుంబాలలోని సోదరీమణులకు ఈ ఇళ్లను వారి పేర్లపైనే కేటాయిస్తామని ప్రజలకు తెలియజేయాలని కోరారు.

స్క్రీన్ షాట్‌కు సంబంధించిన లింక్ ఇక్కడ చూడండి

వీడియోలో 17:55 నిమిషాల టైమ్‌స్టాంప్ వద్ద క్లిప్‌ని వైరల్‌ వీడియో అసత్య ప్రచారానికి వాడుకున్నట్లు పీటీఐ టీమ్‌ తెలుసుకుంది. ర్యాలీలో మోదీ ప్రసంగిస్తూ, తొలి దశ ఎన్నికల్లో రాజస్థాన్‌లో సగం మంది కాంగ్రెస్‌ను శిక్షించారని చెప్పారు. 17 నిమిషాల 50 సెకన్ల టైమ్‌స్టాంప్‌లో, ‘రాజస్థాన్ జాతీయవాదంతో నిండి ఉంది. కాంగ్రెస్ భారతదేశాన్ని ఎప్పటికీ బలోపేతం చేయలేదని ప్రజలకు తెలుసు’ అని చెప్పారు.

స్క్రీన్ షాట్‌కు సంబంధించిన లింక్ ఇక్కడ చూడండి

ఇండియా టీవీ రిపోర్టు: దీని ఆధారంగా సెర్చ్‌ చేయగా ఏప్రిల్ 21న ఇండియా టీవీ నివేదిక బయటపడింది. అందులో ‘కాంగ్రెస్‌ భారత్‌ను ఎప్పటికీ బలోపేతం చేయలేదు, అస్థిరతకు ప్రతీక’ అని రాజస్థాన్‌లో ప్రధాని మోదీ అన్నారనే టైటిల్‌ ఉంది.

* చివరికి ఏం తేలింది?

ప్రధాని మోదీ ప్రసంగంలోని కొంత భాగాన్ని డిజిటల్‌గా ఎడిట్‌ చేసి అసత్యం ప్రచారం చేస్తున్నట్లు తేలింది. సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్న వీడియో అవాస్తవమని పీటీఐ ఫ్యాక్ట్ చెక్‌ టీమ్‌ స్పష్టం చేసింది.

(శక్తి కలెక్టివ్‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా PTI Factcheck అందించిన ఇన్‌పుట్స్ ఆధారంగా ఈ కథనం పబ్లిష్ చేశాం.)

2024-05-06T07:30:10Z dg43tfdfdgfd