బ్రిటిషుల సమాధులు భద్రాద్రి ఏజెన్సీలో పదిలం..!!

భారత స్వాతంత్రానికి ముందు సుమారు 200 సంవత్సరాలు పైగా బ్రిటిషు దేశస్థులు భారతదేశాన్ని పరిపాలించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో స్థావరాలను ఏర్పాటు చేసుకొని దేశ ప్రజలను పరిపాలించారు. ఈ నేపథ్యంలోనే మారుమూల ఏజెన్సీ జిల్లాగా పేరుందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సైతం బ్రిటిషర్లు ఆనవాళ్లు నాటి సంఘటనలకు చారిత్రక ఆధారాలుగా సజీవ సాక్షాలుగా దర్శనమిస్తున్నాయి.‌ ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో బ్రిటీష్సర్లకు సంబంధించిన సమాధులు భద్రాద్రి ఏజెన్సీలో నేటికీ కనిపిస్తుండడం విశేషం.

ఈ క్రమంలో ఓ ప్రభుత్వ ఉద్యోగి బ్రిటిష్ లకు ఏజెన్సీతో ఉన్న సంబంధంపై అనేక పరిశోధనలు చేసి అనేక గ్రంథాలను చదివిన తర్వాత తాను కూడా నిరంతర యాత్రికుడు అని ఓ పుస్తకాన్ని రచించాడు. ఆ పుస్తకంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని దుమ్ముగూడెం గ్రామంలో ఉన్న తెల్లవారి సమాధులపై.. పలు ప్రస్తావనలు చేశాడు. ఈ నేపథ్యంలో సదరు రచయిత ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న కె.వి.వి.ఎస్ మూర్తిని లోకల్ 18 పలకరించగా... తెల్లోళ్ల సమాధులపై పలు ఆసక్తికర విషయాలను ఆయన పంచుకున్నారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే...

ప్రధాని మోడీ కోసం చేనేత కార్మికుడి వినూత్న ఆవిష్కరణ..

నా పేరు కె.వి.వి.ఎస్ మూర్తి ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్నాను. గత 35 సంవత్సరాల క్రితం మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతానికి విధి నిర్వహణలో భాగంగా రావడం జరిగింది.‌ ఆనాడు ఇరుగు పొరుగువారు ఈ తెల్లోల్ల సమాధులపై చర్చించుకుంటే సహజంగానే కుతుహులం ఏర్పడింది. అనంతరం ఈ ప్రాంతాన్ని సందర్శించగా నాటి చారిత్రక సంఘటనలకు సంబంధించిన నిదర్శనంగా నాకు అనిపించింది. మారు మూలప్రాంతమైన దుమ్ముగూడెం లాంటి గ్రామంలో బ్రిటిషర్లకు సంబంధించిన సమాధులు ఉండడం నన్ను ఆసక్తికి గురిచేసింది.

టీవీ, ఫ్రిజ్, ఫ్యాన్, కుక్కర్లు, హీటర్ రిపేర్.. ఈ ఎలక్ట్రీషియన్ చేయి పడితే పని చేయాల్సిందే!

ఈ క్రమంలో అసలు విషయం తెలుసుకునేందుకు అనేక పరిశోధనలు, అనేక గ్రంథాలను తిరగేసిన తర్వాత బ్రిటిష్ కాలంలో ఓ పోలీసు ఉన్నతాధికారితో పాటు, ఆ కాలంలో వైద్యుడిగా ఉన్నటువంటి మరో వ్యక్తి, ఓ మత ప్రబోధకుడు, దక్షిణ భారతదేశానికి సంబంధించి ఆనాడు బ్రిటిష్ సైన్యంలో కీలకంగా వ్యవహరించిన ఓ పోలీసు ఉన్నతాధికారి సంబంధించినటువంటి సమాధులను ఈ ప్రాంతంలో ఆనాడే ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తించాను. భావితరాలకు ఈ చరిత్ర తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం ఈ సమాధుల రక్షణకు చర్యలు తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయాన్ని రచయిత, ప్రభుత్వ ఉపాధ్యాయుడు మూర్తి వెల్లడిస్తున్నారు.

2024-05-08T09:07:18Z dg43tfdfdgfd